|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కోలీవుడ్: షూటింగ్‌లో ప్రమాదం.. డేరింగ్ స్టంట్‌ మ్యాన్‌ మృతి.. హీరో విశాల్ సంతాపం

Published: 13-07-2025, 10:20 AM
కోలీవుడ్: షూటింగ్‌లో ప్రమాదం.. డేరింగ్ స్టంట్‌ మ్యాన్‌ మృతి.. హీరో విశాల్ సంతాపం

కోలీవుడ్‌లోని ఓ సినిమా షూటింగ్‌లో స్టంట్ మ్యాన్ రాజు ప్రమాదవశాత్తు మరణించారు. కారు స్టంట్ సమయంలో జరిగిన ఈ ప్రమాదంపై హీరో విశాల్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విశాల్ తన సంతాపాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

Key Points

1

కోలీవుడ్ స్టంట్ మ్యాన్ రాజు షూటింగ్‌లో ప్రమాదవశాత్తు మరణించారు.

2

కారు స్టంట్ సమయంలో జరిగిన ప్రమాదంలో ఆయన మృతి చెందారు.

4

కోలీవుడ్ పరిశ్రమలో రాజుకు ఉన్న కృషిని విశాల్ గుర్తుచేశారు.

షూటింగ్‌లో విషాదం

కోలీవుడ్ ‌ లో విషాదం నెలకొంది . పా రంజిత్ ‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమా షూట్ ‌ లో ప్రమాదం జరిగింది . ఈ ఘటనలో స్టంట్ ‌ మ్యాన్ ‌ రాజు మరణించారు . కారుతో స్టంట్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది . ఈ విషాద ఘటనపై కోలీవుడ్ హీరో , నిర్మాత విశాల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు . అతని మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు .

విశాల్ సంతాపం

విశాల్ తన ట్వీట్ ‌ లో రాస్తూ ..’ డైరెక్టర్ పా రంజిత్ సినిమా షూట్ ‌ లో ఈ రోజు ఉదయం జరిగిన విషాదం గురించి విన్నా . కారు బోల్తా పడే సన్నివేశం చేస్తూ స్టంట్ ఆర్టిస్ట్ రాజు మరణించాడనే వాస్తవాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టం. రాజు నాకు చాలా సంవత్సరాలుగా తెలుసు . అతను నా సినిమాల్లో చాలా రిస్క్ స్టంట్‌లు చేశాడు . ఎందుకంటే అతను చాలా ధైర్యవంతుడు. అతనికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా . రాజు ఆత్మకు శాంతి చేకూరాలి. ఈ విషాద సమయంలో ఆ దేవుడు వారి కుటుంబానికి మరింత ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా . ఇది కేవలం ఈ ట్వీట్ మాత్రమే కాదు .. అతని కుటుంబానికి భవిష్యత్తులో అండగా ఉంటాం . కోలీవుడ్ పరిశ్రమలో చాలా చిత్రాలకు ఆయన చేసిన కృషి ఎంతో విలువైంది . ఇది నా కర్తవ్యంగా వారి కుటుంబానికి మద్దతుగా నిలుస్తా ‘ అని పోస్ట్ చేశారు . రాజు మృతి పట్ల ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ సిల్వా కూడా తన సంతాపం ప్రకటించారు.

రాజు మృతి

కాగా .. స్టంట్ మ్యాన్ ‌ రాజు తన సాహసోపేతమైన స్టంట్‌లతో కోలీవుడ్ పరిశ్రమలో ఫేమస్ అయ్యారు . తన కెరీర్ ‌ లో చాలా ఏళ్లుగా కోలీవుడ్ ‌ లో అనేక చిత్రాలకు పనిచేశారు. రాజుకు చాలా ధైర్యవంతుడిగా , నైపుణ్యం కలిగిన స్టంట్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందారు . ప్రస్తుతం అతను పనిచేసిన చిత్రంలో ఆర్య హీరోగా నటిస్తున్నారు . ఈ మూవీని 2021లో వచ్చిన ‘సర్పట్ట పరంబరై’కి సీక్వెల్ ‌ గా తెరకెక్కిస్తున్నారు . ఈ సినిమా 2026లో థియేటర్లలోకి వచ్చే ఛాన్స్ ఉంది .

కోలీవుడ్ పరిశ్రమకు రాజు చేసిన సేవలను గుర్తుంచుకుంటూ, అతని కుటుంబానికి విశాల్ తన మద్దతును ప్రకటించారు. ఈ విషాద ఘటన కోలీవుడ్‌లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.