|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నిఖిల్ ‘స్వయంభు’ విడుదల వాయిదా! కొత్త తేదీ ఖరారు! అభిమానులకు షాక్!

Published: 24-01-2026, 5:05 AM
నిఖిల్ 'స్వయంభు' విడుదల వాయిదా! కొత్త తేదీ ఖరారు! అభిమానులకు షాక్!
  • నిఖిల్ నటించిన ‘స్వయంభు’ సినిమా ఫిబ్రవరి 13 నుండి ఏప్రిల్ 10కి వాయిదా పడింది.
  • ఈ మైథాలజికల్ పిరియాడిక్ డ్రామాలో నిఖిల్ యోధుడిగా కనిపించనున్నాడు, సంయుక్త మీనన్ హీరోయిన్.
  • విఎఫ్ఎక్స్ పనులు పూర్తి కాకపోవడంతో సినిమా విడుదల వాయిదా పడినట్లు సమాచారం.
  • ఈ చిత్రం తెలుగుతో పాటు మరో ఏడు భాషల్లో విడుదల కానుంది.

నిఖిల్ సిద్ధార్థ నటించిన ‘స్వయంభు’ సినిమా విడుదల తేదీ వాయిదా పడింది. ఫిబ్రవరి 13న విడుదల కావాల్సిన ఈ చిత్రం, విఎఫ్ఎక్స్ పనుల కారణంగా ఏప్రిల్ 10కి వాయిదా పడింది. ఈ సినిమాలో నిఖిల్ యోధుడిగా కనిపించనున్నాడు.

స్వయంభు విడుదల తేదీ వాయిదా

Swayambhu New Release date: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా అంచలంచలుగా ఎదుగుతూ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ (Nikhil Siddartha)ఒకరు. హ్యాపీ డేస్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన అనంతరం ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక నిఖిల్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే నిఖిల్ నటించిన స్వయంభు(Swayambu) సినిమా కూడా  ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా శివరాత్రి పండుగను పురస్కరించుకొని  ఫిబ్రవరి 13వ తేదీ విడుదల కాబోతున్నట్లు చిత్ర బృందం ఇటీవల వెల్లడించారు.

ఇకపోతే ఈ సినిమా మళ్లీ వాయిదా పడుతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలకు అనుగుణంగానే చిత్ర బృందం ఇటీవల న్యూ ఇయర్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో సినిమా విడుదల తేదీని ప్రచురించకపోవడంతో ఈ సినిమా విడుదల వాయిదా పడుతుందంటూ వార్తలు వచ్చాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా ఫిబ్రవరి 13వ తేదీ నుంచి వాయిదా పడి ఏప్రిల్ 10వ తేదీకి విడుదల కాబోతుందని తెలుస్తోంది. త్వరలోనే చిత్ర బృందం సైతం ఈ విషయానికి సంబంధించి అధికారక ప్రకటన తెలియజేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఎందుకు వాయిదా పడింది?

నిఖిల్ కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ఏకంగా ఎనిమిది భాషలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. మైథాలజికల్ పిరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిఖిల్ ఒక యోధుడిగా కనిపించబోతున్నారు ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన కొన్ని పోస్టర్స్, వీడియోలు మంచి ఆదరణను సొంతం చేసుకున్నాయి.

పూర్తికానీ విఎఫ్ఎక్స్ పనులు…

సినిమాలో నిఖిల్ పాత్ర

భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ, చైనీస్, స్పానిష్, అరబిక్ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమాలో సంయుక్త మీనన్ తో పాటు నభా నటేష్ సందడి చేయబోతున్నారు. సునీల్, సుబ్బరాజు కమెడియన్ సత్య వంటి తదితరులు కూడా కీలక పాత్రలలో నటించబోతున్నారు. ఇక ఈ సినిమా మైథాలాజికల్ పిరియాడిక్ సినిమాగా రాబోతున్న నేపథ్యంలో భారీ విఎఫ్ఎక్స్ విజువల్స్ ఉండబోతున్నాయని సమాచారం అయితే ఈ సినిమా అనుకున్న సమయానికి విడుదల కాకపోవడానికి కూడా ఈ విఎఫ్ఎక్స్ కారణమని తెలుస్తుంది. విఎఫ్ఎక్స్ పనులు మరింత ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాను వాయిదా వేసినట్టు తెలుస్తోంది.

స్వయంభు సినిమా విడుదల వాయిదా పడటం నిఖిల్ అభిమానులకు కాస్త నిరాశ కలిగించే విషయమే. ఏప్రిల్ 10న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడటానికి వేచి ఉండాల్సిందే.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.