|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: తరుణ్ వల్లే ఉదయ్ కిరణ్ కెరీర్ బ్లాక్ బస్టర్ అయింది.. అసలేం జరిగిందంటే?

Published: 10-02-2026, 6:05 AM
షాకింగ్: తరుణ్ వల్లే ఉదయ్ కిరణ్ కెరీర్ బ్లాక్ బస్టర్ అయింది.. అసలేం జరిగిందంటే?
  • తరుణ్ బిజీగా ఉండటంతో ‘నువ్వు నేను’ సినిమాలో ఉదయ్ కిరణ్ కు అవకాశం లభించింది – ఇది నిజంగా షాకింగ్ న్యూస్!
  • తేజ దర్శకత్వంలో వచ్చిన ‘నువ్వు నేను’ సినిమా ఉదయ్ కిరణ్ కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది, ఇది ఒక బ్లాక్ బస్టర్ హిట్.
  • ‘నువ్వు నేను’ సినిమాలో ‘చీ చీ మీ పెద్దోళ్లున్నారే’ డైలాగ్ యూత్ లో ఒక ట్రెండ్ సెట్టర్ అయింది, ప్రతి ఒక్కరూ ఈ డైలాగ్ గుర్తు పెట్టుకున్నారు.
  • ఉదయ్ కిరణ్ నటించిన ‘చిత్రం’ సినిమా బ్లాక్ బస్టర్ అయిన తర్వాత, ‘నువ్వు నేను’ సినిమాతో ఆయన స్టార్‌డమ్ శిఖరాలకు చేరుకుంది.

ఉదయ్ కిరణ్ గురించి మనందరికీ తెలుసు. అయితే, ఆయన కెరీర్‌ను మలుపు తిప్పిన ఒక బ్లాక్‌బస్టర్ చిత్రం వెనుక ఉన్న షాకింగ్ నిజం మీకు తెలుసా? ఆ సినిమా ఎలా వచ్చిందో తెలుసుకుందాం!

తరుణ్ బిజీగా ఉండటంతో ఉదయ్ కిరణ్‌కు అవకాశం!

ఉదయ్ కిరణ్ ను తలుచుకుంటే.. ఆయన అభిమానుల గుండెలు బరువెక్కుతాయి.. కళ్లలో నీళ్ళు తెలియకుండానే ఉబికి వస్తుంటాయి.. హీరోగా ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ హీరో.. చిన్నవయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఆయన్ను అభిమానించే ఎంతో మందికి కన్నీళ్లు మిగిల్చాడు. కానీ ఉదయ్ కిరణ్ చేసిన సినిమాలు ఎప్పటికీ.. అతన్ని అభిమానుల నుంచి దూరం చేయకుండా.. మరింత గుర్తు చేస్తుంటాయి. మంచి మంచి ప్రేమ కథలతో.. యూత్ ఆడియన్స్ తో పాటు.. ఫ్యామిలీ ప్రేక్షకులను కూడా అలరించాడు యంగ్ హీరో. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలను అనుభవించాడు.

ఉదయ్ కిరణ్ ఇండస్ట్రీకి వచ్చీ రావడంతోనే హిట్లు కొట్టాడు. ఫస్ట్ మూవీతోనే స్టార్ గా మారాడు. తేజ డైరెక్షన్ లో ఉదయ్ కిరణ్ నటించిన చిత్రం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈసినిమాతో ఉదయ్ కిరణ్ లవర్ బాయ్ గా ఆడియన్స అందరిలో రిజిస్టర్ అయ్యాడు. చిత్రం సినిమా తరువాత వరుసగా ఎన్నో అవకాశాలు అతన్ని పలుకరించాయి. కానీ సెలక్టీవ్ గా సినిమాలు తీసుకోవడం వల్ల… ఉదయ్ ఇండస్ట్రీలో హీరోగా నిలబడగలిగాడు. అయితే ఆయన కెరీర్ ను కంప్లీట్ గా మార్చిన సినిమా నువ్వు నేను. ఈసినిమా అవకాశం ఉదయ్ కిరణ్ కు ఎలా వచ్చిందో తెలుసా?

తేజ దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ బ్లాక్ బస్టర్

అయితే నువ్వు నేను సినిమా అవకాశం ఉదయ్ కిరణ్ కు చాలా విచిత్ర పరిస్థితుల్లో వచ్చింది. ఈసినిమా కోసం ముందుగా తరుణ్ ను తీసుకోవాలి అని అనుకున్నారట మేకర్స్. తరుణ్ కోసమే ఈ కథను రెడీ చేసుకున్నారట. ఆ టైమ్ లో తరుణ్ లవర్ బాయ్ ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు. వరుస సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్నాడు. తరుణ్ బిజీ షెడ్యూల్ వల్ల ఈ సినిమాను తరుణ్ చేయలేకపోయాడ. అదే టైమ్ లో చిత్రం సినిమాతో ఒకేసారి వెలుగులోకి వచ్చాడు ఉదయ్ కిరణ్.. ఇక నువ్వు నేను సినిమాకు కూడా తేజనే డైరెక్టర్ కావడం.. అతని మనసులో ముందు నుంచే ఉదయ్ కిరణ్ ను తీసుకోవాలని ఆలోచన ఉండటంతో.. వెంటనే అవకాశం అతన్ని వరించింది.

ఉదయ్ కిరణ్ కెరీర్ ను కంప్లీట్ గా మార్చిన సినిమా నువ్వు నేను. చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిన తరువాత ఉదయ్ చేసిన రెండో సినిమా ఇది. ఈసినిమా తో ఉదయ్ కిరణ్ కు ఇండస్ట్రీలో స్టార్ డమ్ వచ్చేసింది. ఈమూవీ యూత్ పై ఎలాంటి ప్రభావం చూపించిందంటే.. నువ్వు నేను పాటలు పెట్టుకుని ప్రేమికులు తెగ మురిసిపోయారు. చీ చీ మీ పెద్దోళ్లున్నారే.. డైలాగ్ అయితే మారు మోగిపోయింది. ప్రేమికులలో ధైర్యాన్ని నింపింది ఈ సినిమా. నువ్వు నేను బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో

నువ్వు నేను సినిమాతో ఉదయ్ కిరణ్ స్టార్ డమ్

హీరోగా టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులను ఫేస్ చేసిన హీరో ఉదయ్ కిరణ్. హీరోగా మాత్రమే కాదు మంచి మనసున్న వ్యక్తిగా ఉదయ్ కిరణ కు పరిశ్రమలో పేరుంది. హీరోగా మంచి భవిష్యత్తు ఉండగానే.. మానసిక ఒత్తడి కారణంగా ఉదయ్ కిరణ ఆత్మహత్య చేసుకోవడం అభిమానులను, ప్రేక్షకులను కంటతడిపెట్టించింది. తన సినిమాలతో ప్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యాడు ఉదయ్ కిరణ్. ఉదయ్ కిరణ్ మరణం పై పలు అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో చాలా వెర్షన్లు వినిపిస్తుంటాయి. ఏది ఏమైనా ఫిల్మ్ ఇండస్ట్రీ మంచి హీరోను కోల్పోయింది. అభిమానులు మంచి మనసున్ననటుడిని కోల్పోయారు.

ఉదయ్ కిరణ్ కెరీర్ గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి. త్వరలో మరిన్ని అప్డేట్స్‌తో మీ ముందుకు వస్తాం. అప్పటివరకు వేచి ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.