
📌 Key Points
- తమన్నాపై మద్రాస్ హైకోర్టులో నష్టపరిహారం దావా కొట్టివేత.
- పవర్ సోప్స్ సంస్థ తమన్నా ఫోటోలను అనుమతి లేకుండా వాడిందన్న ఆరోపణ.
- తగిన ఆధారాలు లేవని కోర్టు తీర్పు.
- 2008లో పవర్ సోప్స్‌కు తమన్నా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు.
సినీ నటి తమన్నా భాటియాకు మద్రాస్ హైకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. పవర్ సోప్స్ సంస్థపై ఆమె వేసిన నష్టపరిహారం దావాను కోర్టు కొట్టివేసింది. దీనికి గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తమన్నా దావాను కొట్టివేసిన హైకోర్టు
Tamannaah Bhatia: ఇటీవల కాలంలో సినిమా సెలబ్రిటీలు కొంతమంది తరచూ పోలీస్ స్టేషన్, కోర్ట్, పిటిషన్ అంటూ నిత్యం వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా తమన్నా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఈమెకు మద్రాస్ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చిందని చెప్పాలి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. తమన్నాకి మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. పవర్ సోప్స్ లిమిటెడ్ సంస్థపై ఆమె దాఖలు చేసిన రూ.కోటి నష్టపరిహారం దావాను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. తన ఫోటోలను అనుమతి లేకుండా వాడుకున్నారు అంటూ పవర్ సోప్స్ సంస్థపై తమన్నా భాటియా చేసిన అప్పీల్ ను మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ తిప్పికొట్టింది. ఒప్పందం ముగిసిన తర్వాత కూడా ఆ సంస్థ తన ఫోటోలను వాడుకుందని, దీనివల్ల తనకు నష్టం జరిగిందని తమన్నా కోర్టులో వాదించింది. అయితే ఇందుకు తగిన ఆధారాలు చూపించకపోవడంతో ఈ కేసును కొట్టి వేస్తున్నాం అంటూ న్యాయమూర్తులు వేల్మురుగన్, కే గోవిందరాజన్ తిలకవాడిలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
ఫోటోల వివాదం.. అసలేం జరిగింది?
అసలేం జరిగిందనే విషయానికి వస్తే.. పవర్ సోప్స్ సంస్థతో తమన్నా భాటియా 2008లో ఒక సంవత్సరం పాటు బ్రాండ్ అంబాసిడర్ గా ఒప్పందం చేసుకుంది. 2009 అక్టోబర్ తో ఈ ఒప్పందం కాస్త ముగిసింది. అయితే ఒప్పందం గడువు ముగిసినప్పటికీ 2010 – 2011 కాలంలో కంపెనీ తన ఫోటోలను సోప్ ప్యాకింగ్ లపై , అలాగే వాణిజ్య ప్రకటనలలో, ఇంటర్నెట్లో కూడా వాడుకుందని తమన్నా ఆరోపించింది. ముఖ్యంగా దీనివల్ల వేరే బ్రాండ్లతో తాను చేసుకున్న ఒప్పందాలకు భారీగా నష్టం కలిగిందని పేర్కొంటూ కోటి రూపాయలు నష్టపరిహారం కూడా కోరింది ఈ ముద్దుగుమ్మ. అప్పుడే ఈ కేసును సింగిల్ జడ్జ్ కొట్టి వేయగా.. దానిపై అప్పీల్ కు వెళ్ళింది తమన్నా .
ఆ అప్పీల్ ను ఇప్పుడు మద్రాస్ హైకోర్టు కూడా కొట్టివేసింది. ఎందుకంటే తమన్నా సమర్పించిన సోప్ కవర్లు, కొనుగోలు పత్రాలు నమ్మదగినవిగా లేవని అభిప్రాయపడింది. కంపెనీ ఉద్దేశపూర్వకంగా ఆ ఫోటోలను వాడిందని నిరూపించే బలమైన సాక్షాలు ఏమీ లేకపోవడం వల్ల ఆ నిర్ణయాన్ని తెలుపుతూ గతంలో ఇచ్చిన తీర్పునే మద్రాస్ హైకోర్టు కూడా సమర్థించింది. మొత్తానికి అయితే సరైన ఆధారాలు లేకపోవడం వల్లే ఇప్పుడు తమన్నాకి కోర్టులో భారీ షాక్ తగిలింది అని చెప్పాలి. మరి దీనిపై తమన్నా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
తగిన ఆధారాలు లేవన్న న్యాయస్థానం
తమన్నా తదుపరి సినిమాల విషయానికొస్తే .. ప్రస్తుతం మొన్నటి వరకు స్పెషల్ సాంగ్ లతో అలరించిన ఈమె ఇప్పుడు బాలీవుడ్లో బడా ప్రాజెక్టులలో భాగమవుతూ అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాల కాలానికి పైగానే అవుతున్నా.. ఇప్పటికీ వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోయింది. అందులో భాగంగానే సిద్ధార్థ మల్హోత్రా తో కలిసి ఒక సినిమా చేస్తున్న ఈమె.. తమిళంలో కూడా ఒక సినిమా చేస్తోంది. అలాగే సినిమాలతో పాటు ఓటీటీలు, వెబ్ సిరీస్ లతో కూడా అదరగొడుతోంది ఈ ముద్దుగుమ్మ.
మొత్తానికి సరైన ఆధారాలు లేకపోవడంతో తమన్నాకు కోర్టులో చుక్కెదురైంది. దీనిపై ఆమె ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. తదుపరి పరిణామాల గురించి ఎప్పటికప్పుడు తెలియజేస్తాం.


