|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఎన్నికల హడావిడిలో స్టాలిన్.. సీఎస్కే మ్యాచ్‌తో రిలాక్స్!

Published: 11-04-2026, 11:05 PM
ఎన్నికల హడావిడిలో స్టాలిన్.. సీఎస్కే మ్యాచ్‌తో రిలాక్స్!
  • ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న సీఎం స్టాలిన్ కాస్త విరామం తీసుకున్నారు.
  • స్టాలిన్ తన కీ-ప్యాడ్‌లో CSK, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌ను చూశారు.
  • హై వోల్టేజ్ ఎన్నిక‌ల ప్రచారంలో ఐపీఎల్ బ్రేక్ అంటూ స్టాలిన్ పోస్ట్ చేశారు.
  • తమిళనాడులో మే 4న అసెంబ్లీ ఎన్నికల ఫ‌లితాలు వెలువడనున్నాయి.

తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. సీఎం స్టాలిన్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉంటూనే, కాస్త రిలాక్స్ అయ్యేందుకు చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ చూశారు. దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఎన్నికల ప్రచారంలో సీఎం స్టాలిన్ బిజీ

తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి స్టాలిన్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా, ప్రచారం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా కాస్త రిలాక్స్ అయిన స్టాలిన్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ చూశారు. చెన్నై వేదికగా CSK, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య శనివారం మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కారులో వెళుతూ చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ మ్యాచ్ లు తన కీ-ప్యాడ్ లో తిలకించారు.

చెన్నై, ఢిల్లీ మ్యాచ్ చూసిన స్టాలిన్ ఆస‌క్తి క‌ర పోస్టు పెట్టారు. హై వోల్టేజ్ ఎన్నిక‌ల ప్రచారంలో ఐపీఎల్ బ్రేక్ అంటూ పోస్ట్ కూడా పెట్టారు. చెన్నై ఆటగాడు సంజు శాంసన్ అదిరిపోయే సెంచరీ చేసినప్పటికీ, తన ఫేవరెట్ క్రికెటర్ ధోనిని మిస్ అవుతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు స్టాలిన్. అంతేకాదు, చెన్నై సూపర్ కింగ్స్ తొలి విజయాన్ని నమోదు చేసిన నేపథ్యంలో హర్షం వ్యక్తం చేశారు. ఇది ఇలా ఉండగా తమిళనాడులో ఈనెల 23వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. మొత్తం 234 నియోజకవర్గాలకు ఒకే దశలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. అధికారపక్షం డీఎంకె, అన్నా డీఎంకే మధ్య గట్టి పోటీ నెలకొన్న నేపథ్యంలో.. హీరో విజయ్ కూడా ఈ సారి బరిలో ఉన్నాడు. కాగా మే 4వ తేదీన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫ‌లితాలు వెలువ‌డ‌తాయి.

కీ-ప్యాడ్‌లో సీఎస్కే మ్యాచ్ చూసిన స్టాలిన్

మే 4న తమిళనాడు ఎన్నికల ఫలితాలు

ముఖ్యమంత్రి స్టాలిన్ ఎన్నికల వేడి నుండి కాస్త విరామం తీసుకొని సీఎస్కే మ్యాచ్ చూడటం ఆసక్తికరంగా మారింది. ఎన్నికల ఫలితాల కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.