|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: తెలుగు ఇండస్ట్రీపై తాప్సీ సంచలన వ్యాఖ్యలు! ఇంత ద్వేషమా?

Published: 22-02-2026, 4:35 AM
షాకింగ్: తెలుగు ఇండస్ట్రీపై తాప్సీ సంచలన వ్యాఖ్యలు! ఇంత ద్వేషమా?
  • తాప్సీ పన్నుపై నెటిజన్ల ఫైర్: తెలుగు ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడటంపై ఆగ్రహం!
  • రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘జుమ్మంది నాదం’ సినిమాతో తాప్సీ పరిచయం, ఇప్పుడు విమర్శలు!
  • బాలీవుడ్ అవకాశాల కోసం తెలుగు ఇండస్ట్రీని విమర్శించడం సరికాదని నెటిజన్ల అభిప్రాయం.
  • తాప్సీ వ్యాఖ్యలపై దుమారం: రాఘవేంద్రరావును అవమానించేలా మాట్లాడటం వివాదాస్పదం!

టాలీవుడ్ లో హీరోయిన్ తాప్సీ పన్ను చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఆమె తెలుగు ఇండస్ట్రీ గురించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అసలేం జరిగిందో తెలుసుకుందాం!

తాప్సీ పన్ను వివాదాస్పద వ్యాఖ్యలు!

అన్నంపెట్టిన చేతికే సన్నం పెట్టడం అనే సామెత వినే ఉంటారు. ఈ సామెత కొంతమంది హీరోయిన్లకు వందశాతం సరిపోతుంది. ముఖ్యంగా తెలుగులో సినిమాలు చేసి తరవాత బాలీవుడ్‌లో అవకాశాలు వచ్చిన హీరోయిన్లు అయితే చాలా వరకు ఈ సామెతకు సరిపోయేలా ప్రవర్తిస్తారు. హీరోయిన్ తాప్సీ పన్ను కూడా ఆ కోవకు చెందిన హీరోయినే. తాప్సి మొట్టమొదటి సినిమా జుమ్మంది నాదం. ఈ సినిమాకు ఒకప్పటి స్టార్ డైరెక్టర్ రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. చిత్రంలో మనోజ్ కు జంటగా తాప్సి నటించి మెప్పించింది. తన క్యూట్ అందంతో అభిమానులకు దగ్గరైంది. ఈ సినిమాతోనే తాప్సికి తెలుగులో అభిమానులు అయ్యారు.

ఇక ఇప్పుడు తాప్సీ ఏకంగా బాలీవుడ్ సినిమా ఆఫర్లను సైతం అందుకుంటుంది. అయితే లైఫ్ ఇచ్చిన తెలుగు ఇండస్ట్రీపైనే తాప్సి ఇప్పుడు తక్కువ చేసి మాట్లాడటం ఆశ్చర్యకరం. అంతే కాకుండా తనతో సినిమా చేసిన దిగ్గజ దర్శకుడు రాఘవేంద్రరావును అవమానపర్చినట్టు మాట్లాడింది. ఓ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాప్సి మాట్లాడుతూ.. త‌న‌ను ప‌రిచ‌యం చేసిన ద‌ర్శ‌కుడు ఏం ప‌ట్టుకున్నా బంగారమే అనే ఒక న‌మ్మ‌కం ఉంది. ఆయ‌నే శ్రీదేవి, జ‌య‌సుధ లాంటి హీరోయిన్ల‌ను ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేశాడు. త‌నతో 105వ సినిమా చేశార‌ని చెప్పింది.

రాఘవేంద్రరావుపై షాకింగ్ కామెంట్స్!

ఆయ‌న‌కు మ‌హిళ‌ల‌ అవ‌య‌వాలు చూపించ‌డం బాగా తెలుస‌ని చెప్పింది. అమ్మాయిల న‌డుము చూపిస్తూ దానిపై పువ్వులు, పండ్ల‌తో కొట్టించేవాడ‌ని చెప్పింది. ఇప్పుడు త‌న వంతు వ‌చ్చిందని అనుకున్నానని శ్రీదేవి లాంటి హీరోయిన్ల వీడియోలు చూసి త‌న‌పై ఎలాంటి పండ్లు వేస్తారో అని అనుకున్నాన‌ని తెలిపింది. ఇక త‌న స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు సిద్దంగా లేన‌ని, త‌న న‌డుంపై కొబ్బ‌రివ‌క్క‌తో కొట్టార‌ని చెప్పింది. అందులో ఏం రొమాంటిక్ గా ఉందో త‌న‌కు అర్థం కాలేద‌ని వ్యాఖ్యానించింది. తాప్సి చెబుతుంటే ప‌క్క‌న కూర్చున్న‌వాళ్లంతా ప‌గ‌ల‌బ‌డి న‌వ్వేశారు.

నెటిజన్ల ఆగ్రహం, ట్రోలింగ్!

అయితే ఇప్పుడు ఇలా మాట్లాడిన తాప్సి జుమ్మందినాదం సినిమా రిలీజ్ స‌మ‌యంలో మ‌రోలా మాట్లాడింది. రాఘేవేంద్ర‌రావు సినిమాలో గుమ్మ‌డికాయ‌లు, ఆప్సిల్స్, గ్రేప్స్ ఉంటాయ‌ని ఇంకా చాలా ఉంటాయ‌ని చెప్పింది. త‌న‌పై ఏ పండు వేశారో తెలియాలంటే సినిమాలోనే చూడాల‌ని వ్యాఖ్యానించింది. అది కూడా చాలా సంతోషంగా చెప్పింది. ఇక ఇప్పుడు తాప్సి లైఫ్ ఇచ్చిన ఇండ‌స్ట్రీ, ద‌ర్శ‌కుడినే కించ‌ప‌ర్చేలా మాట్లాడ‌టంతో నెటిజ‌న్లు ఫైర్ అవుతున్నారు.

తాప్సీ వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతోంది. ఈ విషయంపై మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. త్వరలో మరిన్ని వివరాలతో మీ ముందుకు వస్తాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.