
📌 Key Points
- తమిళనాట ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయాలు ఉత్కంఠగా మారాయి.
- మెజార్టీ లేదని గవర్నర్ విజయ్ ప్రమాణస్వీకారాన్ని నిలిపివేశారు.
- వామపక్షాల నిరాకరణతో విజయ్ పక్కచూపులు చూడాల్సి వచ్చింది.
- 35 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు విజయ్‌కి మద్దతుగా సమావేశమయ్యారు.
తమిళనాట ఎన్నికల ఫలితాల అనంతరం రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. సీఎం పీఠం కోసం ప్రయత్నిస్తున్న విజయ్‌కి మెజార్టీ లేకపోవడంతో గవర్నర్ షాక్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో, అన్నాడీఎంకేకు చెందిన మెజార్టీ ఎమ్మెల్యేలు విజయ్‌కి మద్దతుగా సమావేశం కావడం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేపుతోంది.
విజయ్‌కి గవర్నర్ షాక్!
ఎన్నికల ఫలితాలు విడుదలైన తరవాత తమిళనాడు రాజకీయాల్లో పూటకో ట్విస్ట్ చోటు చేసుకుంది. టీవీకేకు 108 సీట్లు రాగా మెజార్టీ రావాలంటే మరో 10 సీట్లు అవసరం అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ నుండి 5గురు ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించగా మరో ఐదు సీట్లు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 7న ప్రమాణస్వీకారం చేయాలనుకున్న విజయ్ కి గవర్నర్ షాక్ ఇచ్చారు. మెజార్టీ ఖరారు చేసిన తరవాతే సీఎంగా ప్రమాణస్వీకారం ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే విజయ్ వామపక్షాలను సంప్రదించినప్పటికీ ఆ ఎమ్మెల్యేలు విజయ్ కి మద్దతు తెలిపేందుకు నిరాకరించి డీఎంకేతోనే ఉంటామని స్పష్టం చేశారు. దీంతో విజయ్ మళ్లీ పక్క చూపులు చూడాల్సిన పరిస్థితి వచ్చింది.
ఈ నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. విజయ్ కి మద్దతుగా అన్నాడీఎంకే మెజార్టీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. చెన్నైలోని సీవీ షణ్ముగం ఆఫీసులో 35మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. వీరంతా విజయ్ కి మద్దతు ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్టు సమాచారం. ఎన్నికల్లో అన్నాడీఎంకే మొత్తం 47 స్థానాలు కైవసం చేసుకోగా అందులో 35మంది టీవీకేకు మద్దతు ప్రకటించేందుకు రెడీ అవ్వడం ఆసక్తికరంగా మారింది. సమావేశం తరవాత అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు విజయ్ కి మద్దతు ప్రకటిస్తే ఆయన రేపే సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారా లేదంటే మరో ముహూర్తం వెతుక్కుంటారా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.
అన్నాడీఎంకే మద్దతుతో మలుపు?
సీఎం ప్రమాణస్వీకారం ఎప్పుడు?
అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మద్దతుతో విజయ్ సీఎం పీఠాన్ని అధిరోహిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ కీలక పరిణామం తమిళనాడు రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనుంది. తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.


