|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

భారత్-న్యూజిలాండ్ ఫైనల్: క్రికెట్ ఫీవర్ తో రైల్వే శాఖ సంచలన నిర్ణయం!

Published: 08-03-2026, 12:05 AM
భారత్-న్యూజిలాండ్ ఫైనల్: క్రికెట్ ఫీవర్ తో రైల్వే శాఖ సంచలన నిర్ణయం!
  • భారత్, న్యూజిలాండ్ మధ్య టీ20 ప్రపంచ కప్ ఫైనల్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది.
  • ఫైనల్ మ్యాచ్ కోసం అహ్మదాబాద్ నగరానికి భారీగా తరలివస్తున్న క్రికెట్ అభిమానులు.
  • ముంబై నుండి అహ్మదాబాద్ విమాన ఛార్జీలు పెరగడంతో రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు నడుపుతోంది.
  • ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా వెస్ట్రన్ రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ భారత్, న్యూజిలాండ్ మధ్య అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. అభిమానుల తాకిడి పెరగడంతో వెస్ట్రన్ రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. విమాన ఛార్జీలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఫైనల్ మ్యాచ్‌కు సిద్ధమైన నరేంద్ర మోడీ స్టేడియం

టీ20 ప్రపంచ కప్ (T20 World Cup) చివరి అంకానికి చేరుకుంది. ఈ రోజు సాయంత్రం ఫైనల్ మ్యాచ్ (Final match) భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం అయిన నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. మాములుగానే భారతదేశంలో క్రికెట్ మ్యాచుకు వేలాది మంది ప్రేక్షకులు వస్తుంటారు. అలాంటిది టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ కావడం.. ఫైనల్ లో భారత్ ఆడనుండటం తో అహ్మదాబాద్ నగరం (Ahmedabad city) ఇప్పటికే భారత అభిమానులతో సందడిగా మారింది. ఈ నెల 5న జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ పై గెలిచి భారత్ ఫైనల్ చేరిన వెంటనే క్రికెట్ అభిమానులు ఫైనల్ చూసేందుకు టికెట్లు కొనుగోలు చేసుకున్నారు.

మరికొద్ది గంటల్లో నరేంద్ర మోదీ స్టేడియం (Narendra Modi Stadium)లో భారత్ – న్యూజిలాండ్ మధ్య జరగనున్న ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ పోరుతో అహ్మదాబాద్ నగరం క్రికెట్ జాతరను తలపిస్తోంది. ఈ చారిత్రాత్మక మ్యాచ్‌ను వీక్షించేందుకు తరలివస్తున్న అభిమానుల కోసం వెస్ట్రన్ రైల్వే (Western Railway) కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై నుండి అహ్మదాబాద్‌కు విమాన ఛార్జీలు ఆకాశాన్ని తాకుతున్నాయి. (ఒక్కో వైపు రూ. 15,000–17,000) ఉండటంతో వేగంగా మైదానానికి చేరుకోవడానికి క్రికెట్ అభిమానులు (Cricket fans) ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో సామాన్యులకు ఊరటనిస్తూ రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటిచింది.

విమాన ఛార్జీల మోత.. రైల్వే శాఖ నిర్ణయం

క్రికెట్ అభిమానులకు వెస్ట్రన్ రైల్వే శుభవార్త

భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. తక్కువ ఖర్చుతో ప్రయాణం చేయవచ్చు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.