|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఓటీటీలోకి తమిళ థ్రిల్లర్ మూవీ ‘మనిదర్గల్’.. ఐఎండీబీలో 9.1 రేటింగ్.. పీకలదాకా తాగి కష్టాల్లో పడే ఆరుగురు స్నేహితుల కథ

Published: 14-07-2025, 10:45 PM
ఓటీటీలోకి తమిళ థ్రిల్లర్ మూవీ 'మనిదర్గల్'.. ఐఎండీబీలో 9.1 రేటింగ్.. పీకలదాకా తాగి కష్టాల్లో పడే ఆరుగురు స్నేహితుల కథ

ఐఎండీబీలో 9.1 రేటింగ్‌తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న తమిళ థ్రిల్లర్ మూవీ ‘మనిదర్గల్’ త్వరలోనే ఆహా ఓటీటీలో ప్రసారం కానుంది. పీకలదాకా తాగి కష్టాల్లో పడే ఆరుగురు స్నేహితుల కథ ఇది.

Key Points

1

ఐఎండీబీలో 9.1 రేటింగ్ సాధించిన తమిళ థ్రిల్లర్ 'మనిదర్గల్'

2

ఆరుగురు స్నేహితుల మధ్య జరిగే ఊహించని ఘటన

4

జులై 17 నుండి ఆహా తమిళంలో స్ట్రీమింగ్

మనిదర్గల్: ఆకర్షణీయమైన కథాంశం

థ్రిల్లర్ మూవీ ఫ్యాన్స్.. ఈ వారం మీరు ఇష్టపడే ఓ గ్రిప్పింగ్ తమిళ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి రాబోతోంది. ఈ సినిమా పేరు మనిదర్గల్ (Manidhargal). దీనర్థం మనుషులు అని. మే 30న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులకు తెగ నచ్చేయడంతో ఐఎండీబీలో ఏకంగా 9.1 రేటింగ్ సొంతం చేసుకుంది. పీకలదాకా తాగి కష్టాల్లో పడే స్నేహితుల స్టోరీ ఇది.

తమిళ థ్రిల్లర్ మూవీ మనిదర్గల్ (Manidhargal) ఆహా తమిళం ఓటీటీలోకి రాబోతోంది. ఈ గురువారం (జులై 17) నుంచే సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు ఆ ఓటీటీ సోమవారం (జులై 14) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

9.1 ఐఎండీబీ రేటింగ్: ప్రేక్షకుల స్పందన

“మనిదర్గల్ ఎలా ఉన్నారు? మనిదర్గల్ జులై 17న ఆహా తమిళంలో ప్రీమియర్ కానుంది” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ కూడా పోస్ట్ చేసింది. ఆ పోస్టర్ పై మూవీ ఐఎండీబీ రేటింగ్ 9.1గా ఉన్నట్లు చూపించారు.

మనిదర్గల్ మూవీ మే 30న థియేటర్లలో రిలీజైంది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రివ్యూలే వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం పెద్దగా సక్సెస్ సాధించలేకపోయింది. ఈ సినిమా ఆరుగురు స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. ఇందులో కపిల్ వేలవన్, దక్ష లీడ్ రోల్స్ లో నటించారు. వీళ్లే కాకుండా గుణవంతన్ ధనపాల్, అర్జున్‌దేవ్ శరవణన్, సాంబ శివమ్ లాంటి వాళ్లు కూడా నటించారు.

ఆహా తమిళం ఓటీటీలో ప్రసారం

ఈ సినిమా మొత్తం ఒక రాత్రి జరిగే స్టోరీ. చాలా వరకు షూటింగ్ కూడా రాత్రి వేళల్లోనే జరిపినట్లు కనిపిస్తుంది. ఆరుగురు స్నేహితులు ఓ రాత్రి పార్టీ అంటూ పీకలదాకా తాగుతారు. ఆ తర్వాత వాళ్ల జీవితాలు మారిపోతాయి. ఓ ఊహించని ఘటన జరుగుతుంది. దీంతో వాళ్లు ఒకరిపై మరొకరు అనుమానం వ్యక్తం చేసుకుంటారు.

అసలు ఏం జరిగింది? ఆ తర్వాత వాళ్ల జీవితాలు ఏమయ్యాయి అన్నది ఈ సినిమాలో చూడొచ్చు. ఐఎండీబీలో 9.1 రేటింగ్ సాధించిన సినిమాకు ప్రేక్షకులు పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు. ఈ తమిళ థ్రిల్లర్ మనిదర్గల్ ఆహా తమిళం ఓటీటీలో గురువారం (జులై 17) నుంచి స్ట్రీమింగ్ కానుంది.

తమిళ థ్రిల్లర్ ‘మనిదర్గల్’ సినిమా ఆహా తమిళం ఓటీటీలో ప్రసారం కానున్నందున, అద్భుతమైన థ్రిల్లర్ అనుభవాన్ని కోరుకునేవారు తప్పకుండా చూడవచ్చు. ఈ సినిమా ఖచ్చితంగా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.