|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తాప్సీ ‘అస్సీ’ ట్రైలర్: మహిళా లాయర్‌గా తాప్సీ విధ్వంసం.. ఫిబ్రవరి 20న థియేటర్లలో రచ్చ!

Published: 05-02-2026, 3:05 AM
తాప్సీ 'అస్సీ' ట్రైలర్: మహిళా లాయర్‌గా తాప్సీ విధ్వంసం.. ఫిబ్రవరి 20న థియేటర్లలో రచ్చ!
  • తాప్సీ ‘అస్సీ’ ట్రైలర్ విడుదల: లాయర్ పాత్రలో అదరగొట్టిన తాప్సీ, ఫిబ్రవరి 20న గ్రాండ్ రిలీజ్!
  • దేశంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై పోరాడే లాయర్ పాత్రలో తాప్సీ నటన అద్భుతం!
  • అనుభవ్ సిన్హా దర్శకత్వంలో నసీరుద్దీన్ షా, రేవతి వంటి దిగ్గజ నటులతో ‘అస్సీ’ మూవీ!
  • ట్రైలర్‌లో తాప్సీ డైలాగులు, విజువల్స్ హైలెట్‌గా నిలిచాయి; సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

తెలుగు ప్రేక్షకులకు తాప్సీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ఝమ్మంది నాదం’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ‘అస్సీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది.

తాప్సీ ‘అస్సీ’ ట్రైలర్ రిలీజ్ అదుర్స్!

‘ఝమ్మంది నాదం’(Jummandi Nadam) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ తాప్సీ(Tapsi) మనందరికీ సుపరిచితమే. ఫస్ట్ మూవీతోనే మంచి విజయం సాధించింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. అలా అప్పట్లో ఓ రేంజ్‌కి ఎదిగిన ఈ చిన్నది ప్రజెంట్ టాలీవుడ్‌లో అంతగా సినిమాలు చేయడం లేదు. మరి దీనికి కావడం అవకాశాలు రాకపోవడమో, మరేదేమైనా కారణమా అనేది తెలియదు.

మహిళల కోసం పోరాడే లాయర్‌గా తాప్సీ!

ఇక ఈ చిన్నదాని పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే మథియాస్ బో(Mathias boe) అనే బ్యాడ్మింటన్ ప్లేయర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పటినుంచి ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌కి షిఫ్ట్ అయ్యి.. అక్కడ వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది. ఇందులో భాగంగా ఆమె నటిస్తున్న తాజా సినిమా ‘అస్సీ’(Assi). ప్రముఖ దర్శకుడు అనుభవ్ సిన్హా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నసీరుద్దీన్ షా, రేవతి, కని కుసృతి, మనోజ్ పహ్వా వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఫిబ్రవరి 20న గ్రాండ్ రిలీజ్ అవుతున్న ‘అస్సీ’!

అయితే ఈ మూవీ ఫిబ్రవరి 20న‌ ప్రేక్షకుల ముందుకు రాబోతుండ‌గా చిత్ర‌బృందం తాజాగా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసింది. ఇక ట్రైల‌ర్‌ గమనించినట్లయితే.. తాప్సీ ఇందులో లాయ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతుంది. ఈ సినిమా టైటిల్‌ను హైలైట్ చేస్తూ.. దేశంలో ప్ర‌తిరోజు 80 మంది మ‌హిళ‌లు అత్యాచారానికి గుర‌వుతున్నారని.. వారికోసం పోరాడే న్యాయవాది పాత్ర‌లో తాప్సీ అల‌రించ‌బోతున్నట్లు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది. అంతేకాకుండా తాప్సీ చెప్పే డైలాగ్స్, విజువల్స్ అన్నీ ట్రైలర్‌కు హైలెట్‌గా నిలిచాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ట్రైలర్‌ను మీరు కూడా చూసేయండి.

తాప్సీ ‘అస్సీ’ ట్రైలర్ విడుదల కావడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఫిబ్రవరి 20న సినిమా విడుదల కాబోతోంది. మరిన్ని అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.