|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తమిళ సూపర్ హిట్ ఫ్యామిలీ డ్రామా 3 BHK.. సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది.. తెలుగులోనూ స్ట్రీమింగ్

Published: 01-08-2025, 7:17 AM
తమిళ సూపర్ హిట్ ఫ్యామిలీ డ్రామా 3 BHK.. సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది.. తెలుగులోనూ స్ట్రీమింగ్

తమిళంలో విడుదలై మంచి విజయం సాధించిన 3 BHK సినిమా ఇప్పుడు ఓటీటీలో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. సిద్ధార్థ్, శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ఫ్యామిలీ డ్రామా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

Key Points

3 BHK: ఓటీటీ ఎంట్రీ విశేషాలు

తమిళంలో ఈ ఏడాది వచ్చిన హార్ట్ టచింగ్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా 3 బీహెచ్‌కే (3 BHK). సిద్ధార్థ్, శరత్ కుమార్, దేవయానిలాంటి వాళ్లు నటించిన ఈ సినిమా గత నెల థియేటర్లలో రిలీజ్ కాగా.. నెల రోజుల్లోపే డిజిటల్ ప్రీమియర్ అయింది. శుక్రవారం (ఆగస్ట్ 1) ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఓటీటీలోకి వచ్చేయడం విశేషం.

తమిళంతోపాటు తెలుగులోనూ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సిద్ధార్థ్ నటించిన మూవీ 3 బీహెచ్‌కే. ఇదో కమింగ్ ఆఫ్ ఏజ్ డ్రామా. జులై 4న థియేటర్లలో రిలీజైంది. తెలుగులో తమ్ముడు రిలీజైన రోజే వచ్చినా.. ఆ సినిమా కంటే పాజిటివ్ టాక్ తో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతోంది. నిజానికి ఈ నెల 4 నుంచి జియోహాట్‌స్టార్ లో వస్తుందని భావించినా.. ఇప్పుడు ముందుగానే రావడం విశేషం. ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళంలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

సిద్ధార్థ్ కెరీర్‌లో 40వ సినిమా

ఈ సినిమాకు తొలి రోజు నుంచే పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. అయితే బాక్సాఫీస్ దగ్గర మాత్రం పెద్దగా సక్సెస్ సాధించలేదు. దీంతో నెల రోజుల్లోపే ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ అయింది. సిద్ధార్థ్ తోపాటు శరత్ కుమార్, దేవయాని, చరిత్ర జే ఆచార్, రఘునాథ్ లాంటి వాళ్లు నటించారు.

3 బీహెచ్‌కే సినిమాను శ్రీగణేష్ డైరెక్ట్ చేశాడు. అరవింద్ సచ్చిదానందం రాసిన స్టోరీ 3 బీహెచ్‌కే వీదు (3 బీహెచ్‌కే ఇల్లు) ఆధారంగా ఈ సినిమాను తీశారు. సిద్ధార్థ్ కెరీర్లో ఇది 40వ సినిమా. ఇది ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చుట్టూ తిరిగే కథ. ఓ నగరంలో తమకంటూ ఓ ఇల్లు ఉండాలని కలలు కనే ఎన్నో మధ్య తరగతి కుటుంబాల కథే ఇది.

ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా

తమ ఆర్థిక సమస్యలు, ఇతర కష్టాలను ఎదుర్కొంటూనే ఈ కలను సాకారం చేసుకునేందుకు ఆ కుటుంబం ఎలాంటి కష్టాలు పడుతుందన్నదే ఈ 3 బీహెచ్‌కే సినిమా. ఇందులో ప్రభు అనే పాత్రలో సిద్ధార్థ్, వాసుదేవన్ పాత్రలో శరత్‌కుమార్ నటించారు. ఈ ఎమోషనల్ డ్రామాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి.

ఎన్ని కష్టాలు వచ్చినా తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని అనుకునే కుటుంబాల కథ ఇది అంటూ ఎంతో మంది అభిమానులు తమ రివ్యూలు షేర్ చేశారు. ఇప్పుడీ మూవీ ప్రైమ్ వీడియోలోకి కూడా రావడంతో ఓటీటీలో మరింత మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

3 BHK సినిమా థియేటర్లలో అంతగా ఆకట్టుకోకపోయినప్పటికీ, ఓటీటీ రిలీజ్ తో మంచి స్పందన లభించే అవకాశం ఉంది. సిద్ధార్థ్, శరత్ కుమార్ ల నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.