
ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహించిన ‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ ఓటీటీ సిరీస్‌లో తమన్నా నటించిన ‘గఫూర్’ అనే హాట్ సాంగ్ లేకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఈ పాటను ఎందుకు తొలగించారనేది ప్రస్తుతం చర్చనీయాంశం.
Key Points
ఆర్యన్ ఖాన్ దర్శకత్వంలోని 'ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్' ఓటీటీ సిరీస్‌లో తమన్నా హాట్ సాంగ్ 'గఫూర్' లేకపోవడంపై విమర్శలు.
సిరీస్ ప్రమోషన్ కోసం తీసిన పాటను సిరీస్‌లో చేర్చలేదు.
సెన్సార్ సమస్యలు లేదా అధిక బోల్డ్‌నెస్ కారణంగా పాట తొలగించబడిందని అనుమానాలు.
'గఫూర్' పాటను ప్రత్యేకంగా సెప్టెంబర్ 20న విడుదల చేయనున్నట్లు ప్రొడక్షన్ సంస్థ ప్రకటన.
తమన్నా హాట్ సాంగ్ ‘గఫూర్’పై విమర్శలు
ఓటీటీలో రీసెంట్‌గా వచ్చి క్రేజీ సిరీస్‌లో ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ ఒకటి. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డైరెక్టోరియల్ డెబ్యూ చేసిన ఓటీటీ సిరీస్ ఇది. ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ ఓటీటీ సిరీస్‌లో షారుక్ ఖాన్ నుంచి దిశా పటానీ వరకు ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలు నటించారు.
అయితే, ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో మిల్కీ భామ తమన్నా భాటియా హాట్ సాంగ్ గఫూర్ లేకపోవడంపై అభిమానులు, ఆడియెన్స్ తెగ నిరాశ చెందుతున్నారు. ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ ఓటీటీ సిరీస్ నుంచి గఫూర్ పాటను ఎందుకు తొలగించారంటూ సోషల్ మీడియా వేదికగా చర్చ పెట్టారు.
ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ సిరీస్‌పై క్రేజ్ పెరగడానికి తమన్నా నర్తించిన గఫూర్ సాంగ్ కూడా కీలక పాత్ర పోషించింది. ఈ పాటలో తన అందచందాలతో కట్టిపడేసింది తమన్నా. దీంతో ఈ సిరీస్‌కు మంచి బజ్ క్రియేట్ అయింది. ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ సిరీస్‌లో తమన్నా హాట్ సాంగ్ గఫూర్‌ను చూసేందుకు ఎంతోమంది ఎదురుచూశారు.
ప్రొడక్షన్ సంస్థ స్పష్టీకరణ
కానీ, తీరా ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ ఓటీటీ రిలీజ్ అయ్యాక అందులో తమన్నా పాట లేకపోవడంతో అంతా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం ట్విటర్‌లో చర్చకు దారి తీసింది. “ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్‌లో తమన్నా పాట లేకపోవడం ఏంటీ?” అంటూ ఆశ్చర్యపోతున్నారు.
“చివరి నిమిషంలో తమన్నా సాంగ్‌పై వేటు పడింది” అని ఓ యూజర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. “అది కేవలం ప్రమోషనల్ సాంగ్ మాత్రమే కావచ్చు” అని మరొకరు అన్నారు. “సెన్సార్ సమస్యల కారణంగా తమ్ము పాట తొలగించబడింది” అని మరొకరు చెబుతున్నారు. అయితే, గఫూర్ పాటలో తమన్నా ఓవర్ హాట్ డోస్ బోల్డ్‌నెస్ వల్లే సెన్సార్ సభ్యులు అనుమతి ఇవ్వకపోవచ్చు అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అయితే, ఈ విషయంపై తాజాగా ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ ప్రొడక్షన్ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, నిర్మాతలు స్పందించారు. “గఫూర్ సాంగ్ ఎప్పుడు ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ ఓటీటీ సిరీస్‌లో భాగం కాదు. దానిని కేవలం ప్రమోషనల్ వీడియోగా మాత్రమే చేశాం. పూర్తి ప్రమోషనల్ వీడియోను విడిగా విడుదల చేస్తాం” అని మేకర్స్ స్పష్టం చేశారు.
సెన్సార్ సమస్యలే కారణమా?
అలాగే, ట్విటర్‌లో “గఫూర్ ప్రమోషనల్ వీడియో రేపు రిలీజ్ కానుంది” అంటూ తమన్నా ఫొటో షేర్ చేస్తూ ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌజ్ పోస్ట్ చేసింది. అంటే, తమన్నా హాట్ అందాలతో తెరకెక్కించిన గఫూర్ సాంగ్‌ను రేపు అంటే సెప్టెంబర్ 20న రిలీజ్ కానుందని తెలుస్తోంది.
ఇకపోతే సెప్టెంబర్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ ఓటీటీ రిలీజ్ అయింది. హిందీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
చివరికి, ‘గఫూర్’ పాటను ప్రమోషనల్ వీడియోగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించడంతో ఈ వివాదానికి తెరపడింది. తమన్నా అభిమానులు ఈ పాట కోసం ఎదురు చూస్తున్నారు.


