|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తమిళ దర్శకుడు కన్నుమూత

Published: 15-11-2025, 10:16 PM
తమిళ దర్శకుడు కన్నుమూత

సీనియర్‌ తమిళ దర్శకుడు వి. శేఖర్‌ (72) శుక్రవారం చెన్నైలో అనారోగ్యంతో కన్నుమూశారు. ‘నీంగళుమ్‌ హీరోదాన్‌’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన ఆయన, ‘నాన్‌ పుడిచ్చ మాప్పిళై’ వంటి విజయవంతమైన చిత్రాలను రూపొందించారు. ఇది తెలుగులో ‘మామగారు’గా రీమేక్ అయి ఘన విజయం సాధించింది.

Key Points

1

సీనియర్‌ తమిళ దర్శకుడు వి. శేఖర్‌ (72) శుక్రవారం చెన్నైలో అనారోగ్యంతో కన్నుమూశారు.

2

'నీంగళుమ్‌ హీరోదాన్‌' చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు; 'నాన్‌ పుడిచ్చ మాప్పిళై' విజయం సాధించింది.

4

శేఖర్ అవయవదానం చేశారు; పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు.

వి. శేఖర్ సినీ ప్రస్థానం, విజయాలు

సాక్షి, చెన్నై: సీనియర్‌ దర్శకుడు వి.శేఖర్‌ (72) శుక్రవారం సాయంత్రం చైన్నెలో అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. ఈయన స్వగ్రామం తిరువణ్ణామలై సమీపంలోని నెయ్‌ వానత్తం. మొదట్లో ప్రభుత్వ ఉద్యోగం చేసిన వి.శేఖర్‌ సినిమాలపై ఆసక్తితో ఎడిటర్‌ లెనిన్‌ వద్ద కొంత కాలం పని చేశారు. ఆ తరువాత కె.భాగ్యరాజ్‌ శిష్యుడు గోవిందరాజ్‌ వద్ద చేరి కన్ను తొలక్కనుమ్‌ సామి చిత్రానికి  సహాయ దర్శకుడిగా వ్యవహరించారు. ఆ తరువాత కె.భాగ్యరాజ్‌ వద్ద పలు చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు.

సినిమా 1990లో నిళల్గళ్‌ రవి హీరోగా నటించిన ‘నీంగళుమ్‌ హీరోదాన్‌’ అనే మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. తరువాత అదే నిళల్గళ్‌ రవిని హీరోగా పెట్టి నాన్‌ పుడిచ్చ మాప్పిళై మూవీ తీశారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఇది తెలుగులో మామగారు పేరుతో రీమేక్‌ అయింది. దాసరి నారాయణరావు, వినోద్‌ కుమార్‌, యమున ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించింది. ఆ తరువాత పలు కుటుంబ కథా చిత్రాలను రూపొందించారు.

తెలుగులో ‘మామగారు’తో ఘన విజయం

అవయవదానం నిర్మాతగానూ కొన్ని హిట్‌ చిత్రాలను నిర్మించారు. ఇటీవల అనారోగ్యానికి గురైన వీ.శేఖర్‌ స్థానిక పోరూర్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం ఆస్పత్రిలోనే తుది శ్వాస విడిచారు. స్థానిక కోడంబాక్కమ్‌, సుబ్బరాయన్‌ నగర్‌లోని సామియార్‌ మఠంలో నివసిస్తున్న ఈయనకు భార్య తమిళ్‌ సెల్వి, కూతురు మలర్‌కొడి, కొడుకు కారల్‌ మార్క్స్‌ ఉన్నారు. దర్శకుడు వి.శేఖర్‌ అవయవ దానం చేశారు. ఆ ప్రక్రియ పూర్తి అయిన తరువాత ఆయన భౌతిక కాయాన్ని శనివారం ఇంటికి తీసుకు వచ్చారు. వి.శేఖర్‌ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలిపారు.

అవయవదానం, సినీ ప్రముఖుల సంతాపం

వి. శేఖర్ మరణం తమిళ సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆయన మరణానంతరం అవయవదానం చేయడం ద్వారా తన దాతృత్వాన్ని చాటుకున్నారు. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.