
📌 Key Points
- తమన్నా సంచలనం: ‘స్ట్రీ 2’లోని ‘ఆజ్ కీ రాత్’ పాట బిలియన్ వ్యూస్‌తో రికార్డు!
- సమంత రికార్డు బ్రేక్: ‘ఊ అంటావా మావా’ పాటను దాటేసిన తమన్నా స్పెషల్ సాంగ్!
- సాయి పల్లవిదే టాప్: ‘రౌడీ బేబీ’ సాంగ్‌కి 1.7 బిలియన్ వ్యూస్‌తో తిరుగులేని రికార్డు!
- యూట్యూబ్‌లో హనుమాన్ చాలీసా ప్రభంజనం: ఏకంగా 5 బిలియన్ వ్యూస్‌తో నెంబర్ వన్!
టాలీవుడ్ లో పాటల సందడి మామూలుగా లేదు. తాజాగా తమన్నా సంచలన విజయం సాధించింది. సమంత రికార్డును బ్రేక్ చేసి వార్తల్లో నిలిచింది. అసలు విషయం ఏంటో చూద్దాం రండి!
తమన్నా దూకుడు: సమంత రికార్డు బ్రేక్!
సినిమా సాంగ్స్ ఎక్కువ వ్యూస్ రావడం కామనే. అయితే అది పది మిలియన్స్ అనేది వెరీ కామన్. యాభై మిలియన్స్ వస్తే ఓకే అని చెప్పొచ్చు. అదే వంద మిలియన్స్ అంటే కచ్చితంగా మాట్లాడుకోవాల్సింది. అలాంటిది ఒక బిలియన్ వ్యూస్ అంటే. అది కచ్చితంగా అరుదైన రికార్డు. ఇప్పుడు తమన్నా ఆ రికార్డుని క్రియేట్ చేసింది. సౌత్‌లో సమంత రికార్డుని బ్రేక్ చేసింది. కాకపోతే సాయి పల్లవికి చాలా దూరంలో ఉంది.
తమన్నా ఇటీవల సినిమాల కంటే ఎక్కువగా స్పెషల్ సాంగ్స్ లోనే కనిపిస్తోంది. ఆమె రెండేళ్ల క్రితం `స్ట్రీ 2` అనే చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది. `ఆజ్ కీ రాత్` అనే పాటలో ఆమె మెరిసింది. శ్రద్ధా కపూర్ మెయిన్ లీడ్‌గా చేసింది. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాధించింది. అయితే ఇందులో `ఆజ్ కీ రాత్` బాగా ఆదరణ పొందింది. సినిమా ఆడియెన్స్ కి చేరువ కావడంలో ఈ పాట పాత్ర ఎంతో ఉందని చెప్పొచ్చు. ఇందులో తమన్నా స్టెప్పులు అందరిని కట్టిపడేశాయి. ఆమె గ్లామర్, డాన్స్ మూమెంట్స్ కుర్రాళ్లకి మతిపోయేలా చేశాయి. దీంతో ఈ పాటని తెగచూస్తున్నారు.
సాయి పల్లవిదే హవా: రౌడీ బేబీ రికార్డులు
ఇప్పుడీ పాట సరికొత్త రికార్డుని సృష్టించింది. అత్యధిక వ్యూస్ సాధించిన పాటగా నిలిచింది. తాజాగా ఇది వంద కోట్ల వ్యూస్‌ని దాటింది. తమన్నా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. 1 బిలియన్ వ్యూస్ పొందినట్టు చెబుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. మీప్రేమకి ధన్యవాదాలు అని వెల్లడించింది తమన్నా. దీంతో ఇది వైరల్ అయ్యింది. ఈపాట ఇప్పుడు మరోసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.
అంతేకాదు తమన్నా ఇప్పుడు సమంత రికార్డుని బ్రేక్ చేసింది. సమంత చేసిన స్పెషల్ సాంగ్ `ఊ అంటా వా మావ`(పుష్ప) ఇప్పటి వరకు 500 మిలియన్స్ వ్యూస్‌ని దాటింది. అంటే యాభై కోట్లమంది దీన్ని వీక్షించారు. సౌత్ హీరోయిన్లలో సమంత పేరుతో ఉన్న రికార్డుని తమన్నా బ్రేక్ చేయడం విశేషం. అయితే తమన్నా కంటే ముందు సాయి పల్లవి ఉంది. ఆమె `మారి 2`లో చేసిన `రౌడీ బేబీ` సాంగ్ అంతకంటే ఎక్కువ వ్యూస్ సాధించిన పాటగా నిలిచింది. ఈ పాటకి 1.7 బిలియన్స్ వ్యూస్ వచ్చాయి. అంటే 170కోట్ల వ్యూస్ ని సాధించింది. అయితే ఇది ఏడేళ్ల క్రితం విడుదల కావడం గమనార్హం.
టాప్ 5 సాంగ్స్: వ్యూస్ పరంగా రికార్డులు
ఇక యూట్యూబ్ వీడియోస్ లో `శ్రీ హనుమాన్ చాలిసా` టాప్‌లో ఉంది. దీనికి ఐదు బిలియన్స్(500కోట్ల వ్యూస్) రావడం విశేషం. `లెహెంగా జాస్ మనక్` అనే ఒరిజినల్ సాంగ్ 1.8 బిలియన్ వ్యూస్‌తో రెండో స్థానంలో ఉంది. `52 గాజ్ కా దమన్` అనే పాట 1.73బిలియన్ వ్యూస్‌తో మూడో స్థానంలో ఉంది. `జరూరీ థా` అనే పాట 1.71 వ్యూస్‌తో నాల్గో స్థానంలో, `రౌడీ బేబీ(మారి 2) 1.71వ్యూస్‌లో ఐదో స్థానంలో నిలిచింది.
ఇలాంటి సినిమా పాటల గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి. ఏ పాట ఏ రికార్డు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి.



Sargun Mehta Urges People to Stop Negative Comments and Trolling Online