
📌 Key Points
- వెయిట్ లాస్ డ్రగ్స్ వాడకంపై తమన్నా క్లారిటీ ఇచ్చింది.
- శరీర మార్పులు సింధీ బోన్ స్ట్రక్చర్, వయసు, హార్మోన్ల వల్ల సహజం.
- కొవిడ్ తర్వాత తన శరీరంలో మార్పులు వచ్చాయని తమన్నా వెల్లడించింది.
- వెస్టర్న్ బ్యూటీ స్టాండర్డ్స్‌ను కాకుండా ఇండియన్ కర్వ్స్‌ను ప్రేమించాలని సూచించింది.
మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా తన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌కు వెయిట్ లాస్ డ్రగ్స్ వాడుతోందని వస్తున్న వార్తలపై స్పందించింది. ఒక ఇంటర్వ్యూలో దీనిపై క్లారిటీ ఇస్తూ, తన శరీర మార్పులు సహజమని, కొవిడ్, వయసు, హార్మోన్ల కారణంగా వచ్చాయని వివరించింది.
తమన్నాపై వెయిట్ లాస్ డ్రగ్స్ రూమర్స్
మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్‌గా బిజీగా ఉండటం పక్కన పెడితే ఐటెమ్ సాంగ్స్‌తో బిజీ అయిపోయింది. కాస్త బోల్డ్‌గానే కనిపిస్తుంది. అయితే ఈ విషయంలో ఎంత మంది ఎన్నిరకాలుగా కామెంట్ చేసిన తను మాత్రం మౌనంగానే ఉంది. కానీ తన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌కు కారణం వెయిట్ లాస్ డ్రగ్స్ యూజ్ చేయడమేనన్న విషయంపై ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది.
‘నా బాడీ కర్వ్స్ నేచురల్. నాలో పార్ట్ అవి. నేను సింధి. హిప్, వెస్ట్ ఎక్కడికి పోవు. కారణం బోన్ స్ట్రక్చర్ అలా ఉంటుంది. కొవిడ్ తర్వాత బాడీ చేంజ్ అయింది. అంతేకాదు స్త్రీలలో ఏజ్, హార్మోన్స్ కారణంగా శరీరంలో మార్పులు వస్తాయి. నేను వెస్టర్న్ బ్యూటీ స్టాండర్స్‌ను ఫాలో కాను. ఇండియన్‌గా ఉండటమే అందం. జనాలు మన కర్వ్స్ లవ్ చేస్తారు. ఇతరులను చూసి పర్ఫెక్ట్‌గా ఉండాలనే ఆలోచనలో పడిపోకుండా ఉండటమే బెస్ట్’ అని చెప్పింది తమన్నా.
శరీర మార్పులపై తమన్నా క్లారిటీ
సహజమైన అందం, ఇండియన్ కర్వ్స్
తమన్నా తన సహజమైన శరీర ఆకృతిని, ఇండియన్ అందాన్ని ప్రోత్సహించింది. ఇతరులను చూసి పర్ఫెక్ట్‌గా ఉండాలనే ఆలోచనను విడిచిపెట్టి, తమ స్వంత కర్వ్స్‌ను ప్రేమించడమే నిజమైన అందమని ఆమె నొక్కి చెప్పింది.


