|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మగాళ్ల రాజ్యం టాలీవుడ్! హీరోయిన్ల కొంప ముంచే హీరోలేనా? తాప్సీ షాకింగ్ కామెంట్స్ వైరల్!

Published: 28-02-2026, 4:35 AM
మగాళ్ల రాజ్యం టాలీవుడ్! హీరోయిన్ల కొంప ముంచే హీరోలేనా? తాప్సీ షాకింగ్ కామెంట్స్ వైరల్!
  • హీరోలదే ఆధిపత్యం! హీరోయిన్ల ఎంపికలో హీరోలదే ఫైనల్ నిర్ణయమని షాకింగ్ కామెంట్స్ చేసిన తాప్సీ!
  • దర్శకుడికి పట్టు ఉంటేనే ఏదైనా! లేదంటే హీరోయిన్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుందని తాప్సీ ఆవేదన.
  • డంకీ చిత్రంలో షారుఖ్ ఖాన్‌తో అవకాశం రాజ్ కుమార్ హిరానీ వల్లే సాధ్యమైందని తెలిపిన తాప్సీ.
  • సోషల్ మీడియాలో దుమారం! తాప్సీ చేసిన వ్యాఖ్యలపై ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా చర్చలు!

టాలీవుడ్ సినీ పరిశ్రమలో హీరోయిన్ల పరిస్థితిపై తాప్సీ పన్ను సంచలన వ్యాఖ్యలు చేసింది. హీరోల ఆధిపత్యం గురించి ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. పూర్తి వివరాల్లోకి వెళ్దాం!

హీరోలదే ఫైనల్ నిర్ణయం!

సినీ పరిశ్రమలో రంగుల లోకానికి వెనుక ఎన్నో చేదు నిజాలు ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్ల ఎంపికలో హీరోల ఆధిపత్యం ఎంత ఉంటుందనే దానిపై ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా ఇదే విషయంపై తాప్సీ పన్ను(Taapsee Pannu) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో హీరోయిన్ల తలరాతను హీరోలే రాస్తారని, దర్శకుడు గట్టివాడైతే తప్ప అక్కడ తనలాంటి వారికి చోటు దక్కడం కష్టమని ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘నేను మాట్లాడే మాటల వల్ల అవకాశాలు పోయాయో లేదో నాకు ప్రత్యక్షంగా తెలియదు. ఎందుకంటే ఎవరైనా నాతో పని చేయడం ఇష్టం లేకపోతే ఆ విషయం నా వరకు చేరదు. కానీ, ఇండస్ట్రీలో ఒక చేదు నిజం ఉంది. హీరో-హీరోయిన్ ఉన్న సినిమాల్లో హీరోయిన్ ఎవరనేది చాలా వరకు హీరోలే నిర్ణయిస్తారు. దర్శకుడు గనుక స్టార్ డైరెక్టర్ అయితే తప్ప, మిగతా సమయాల్లో హీరోల మాటే నడుస్తుంది. మగాళ్ల రాజ్యంలో హీరోయిన్ల పరిస్థితి దారుణంగా ఉంటుంది. వాల్లు వద్దు అంటే అవకాశం ఇచ్చినప్పటికీ తొలగిస్తారు’’ అని తాప్సీ పేర్కొన్నారు.

తన కెరీర్‌లో ‘డంకీ’ చిత్రం ఒక పెద్ద మలుపు అని తాప్సీ గుర్తు చేసుకున్నారు. ‘‘రాజ్‌కుమార్ హిరానీ సార్ నన్ను ఆ సినిమాలో ఉండాలని బలంగా కోరుకున్నారు. అందుకే నేను షారుఖ్ ఖాన్ సార్ పక్కన నటించగలిగాను. నేను సాధారణంగా షారుఖ్ సార్‌తో నటించే హీరోయిన్ల సర్కిల్‌లో లేను కాబట్టి, ఆ వార్త చాలామందికి పెద్ద షాక్ ఇచ్చింది. ఒకవేళ దర్శకుడు అంత పట్టుబట్టకపోయి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో’’ అని చెప్పుకొచ్చారు. ఇక తన గురించి వినిపించే విమర్శలపై స్పందిస్తూ.. ‘‘నేను పని చేయడానికి కష్టమైన వ్యక్తినని కొందరు అంటుంటారు. కానీ నా ఫిల్మోగ్రఫీ చూస్తే, నాతో పనిచేసిన దర్శకులు నన్ను మళ్ళీ మళ్ళీ తమ సినిమాల్లో తీసుకున్నారు. డిఫికల్ట్ వ్యక్తులతో ఎవరూ పదే పదే పని చేయరు కదా? నేను పెద్దగా సోషల్ పర్సన్‌ను కాదు, పార్టీలకు వెళ్ళను. అందుకే నాతో పనిచేయని వారు నా గురించి ఇలాంటి అంచనాలకు వస్తుంటారు. నా పని మాత్రమే సమాధానం చెబుతుందని నేను నమ్ముతాను’’ అని తాప్సీ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

దర్శకుడికి పట్టుంటేనే ఛాన్స్

షాకింగ్ నిజాలు బయటపెట్టిన తాప్సీ

తాప్సీ చేసిన ఈ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.