
📌 Key Points
- తన్వీర్ అహ్మద్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపించారు.
- వెస్టిండీస్ ఆటగాళ్లను బీసీసీఐ కొనేసిందని తన్వీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
- టీమిండియా వెస్టిండీస్‌పై గెలిచి సెమీఫైనల్‌కు చేరుకుంది.
- సంజు శాంసన్ 97 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఇండియా, వెస్టిండీస్ మ్యాచ్‌లో ఫిక్సింగ్ జరిగిందని పాకిస్తాన్ మాజీ ఆటగాడు తన్వీర్ అహ్మద్ ఆరోపించారు. డ్రింక్స్ బ్రేక్‌లో వెస్టిండీస్ ఆటగాళ్లను కొనేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై తీవ్ర దుమారం రేగుతోంది.
తన్వీర్ అహ్మద్ సంచలన ఆరోపణలు
Tanveer Ahmed: టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ లో ( T20 World Cup 2026 tournament ) టీమిండియా ( Team India) గెలిచిందంటే చాలు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు మీద పడిపోతున్నారు. మ్యాచ్ గెలిస్తే మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ కారు కూతలు కూస్తున్నారు. ఇక పాకిస్తాన్ ఇంటికి వెళ్లి టీం ఇండియా సెమీఫైనల్ చేరుకున్న నేపథ్యంలో మరోసారి పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు విషం కక్కారు. తాజాగా జరిగిన వెస్టిండీస్ వర్సెస్ టీమ్ ఇండియా ( India vs West Indies ) మ్యాచ్ పై పాకిస్తాన్ (Pakistan ) మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మ్యాచ్ కంప్లీట్ గా ఫిక్సింగ్ జరిగిందని బాంబు పేల్చారు. కావాలనే వెస్టిండీస్ బౌలర్లు బంతులు నెమ్మదిగా వేశారని, క్యాచులు వదిలేసారని ఆరోపణలు చేశారు తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed ). మ్యాచ్ ఫిక్సింగ్ జరగడం వల్లనే టీమిండియా గెలిచిందని.. బీసీసీఐ ఇచ్చిన డబ్బులకు వెస్టిండీస్ ప్లేయర్లు అమ్ముడుపోయారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తన్వీర్ అహ్మద్. డ్రింక్స్ బ్రేక్ లోనే వెస్టిండీస్ ప్లేయర్లను కొనేశారని హాట్ కామెంట్స్ చేశారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందన్న తన్వీర్
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య ఆదివారం మ్యాచ్ జరిగింది. కచ్చితంగా గెలవాల్సిన ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించింది టీమిండియా. వెస్టిండీస్ విధించిన 196 పరుగుల లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ చేదించింది టీమిండియా. 19.2 ఓవర్లలోనే మ్యాచ్ ఫినిష్ చేసింది. దీంతో వెస్టిండీస్ పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది టీమిండియా. అయితే ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది డేంజర్ ఆటగాడు సంజు శాంసన్. 97 పరుగులు చేసిన సంజు శాంసన్, జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో చాలా రోజుల నుంచి బాధపడుతున్న అతనికి.. ఈ మ్యాచ్ అద్భుత అవకాశాన్ని కల్పించింది. దీంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు సంజు. ఇక వెస్టిండీస్ పై విజయం సాధించిన టీమిండియా, సెమీఫైనల్ లో అడుగు పెట్టింది. మార్చి 5వ తేదీన టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య సెమీఫైనల్ జరగనుంది.
టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ పై పాకిస్తాన్ మాజీ ఆటగాడు తన్విర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మ్యాచ్ లో మొత్తం దొంగాట ఆడారని మండిపడ్డారు. డ్రింక్స్ సమయంలోనే వెస్టిండీస్ ప్లేయర్లను బీసీసీఐ కొనుగోలు చేసిందని ఆరోపణలు చేశారు. అందుకే టీమిండియా ఐదు వికెట్ల తేడాతో అవలీలగా గెలిచిందన్నారు. ఫిక్సింగ్ జరిగింది కాబట్టే ఫామ్ లో లేని సంజు శాంసన్ అద్భుతంగా రాణించాడని తెలిపారు.
సెమీఫైనల్‌కు టీమిండియా
?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ చేసిన ఈ ఆరోపణలు క్రికెట్ ప్రపంచంలో సంచలనం రేపాయి. దీనిపై బీసీసీఐ ఎలా స్పందిస్తుందో చూడాలి. రానున్న రోజుల్లో దీనిపై మరింత సమాచారం వెల్లడి కానుంది.


