|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తమన్నా మాజీ ప్రియుడు విజయ్ వర్మ కొత్త ఇల్లు ఫోటోలు, లోపల లుక్‌ అదిరిపోయింది

Published: 21-05-2025, 9:50 AM
తమన్నా మాజీ ప్రియుడు విజయ్ వర్మ కొత్త ఇల్లు ఫోటోలు, లోపల లుక్‌ అదిరిపోయింది

తెలుగు సినీ నటుడు విజయ్ వర్మ తన కొత్త ఇంటి ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఫరా ఖాన్ తన వ్లాగ్ ద్వారా ఈ ఫోటోలను ప్రపంచానికి చూపించింది. సముద్రం దగ్గర ఉన్న ఈ అద్భుతమైన ఇంటి లోపలి అలంకరణ అందరినీ ఆకట్టుకుంటుంది.

Key Points

1

తమన్నా మాజీ ప్రియుడు విజయ్ వర్మ కొత్త ఇల్లు సముద్రం దగ్గర ఉంది.

2

ఇంటి లోపలి డిజైన్ అద్భుతంగా ఉంది, ముఖ్యంగా డ్రాయింగ్ రూమ్ మరియు డైనింగ్ హాల్.

4

విజయ్ వర్మ ఇంటి బెడ్ రూమ్ చాలా సింపుల్ మరియు ప్రశాంతంగా ఉంది.

విజయ్ వర్మ కొత్త ఇంటి అందాలు

తమన్నా ఎక్స్ బాయ్‌ ఫ్రెండ్‌ విజయ్ వర్మ అదిరిపోయే కొత్త ఇల్లు కొన్నారు. ఈ ఇంటికి సంబంధించిన ఫోటోలను ఫరా ఖాన్ తన వ్లాగ్‌లో పంచుకున్నారు. చాలా సంవత్సరాల తర్వాత విజయ్‌ ఇలాంటి లగ్జరీ హౌజ్‌ని కొనుగోలు చేయడం విశేషం.

విజయ్ వర్మ ఇల్లు సముద్రం వైపు ఉంది. డ్రాయింగ్ రూమ్‌లో పెద్ద గాజు కిటికీ ఉంది, దాని ద్వారా సముద్రం కనిపిస్తుంది. వ్యూ చూడ్డానికి అదిరిపోయింది.

విజయ్ వర్మ కొత్త ఇంటి డైనింగ్ హాల్ చూడ్డానికి చాలా బాగుంది. డైనింగ్ టేబుల్‌తో పాటు రూఫ్‌పై మంచి లైటింగ్ ఉంది. కొన్ని పచ్చటి  మొక్కలను కూడా అలంకరించారు. ఇది స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది.

సముద్రం వైపు ఉన్న అద్భుతమైన వ్యూ

విజయ్ వర్మ తన ఇంటి హాల్‌ చాలా విశాలంగా ఉంది. సోఫాల్‌, టీవీ, పలు డిజైన్స్ తో కనువిందుగా ఉంది.   పెద్ద వాల్ సోఫా, సెంటర్ లో గాజు టేబుల్ కూడా ఉంది. చూడ్డానికి చాలా బాగా అనిపిస్తుంది.

విజయ్ వర్మ కొత్త ఇంటి కిచెన్ పెద్దదిగా లేదుగానీ, కిచెన్‌లో కూడా పెద్ద గాజు కిటికీ ఉంది, దాని ద్వారా బయటకు చూడొచ్చు. అక్కడి వ్యూ కూడా చాలా బాగుంది.

విజయ్ వర్మ బెడ్‌రూమ్ చాలా సింపుల్‌గా ఉంది. ఈ రూమ్ బాల్కనీకి కనెక్ట్ చేసి ఉంది. బెడ్‌  రూమ్‌ని సింపుల్‌గానే ఉంది. ఇందులో పెద్దగా హడావుడి లేదు. ఒక ప్రశాంతమైన ఫీలింగ్‌ తెప్పించేలా ప్లజెంట్‌గా ఉండటం విశేషం.

ఫరా ఖాన్ పంచుకున్న ఫోటోలు

బాలీవుడ్‌ దర్శకురాలు ఫరా ఖాన్.. విజయ్ వర్మ కొత్త ఇంటిని చూడటానికి వచ్చారు. విజయ్ ఇంటిని చూసి ఆమె చాలా సంతోషించారు. అనంతరం ఇంటి ఫోటోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయడం విశేషం.

విజయ్‌ వర్మ, తమన్నా ఒకప్పుడు ప్రేమించుకున్నారు, కలిసి డేటింగ్‌ చేశారు. కానీ ఇటీవలే వీరిద్దరు బ్రేకప్‌ చెప్పినట్టు తెలుస్తుంది. వీరిద్దరు విడివిడిగానే కనిపిస్తున్నారు.

చివరగా, విజయ్ వర్మ కొత్త ఇంటి డిజైన్ ప్రశాంతతను మరియు ఆధునికతను ప్రతిబింబిస్తుంది. ఫరా ఖాన్ వంటి ప్రముఖులు కూడా దీనిని ప్రశంసించడం విశేషం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.