|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

స్వయంభు టీమ్‌కు అడవిలో నరకం! రెండు రోజులు కొండపైనే చిక్కుకుపోయిందా?

Published: 08-05-2026, 8:15 PM
స్వయంభు టీమ్‌కు అడవిలో నరకం! రెండు రోజులు కొండపైనే చిక్కుకుపోయిందా?
  • నిఖిల్ సిద్ధార్థ్ స్వయంభు సినిమా షూటింగ్‌లో టీమ్ రెండు రోజులు కొండపై చిక్కుకుపోయింది.
  • మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది.
  • డైరెక్టర్ భరత్ కృష్ణమాచారి ఈ భయంకర అనుభవాన్ని వెల్లడించారు.
  • సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలు, విఎఫ్ఎక్స్ పనులు ఉన్నాయని తెలిపారు.

నిఖిల్ సిద్ధార్థ్ స్వయంభు సినిమా షూటింగ్ సమయంలో టీమ్ ఎదుర్కొన్న భయంకర అనుభవం వెలుగులోకి వచ్చింది. మారేడుమిల్లి అడవిలో భారీ వర్షాల కారణంగా రెండు రోజుల పాటు కొండపై చిక్కుకుపోయిన విషయాన్ని డైరెక్టర్ భరత్ కృష్ణమాచారి పంచుకున్నారు. ఈ సంఘటన సినిమా యూనిట్‌ను తీవ్రంగా కలచివేసింది.

కొండల్లో చిక్కుకున్న స్వయంభు టీమ్

Swayambhu Film: హ్యాపీడేస్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన నటుడు నిఖిల్ సిద్ధార్థ్(Nikhil Siddarth) ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన స్వయంభు(Swayambhu) అనే సినిమా పనులలో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులు పూర్తీ అయ్యాయి కానీ ఈ సినిమా మొత్తం ఎక్కువగా విఎఫ్ఎక్స్ పనులతో కూడుకున్న నేపథ్యంలో విడుదల ఆలస్యం అవుతూ వస్తుంది. ఈ సినిమాని శివరాత్రి పండుగ సందర్భంగా ఫిబ్రవరి 13వ తేదీన విడుదల చేయాలని భావించారు కానీ విఎఫ్ ఎక్స్ పనులు పూర్తికాని నేపథ్యంలో వాయిదా పడుతోంది.

ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా స్వయంభు సినిమా డైరెక్టర్ భరత్ కృష్ణమాచారి (Bharath Krishnamachari)ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈ సినిమా షూటింగ్ సమయంలో వారికి ఎదురైన ఒక భయంకరమైన పరిస్థితిని గురించి, ఆ సమయంలో వాళ్లు ఎదుర్కొన్న సవాళ్ల గురించి తెలియచేశారు. స్వయంభు సినిమాలో యాక్షన్స్ సన్ని వేషాలు ఉన్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ కొంత భాగం రాజమండ్రి సమీపంలో ఉన్న మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో నిర్వహించారు. అయితే ఈ అటవీ ప్రాంతంలో ఇప్పటివరకు ఎవరు షూటింగ్ చేయని ఒక ప్రదేశానికి వెళ్లినట్టు తెలిపారు.

డైరెక్టర్ భరత్ కృష్ణమాచారి అనుభవాలు

ఇలా ఎత్తైన కొండల ప్రదేశానికి వెళ్లాలి అంటే జీపులలో సుమారు మూడు గంటల పాటు ప్రయాణం చేయాల్సి వచ్చేదని ఈయన తెలియజేశారు. ఇలా ఒక షెడ్యూల్ చిత్రీకరణ సమయంలో అనుకోకుండా భారీ వర్షాలు పడటంతో మా సిబ్బంది మొత్తం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు . ఈ వర్షాల కారణంగా తాము రెండు రోజులపాటు కొండపైనే ఉండి పోవాల్సి వచ్చింది, కిందికి వెళ్లడానికి మార్గం లేక మా దగ్గర కనీస అవసరానికి సరిపడా వస్తువులు లేక భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నామని తెలిపారు.

అంచనాలు పెంచిన అప్డేట్స్..

స్వయంభు సినిమా విశేషాలు

ఈ సినిమా క్లైమాక్స్ కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో 80 రోజుల పాటు చిత్రీకరణ చేశామని ఇందులో భాగంగా రెండు భారీ బ్రిడ్జిలని ఏర్పాటు చేశామని తెలిపారు. ఇందులో ఒక బ్రిడ్జ్ ప్రత్యేకమైన క్రేన్లను ఏర్పాటు చేసి కూల్చి వేశామని భరత్ కృష్ణమాచారి తెలియచేశారు. ఇక ఈ చిత్రాన్ని పిక్సెల్ స్టూడియోస్ పతాకం పై భూవన్ శ్రీకర్ నిర్మించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో నిఖిల్ జోడిగా సంయుక్త మీనన్, నభా నటేష్ నటిస్తున్నారు. ఈ సినిమా చారిత్రాత్మక యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో నిఖిల్ సిద్ధార్థ్ ఒక యోధుడిగా, న్యాయానికి, నీతికి ప్రతీక అయిన ‘సెంగోల్’ను రక్షించే బాధ్యత కలిగిన యోధుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ అలాగే ఫస్ట్ సింగిల్ ఎంతో మంచి ఆదరణను సొంతం చేసుకుని సినిమా పట్ల అంచనాలను పెంచేసింది.

స్వయంభు సినిమా కోసం చిత్ర యూనిట్ పడిన కష్టాలు, సవాళ్లు ఈ సంఘటనతో స్పష్టమవుతున్నాయి. విఎఫ్ఎక్స్ పనులు పూర్తయ్యాక విడుదల కానున్న ఈ చారిత్రాత్మక యాక్షన్ డ్రామాపై అంచనాలు మరింత పెరిగాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.