
📌 Key Points
- జైషే చీఫ్ మసూద్ అజార్ సోదరుడు తాహిర్ అన్వర్ అనుమానాస్పదంగా మృతి
- అన్వర్ మరణానికి గల కారణాలు మిస్టరీగా ఉన్నాయి
- బహవల్పూర్‌లో అన్వర్ అంత్యక్రియలు నిర్వహించారు
- జైషే కార్యకలాపాల్లో తాహిర్ కీలక పాత్ర పోషించాడని సమాచారం
జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ సోదరుడు తాహిర్ అన్వర్ అనుమానాస్పద స్థితిలో మరణించడం సంచలనం కలిగిస్తోంది. పాకిస్తాన్‌లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తాహిర్ అన్వర్ అనుమానాస్పద మృతి
పాకిస్తాన్‌కు చెందిన జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్, మోస్ట్ వాంటెడ్ మౌలానా మసూద్ అజార్ సోదరుడు మొహమ్మద్ తాహిర్ అన్వర్ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించినట్లు సమాచారం. అయితే, అతని మరణానికి సంబంధించి కారణాలు ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి. నిషేధిత ఉగ్రవాద సంస్థ అధికారిక ఛానల్ తెలిపిన వివరాల ప్రకారం, పాకిస్థాన్‌లోని బహవల్పూర్‌లో ఉన్న జామియా మసీద్ ఉస్మాన్ వలీలో సోమవారం అర్ధరాత్రి అన్వర్ అంత్యక్రియలు జరిగాయి. తాహిర్ అన్వర్‌కు జైష్-ఎ-మొహమ్మద్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కొన్నేళ్లుగా అతను ఆ సంస్థ కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నాడని తెలుస్తోంది. పెహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవడానికి ‘ఆపరేషన్ సింధూర్’లో భాగంగా భారత్ చేపట్టిన లక్షిత వైమానిక దాడులలో తన కుటుంబానికి చెందిన 10 మంది, తన నలుగురు సహాయకులు మరణించారని మసూద్ అజార్ గతేడాది ప్రకటించిన సంగతి తెలిసిందే. తాహిర్ అన్వర్ అనారోగ్యంతో చనిపోయాడా లేదా మరేదైనా కారణం ఉందా అనే విషయాలపై సంస్థ వివరాలు వెల్లడించడకపోవడం అనుమానాస్పదంగా మారింది.
మిస్టరీగా మారిన మరణ కారణాలు
జైషేతో సంబంధాలు, కీలక పాత్ర
తాహిర్ అన్వర్ మరణం అనేక అనుమానాలకు తావిస్తోంది. దీనిపై జైషే సంస్థ ఎటువంటి ప్రకటన చేయకపోవడం మరింత గందరగోళానికి దారితీస్తోంది. ఈ వ్యవహారంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి.


