|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తమన్నా ఆ ఇంజెక్షన్లు వాడుతుందా.. శరీరంలోని మార్పులకు కారణం అదేనంటూ షాకింగ్ కామెంట్స్!

Published: 11-11-2025, 2:04 AM
తమన్నా ఆ ఇంజెక్షన్లు వాడుతుందా.. శరీరంలోని మార్పులకు కారణం అదేనంటూ షాకింగ్ కామెంట్స్!

మిల్కీ బ్యూటీ తమన్నా ఓజెంపిక్ ఇంజెక్షన్లు వాడుతోందనే వార్తలు ఇటీవల తెగ చక్కర్లు కొట్టాయి. ఈ ఆరోపణలపై ఆమె ఘాటుగా స్పందించింది. తన శరీర మార్పులకు అసలు కారణాలు ఏమిటో వివరంగా వెల్లడించి, తప్పుడు వార్తలను ఖండించింది.

Key Points

1

తమన్నా ఓజెంపిక్ వంటి ఇంజెక్షన్లు వాడుతుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

2

తన శరీరంలోని మార్పులు వయసు, కోవిడ్ ప్రభావం, సహజ ప్రక్రియల వల్ల వచ్చాయని తమన్నా స్పష్టం చేసింది.

4

వయసుతో పాటు ప్రతి ఐదేళ్లకు ఒకసారి స్త్రీ శరీరంలో మార్పులు కనిపిస్తాయని తమన్నా వివరించింది.

తమన్నాపై ఇంజెక్షన్ల వాడకం ఆరోపణలు

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా(Tamannaah Bhatia) గత 20 ఏళ్లుగా ఇండస్ట్రీని ఏలేస్తోంది. 35 ఏళ్ల వయసున్న ఆమె ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా వరుస సినిమాలతో యంగ్ హీరోయిన్లకు పోటీనిస్తోంది. ఓ వైపు చిత్రాలే కాకుండా ఐటమ్స్ సాంగ్‌లోనూ కనిపిస్తూ తన డ్యాన్స్ స్టెప్పులతో దుమ్మురేపుతోంది. వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకుంటుండటంతో అవకాశాలు క్యూ కడుతున్నాయి. దీంతో తమన్నా బిజీ బిజీగా మారింది. అయినప్పటికీ బాడీ వర్కౌట్లు చేస్తూ స్లిమ్‌గా కనిపిస్తూ తన హాట్ లుక్స్‌తో కుర్రాళ్లకు చెమటలు పట్టేలా చేస్తోంది. ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా తమన్నా సన్నగా ఉండేందుకు ఓజెంపిక్ (Ozempic injection)వంటి ఇంజెక్షన్లు వాడుతుందని పలు వార్తలు వైరల్ అవుతున్నాయి.

వార్తలను ఖండించిన మిల్కీ బ్యూటీ తమన్నా

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మిల్కీ బ్యూటీ ఈ విషయాన్ని ఖండించింది. ‘‘నాకు 15 సంవత్సరాలు వయస్సు నుంచి నేను కెమెరా ముందు కనిపిస్తున్నాను. మొదట్లో నేను ఎలా ఉండేదానినో ఇప్పటికీ అలాగే ఉన్నాను. నా ఎదుగుదలను మీరంతా చూస్తూనే ఉన్నారు. ఇక్కడ దాచడానికి ఏమీ లేదు. నాకు 20 ఏళ్లు ఉన్నప్పటి నుంచి నేను సన్నగానే ఉన్నా. సహజంగానే అలా ఉన్నాను కానీ ఇంజెక్షన్లు వాడటం వల్ల కాదని గమనించండి. నాలో ఎలాంటి మార్పులు రాలేదు. ఒక స్త్రీ శరీరంలో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి మార్పులు కనిపిస్తాయి. మనం మనలోని విభిన్న వెర్షన్‌ను చూడాలి.

శరీర మార్పులకు అసలు కారణాలు వివరించిన తమన్నా

కోవిడ్ సమయంలో నా శరీరం చాలా దెబ్బతింది. 20 ఏళ్లలో ఉన్నట్లే ఉంచుకోవడం కష్టమైంది. బరువు పెరిగా.. దాంతో నా శరీరంలో ఎక్కువ మార్పులు వచ్చాయి. కడుపు కనిపిస్తోందా? అని ఎన్నోసార్లు అద్దంలో చూసుకున్నాను. ఆ సమయంలో చాలా మనోవేదనకు గురయ్యాను. ప్రతి స్త్రీ తన రుతు చక్రంలో తన శరీరం మారడాన్ని గుర్తిస్తుంది. దానికి నేను ఏమీ మినహాయింపు కాదు కదా..దానివల్ల నాలో కూడా మార్పులు వచ్చాయి. దయచేసి ఇంజెక్షన్లు వాడుతున్నా అని తప్పుడు వార్తలు రాయకండి’’ అని చెప్పుకొచ్చింది.

మొత్తంగా, తమన్నా తనపై వస్తున్న ఇంజెక్షన్ల ఆరోపణలను బలంగా ఖండించింది. స్త్రీ శరీరంలో జరిగే సహజ మార్పులు, కోవిడ్ ప్రభావం తన రూపాన్ని ప్రభావితం చేశాయని స్పష్టం చేసింది. ఈ వివరణతో ఆమె అభిమానులలో ఉన్న అనుమానాలను నివృత్తి చేసింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.