|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మాస్ న్యూస్: పవన్ తాతా టాలెంట్‌కి నందు ఫిదా! ‘హ్రీం’ మూవీతో రికార్డ్స్ బ్రేక్!

Published: 02-02-2026, 12:05 PM
మాస్ న్యూస్: పవన్ తాతా టాలెంట్‌కి నందు ఫిదా! 'హ్రీం' మూవీతో రికార్డ్స్ బ్రేక్!
  • హీరో పవన్ తాతా బర్త్‌డే వేడుకల్లో దండోరా హీరో నందు ప్రత్యేక అతిథిగా హాజరు
  • ‘హ్రీం’ సినిమా పోస్టర్స్, గ్లింప్స్‌ చూసి ఎంతో ఎక్సైట్ అయ్యానన్న నందు
  • పవన్ తాతా, చమిందా వర్మ కెమిస్ట్రీ అదుర్స్ అంటున్న సినీ విశ్లేషకులు
  • శివమ్ మీడియా పతాకంపై సుజాత మల్లాల సమర్పణలో ‘హ్రీం’ చిత్రం

టాలీవుడ్ లో సరికొత్త సంచలనం! హీరో పవన్ తాతా టాలెంట్ చూసి నందు షాక్ అయ్యారట! ‘హ్రీం’ మూవీతో పవన్ తాతా రికార్డులు కొల్లగొట్టడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.

నందు మాటల్లో పవన్ తాతా టాలెంట్

పవన్‌ తాతా, చమిందా వర్మ జంటగా నటించిన చిత్రం ‘హ్రీం’. శివమ్‌ మీడియా పతాకంపై సుజాత మల్లాల సమర్పించగా శివమల్లాల నిర్మించారు. రాజేష్‌ రావూరి ఈ చిత్రానికి దర్శకుడు. సోమవారం చిత్ర హీరో పవన్‌ తాతా జన్మదినం సందర్భంగా చిత్ర కార్యాలయంలో జరిగిన బర్త్‌డే వేడుకల్లో దండోరా చిత్ర హీరో నందు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నందు మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడే ‘హ్రీం’ సినిమా పోస్టర్స్, గ్లింప్స్‌ చూశాను. చూడగానే నన్ను ఎంతో ఎక్సైట్ చేసిన కంటెంట్‌ ఇది అనిపించింది. త్వరలోనే మీ అందరూ కూడా ఈ కంటెంట్‌ను చూస్తారు. ముఖ్యంగా ఈ సినిమా నిర్మాతతో నాకు ఎంతో అనుబంధం ఉంది. ఎన్నో ఏళ్లుగా మా ట్రావెల్‌ కొనసాగుతుంది. నాకు ఎప్పుడైనా ఏ విషయంలో అయినా సందేహాలు ఉంటే నేను ఏమి ఆలోచించకుండా శివమల్లాల అన్నతో షేర్‌ చేసుకుంటాను. ఇండస్ట్రీలో ఎంతోమందికి ఆయన వెల్‌ విషర్‌. ఈ సినిమాతో తమ కెరియర్‌లను గొప్పగా ప్లాన్‌ చేసుకుంటున్న హీరో పవన్‌ తాతాకు, హీరోయిన్‌ డాక్టర్‌ చమిందా వర్మలకు నా కృతజ్ఙతలు’ అని నందు తెలియజేశారు.

హీరో పవన్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ బర్త్‌డే నాకు ఎంతో ప్రత్యేకం. నాకు ‘హ్రీం’ సినిమా ద్వారా మంచి అవకాశం అభించింది. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్‌. ఈ వేడుకలో నా కుటుంబ సభ్యులు మా మేనత్త రేణుకమ్మ, గోపి, రేఖ అందరూ పాల్గొనటం చాలా హ్యాపీగా ఉంది. కంటెంట్‌ చూసిన తర్వాత మీ అందరూ కూడా నన్ను ప్రశంసిస్తారని ఆశిస్తున్నా’’ అన్నారు. ఈ జన్మదిన వేడకల్లో సుజాత మల్లాల, శైలజా పద్మరాజు, దర్శకుడు రాజేష్‌ రావూరి, దర్శకుడు కృష్ణ కాంత్, వీఎఫ్‌ఎక్స్‌ డైరెక్టర్‌ రాజ్‌పవన్‌ కొమ్మోజు, ఎడిటర్‌ డిఐ కలరిస్ట్‌ వైఎస్‌ఎస్‌ శివప్రకాష్, నిర్మాత శ్రీనివాస్‌ బొప్పన, ఐయస్‌ రాజు, నిర్మాత ముని శివ తదితరులు పాల్గొన్నారు.

‘హ్రీం’ మూవీ గ్లింప్స్‌కి సూపర్ రెస్పాన్స్

బర్త్‌డే వేడుకల్లో సందడి చేసిన పవన్ తాతా

పవన్ తాతా ‘హ్రీం’ సినిమాతో టాలీవుడ్‌లో ఎలాంటి సంచలనం సృష్టిస్తారో చూడాలి. మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.