|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఓటీటీలో అదరగొడుతున్న తమిళ హారర్ కామెడీ థ్రిల్లర్..10 రోజుల్లోనే 100 మిలియన్లు దాటిన స్ట్రీమింగ్ మినిట్స్.. మీరు చూశారా?

Published: 01-10-2025, 12:36 AM
ఓటీటీలో అదరగొడుతున్న తమిళ హారర్ కామెడీ థ్రిల్లర్..10 రోజుల్లోనే 100 మిలియన్లు దాటిన స్ట్రీమింగ్ మినిట్స్.. మీరు చూశారా?

ఓటీటీలో థ్రిల్లర్లకు పెరుగుతున్న క్రేజ్‌ను మరోసారి నిరూపిస్తూ, తమిళ హారర్ కామెడీ థ్రిల్లర్ ‘హౌస్ మేట్స్’ రికార్డులు సృష్టిస్తోంది. జీ5లో విడుదలైన 10 రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలు దాటి సత్తా చాటింది. ఈ సినిమా సాధించిన అద్భుత విజయంపై ప్రత్యేక కథనం.

Key Points

1

'హౌస్ మేట్స్' తమిళ హారర్ కామెడీ మిస్టరీ థ్రిల్లర్.

2

జీ5 ఓటీటీలో విడుదలైన 10 రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలు దాటింది.

4

కొత్తగా పెళ్లైన జంటకు పారానార్మల్ సంఘటనలు ఎదురైన కథాంశంతో సాగుతుంది.

‘హౌస్ మేట్స్’ రికార్డుల పరంపర

ఓటీటీలో థ్రిల్లర్లకు ఉండే క్రేజ్ వేరు. ముఖ్యంగా హారర్ థ్రిల్లర్లకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. భాషతో సంబంధం లేకుండా ఏ సినిమా పరిశ్రమ నుంచి వచ్చినా హారర్ థ్రిల్లర్స్ ను చూస్తారు. ఇప్పుడు అలాంటి ఓ తమిళ హారర్ థ్రిల్లర్ ఓటీటీలో అదరగొడుతోంది. డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చిన 10 రోజుల్లోనే 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ ను దాటింది ఈ మూవీ.

ఓటీటీలో హారర్ కామెడీ థ్రిల్లర్ అదరగొడుతోంది. స్ట్రీమింగ్ కు వచ్చినప్పటి నుంచి ట్రెండింగ్ లో కొనసాగుతోంది. అదే ‘హౌస్ మేట్స్’ మూవీ. 10 రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను క్రాస్ చేసింది. ఇది సెప్టెంబర్ 19 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసినట్లు జీ5 ఓటీటీ సోషల్ మీడియాలో అనౌన్స్ చేసింది.

తమిళ సూపర్ హిట్ హారర్ కామెడీ మిస్టరీ థ్రిల్లర్ ‘హౌస్ మేట్స్’ ఓటీటీ లో సత్తాచాటుతోంది. జీ5 ఓటీటీలోకి సెప్టెంబర్ 19న ఈ మూవీ అడుగుపెట్టింది. అప్పటి నుంచి తన జోరు చూపిస్తుంది. ఇప్పుడు 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను క్రాస్ చేసింది 10 రోజుల్లోనే ఈ ఫీట్ సొంతం చేసుకుంది.

కథాంశం, నటీనటులు, సాంకేతిక బృందం

‘‘ ఫన్, ఫ్యాంటసీ, ఫ్యామిలీకి 100 మిలియన్ ప్లస్ మినిట్స్. బ్లాక్ బస్టర్ ఫ్యాంటసీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ హౌస్ మేట్స్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది’’ అని ఓ పోస్టర్ ను పంచుకుంది జీ5.

హౌస్ మేట్స్ మూవీ ఆగస్టు 1, 2025న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాకు స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ అన్నీ టి.రాజా వేల్. ఈ సినిమాలో దర్శన్, ఆర్ష చాందిని, కాళీ వెంకట్, వినోదిని తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని ప్లేస్మిత్ స్టూడియోస్, సౌత్ స్టూడియోస్, ఎస్కే ప్రొడక్షన్ పై విజయప్రకాష్, ఎస్పీ శక్తివేల్ నిర్మించారు. తమిళ స్టార్ హీరో శివకార్తీకేయన్ సమర్పించాడు. ఈ సినిమాకు థియటర్లో పాజిటివ్ టాక్ వచ్చినా లాంగ్ రన్ చేయలేకపోయింది.

హౌస్ మేట్స్ ఓ హారర్ కామెడీ మిస్టరీ థ్రిల్లర్. కార్తీక్, అనుకు కొత్తగా పెళ్లి అవుతుంది. వీళ్లు ఎంతో కష్టపడి కొనుక్కున్న సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ కు షిప్ట్ అవుతారు. హ్యాపీగా మ్యారేజ్ లైఫ్ గడపాలని కోరుకుంటారు. కానీ అక్కడ కొన్ని సంఘటనలు పారా నార్మల్ గా జరుగుతాయి. దీంతో భయపడతారు.

ఓటీటీలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన వైనం

అప్పుడే వాళ్లకు ఓ నిజం తెలుస్తుంది. ఆ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయనే వాస్తవం తెలుస్తుంది. 2012లో అదే ఫ్లాట్ లో నివసించిన రమేష్, విజీ దంపతులు, తమ కొడుకుతో అక్కడే ఉంటున్నారని మిస్టరీ రివీల్ అవుతుంది. అయితే వాళ్లు చనిపోయి దెయ్యాలుగా మారతారన్నదే ట్విస్ట్.

కార్తీక్, అనుకు కనిపించకుండా రమేష్ ఫ్యామిలీ అదే ఇంట్లో ఉంటుంది. మరి తర్వాత ఏం జరిగింది? అదే ఫ్లాట్ లో దెయ్యాలు ఉండటానికి కారణం ఏంటీ? అన్నది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.

మొత్తంగా, థియేటర్లలో పెద్దగా ఆడకపోయినా, ‘హౌస్ మేట్స్’ ఓటీటీలో అద్భుతమైన ఆదరణను పొందింది. జీ5లో 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలు దాటడం ఈ సినిమాకు లభించిన ప్రజాదరణకు నిదర్శనం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.