
📌 Key Points
- తరుణ్ భాస్కర్ హీరోగా ‘ఓం శాంతి శాంతి శాంతి’ సినిమా జనవరి 30న విడుదల కానుంది.
- ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ సరసన ఈషా రెబ్బ హీరోయిన్‌గా నటించింది.
- ఈ సినిమా మలయాళ చిత్రం ‘జయా జయా జయా జయహే’కి రీమేక్.
- వివాహ జీవితంలోని సమస్యల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది.
టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన ‘ఓం శాంతి శాంతి శాంతి’ సినిమా విడుదల వాయిదా పడింది. ఈ చిత్రం జనవరి 23న విడుదల కావాల్సి ఉండగా, జనవరి 30కి వాయిదా వేశారు. కారణాలు తెలియాల్సి ఉంది.
తరుణ్ భాస్కర్ సినిమా విడుదల వాయిదా
Om Shanthi Shanthi Shanthi: టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ (Tharun Bhascker)దర్శకుడిగా పలు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఇలా పలు సినిమాల ద్వారా దర్శకుడిగా ప్రేక్షకులను మెప్పించిన ఈయన మరికొన్ని సినిమాలలో కీలక పాత్రలలో నటించి వెండి తెరపై సందడి చేశారు.. ఇలా తరుణ్ భాస్కర్ నటనకు మంచి మార్పులు పడటంతో ఈయన ఏకంగా హీరోగా మారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు . త్వరలోనే తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన ఓం శాంతి శాంతి శాంతి (Om Shanthi Shanthi Shanthi)సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమాని జనవరి 23వ తేదీ విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారకంగా తెలియచేయడమే కాకుండా పెద్ద ఎత్తున ప్రమోషన్లను కూడా నిర్వహించారు.
ఇక ఈ సినిమా విడుదలకు కేవలం రెండు రోజులు సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో చిత్ర బృందం ఊహించని షాక్ ఇచ్చారు. ఈ సినిమా జనవరి 23 వ తేదీ విడుదల కావడం లేదని, ఈ సినిమాని తిరిగి జనవరి 30 వ తేదీ విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా తెలియజేస్తూ ఒక వీడియోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . ఇలా ఉన్నఫలంగా ఈ సినిమా విడుదల తేదీ మార్పుకు గల కారణాలు ఏంటి అనేది తెలియాల్సి ఉంది. ఇలా ఈ సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటిస్తూ ఈషా రెబ్బ(Eesha Rebba) తరుణ్ భాస్కర్ ఒక ఫన్నీ వీడియోని షేర్ చేశారు.
ఇక ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ కు జోడిగా ఈషా రెబ్బ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే.A R సజీవ్ ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ సినిమాకు రీమేక్ అనే విషయం తెలిసిందే. మలయాళ చిత్ర పరిశ్రమలో “జయా జయా జయా జయహే ” అనే సినిమాకు రీమేక్ సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గ్రామీణ నేపథ్యంలో కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా వైవాహిక జీవితం తర్వాత వచ్చే సమస్యల నేపథ్యంలో ఉండబోతుందని తెలుస్తోంది.
కొత్త విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం
#OmShantiShantiShantihi releasing on JAN 30th ✨💛 pic.twitter.com/h5WbLl1wqi
— Eesha Rebba (@YoursEesha) January 20, 2026
సినిమా విడుదల వాయిదాకు కారణం ఏమిటి?
ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదల చేసిన ప్రమోషనల్ అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేశాయి. ఈ సినిమా ద్వారా తరుణ్ భాస్కర్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.. ఈ సినిమాలో ఈషా రెబ్బ హీరోయిన్ గా నటించిన నేపథ్యంలో తరుణ్ భాస్కర్ ఈషా రెబ్బ గురించి కూడా సోషల్ మీడియాలు ఎన్నో రకాల వార్తలో వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ప్రస్తుతం రిలేషన్ లో ఉన్నారని ,త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
‘ఓం శాంతి శాంతి శాంతి’ సినిమా విడుదల వాయిదా పడినప్పటికీ, జనవరి 30న విడుదల కానుంది. ఈ సినిమాలో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బల నటన ఎలా ఉండబోతుందో చూడాలి.

