
📌 Key Points
- తమన్నా ఫైన్ జ్యువెలరీ పేరుతో కొత్త బ్రాండ్ ప్రారంభించిన తమన్నా భాటియా.
- సింపుల్, కంఫర్ట్‌గా ఉండే ఆభరణాలను అందించాలనే లక్ష్యంతో ఈ బ్రాండ్ స్థాపన.
- ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన తమన్నా.
- టీనేజ్‌లో ఒక ప్రేమ, కెరీర్ కోసం ఒక సంబంధం వదులుకున్నట్లు వెల్లడి.
ప్రముఖ నటి తమన్నా భాటియా కొత్తగా తమన్నా ఫైన్ జ్యువెలరీ అనే బ్రాండ్‌ను ప్రారంభించింది. సింపుల్ డిజైన్లతో ఆకట్టుకునే ఆభరణాలను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా తన వ్యక్తిగత జీవితం గురించి కూడా కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
తమన్నా కొత్త జ్యువెలరీ బ్రాండ్ ప్రారంభం
Tamannaah Bhatia: సెలబ్రిటీలు ఈమధ్య సినిమాలే కాకుండా పక్కన బిజినెస్ రంగంలో కూడా తెగ రాణిస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్లు ఒకవేళ సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టాల్సి వస్తే పరిస్థితి ఏమిటి అని ముందుగానే అంచనా వేసుకొని.. బిజినెస్ రంగంలోకి దిగుతున్నారు.
ఈ క్రమంలో..సినిమాలకే కాకుండా బిజినెస్ రంగంలో కూడా అడుగుపెట్టింది ప్రముఖ నటి తమన్నా భాటియా. ఆమె తాజాగా తమన్నా ఫైన్ జ్యువెలరీ.. అనే కొత్త బ్రాండ్‌ను ప్రారంభించింది. ఈ విషయం ఆమె ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ tamannaahspeaks.. లో షేర్ చేసిన ఒక ఫోటోతో ఈ విషయం గురించి చెప్పకు వచ్చింది.
ఆ ఫోటోలో తమన్నా చాలా సింపుల్‌గా..క్లాసీగా కనిపించే ఉంగరాలు.. ఫైన్ జ్యువెలరీని ధరించి కనిపించింది. ఆమె ముఖాన్ని కొంతవరకు కప్పేలా ఆ ఆభరణాలు ఉండటం అభిమానులను ఆకట్టుకుంది. ఈ ఫోటోతో పాటు ఆమె ఒక క్యాప్షన్ కూడా రాసింది.
ఆభరణాల గురించి తమన్నా ఆలోచనలు
ఇలాంటి ఆలోచనల నుంచే తమన్నా ఫైన్ జ్యువెలరీ అనే బ్రాండ్ పుట్టిందని ఆమె చెప్పింది. ఈ బ్రాండ్ ద్వారా టైమ్‌లెస్ డిజైన్లు..కంఫర్ట్‌గా ఉండే ఆభరణాలను అందించాలనేదే ఆమె లక్ష్యం అని చెప్పుకొచ్చింది.
ఇక ఈ ఫోటోల విషయం పక్కన పెరిగితే తాజాగా.. తమన్నా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ కూడా వార్తల్లో నిలిచింది. ఆ ఇంటర్వ్యూలో ఆమె తన వ్యక్తిగత జీవితంపై చాలా ఓపెన్‌గా మాట్లాడింది. తన జీవితంలో రెండు సార్లు హార్ట్ బ్రేక్ అయ్యిందని చెప్పింది. ఒకటి టీనేజ్‌లో జరిగిన ప్రేమ అని..కెరీర్ కోసం దాన్ని వదిలేయాల్సి వచ్చిందని తెలిపింది. ఆ నిర్ణయం కష్టం అయినా, భవిష్యత్తు కోసం అవసరమని భావించానని చెప్పింది.
వ్యక్తిగత జీవితంపై తమన్నా సంచలన వ్యాఖ్యలు
ఇంకొక సంబంధం తన ఎదుగుదలకు ప్రమాదకరంగా అనిపించిందని..అందుకే దానినుంచి బయటకు వచ్చానని స్పష్టంగా చెప్పింది. ఈ వ్యాఖ్యల తర్వాత, సోషల్ మీడియాలో కొందరు ఆమె మాటలను నటుడు విజయ్ వర్మతో లింక్ చేస్తూ చర్చలు మొదలుపెట్టారు. ఇద్దరూ కలిసి లస్ట్ స్టోరీస్ 2 లో నటించినప్పటి నుంచి వారి గురించి రూమర్లు వినిపించాయి.
మొత్తానికి తమన్నా కొత్త బిజినెస్ ప్రారంభించి, తన వ్యక్తిగత జీవితంలోని కొన్ని కోణాలను వెల్లడించి వార్తల్లో నిలిచింది. ఆమె భవిష్యత్తు ప్రాజెక్టులు ఎలా ఉంటాయో చూడాలి.


