|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నిఖిల్ ‘స్వయంభు’: రిలీజ్ డేట్ ఫిక్స్! ఫ్యాన్స్ కి పూనకాలే!!

Published: 24-01-2026, 9:05 PM
నిఖిల్ 'స్వయంభు': రిలీజ్ డేట్ ఫిక్స్! ఫ్యాన్స్ కి పూనకాలే!!
  • నిఖిల్ ‘స్వయంభు’ విడుదల తేదీ ఖరారు: ఏప్రిల్ 10న గ్రాండ్ రిలీజ్!
  • ఫిబ్రవరి 13న విడుదల కావాల్సింది, గ్రాఫిక్స్ కారణంగా వాయిదా!
  • నిఖిల్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రం ‘స్వయంభు’!
  • ద‌ర్శ‌కుడు భ‌ర‌త్ కృష్ణ‌మాచారి తెర‌కెక్కిస్తున్న పీరియాడిక‌ల్ మూవీ!

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ నటిస్తున్న తాజా చిత్రం ‘స్వయంభు’. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఆ వివరాలు చూద్దాం!

ఏప్రిల్ 10న స్వయంభు విడుదల

Swayambhu: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ‘స్వయంభు(Swayambhu)’. పీరియాడికల్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్నాడు. నిఖిల్ కెరీర్ లోనే హైయ్యెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన కంటెంట్ కూడా ఆ హైప్ ను పెంచేసింది.

గ్రాఫిక్స్ పనులతో వాయిదా

కనీసం టీజర్ కూడా ఈ సినిమా నుంచి విడుదల కాలేదు. జస్ట్ మేకింగ్ వీడియోస్ విడుదల చేసి ఈ రేంజ్ హైప్ ను తీసుకువచ్చారు అంటే మాములు విషయం కాదు. అందుకే, ఈ సినిమా కోసం చూస్తున్నారు ఆడియన్స్. అయితే, ఈ సినిమాలో గ్రాఫిక్స్, వీఎఫెక్స్ కి భారీ స్కోప్ ఉంది. అందుకే, ఆ అంశాలపై మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాటి కారణంగానే సినిమా విడుదల వాయిదాల మీద వాయిదా పడుతోంది.

నిఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీ

తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. స్వయంభు సినిమాను ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్టు ప్రకటించాడు. నిజానికి ఈ సినిమా ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ, గ్రాఫిక్స్ వర్క్ కారణంగా వాయిదా పడింది. కేవలం ప్రేక్షకులకు అద్భుతమైన ఫీల్ ఇవ్వాలన్న ఆలోచనతోనే వాయిదా వేసినట్టు టీం తెలిపారు. మరి ఈ సినిమాకు విడుదల తరువాత ఆడియన్స్ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనేది చూడాలి.

నిఖిల్ ‘స్వయంభు’ ఏప్రిల్ 10న విడుదల కానుంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో అంచనాలు పెరుగుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.