
📌 Key Points
- టీసీఎస్ నాసిక్ బ్రాంచ్‌లో లైంగిక వేధింపులు, మతమార్పిడి ఆరోపణలు సంచలనం.
- హిందూ అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుని లవ్ జిహాద్‌కు పాల్పడ్డారని ఆరోపణలు.
- బాధితుడిని ఈద్ సందర్భంగా టోపీ పెట్టించి నమాజ్ చేయించారని ఆరోపణ.
- పిల్లలు లేని వ్యక్తిగత జీవితంపై నీచమైన కామెంట్స్ చేశారని బాధితుడి ఆవేదన.
ఐటీ దిగ్గజం టీసీఎస్ నాసిక్ బ్రాంచ్‌లో లైంగిక వేధింపులు, మతమార్పిడి ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఓ వర్గం ఉద్యోగులు హిందూ అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుని లవ్ జిహాద్‌కు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
టీసీఎస్ నాసిక్‌లో లైంగిక వేధింపుల కలకలం
ఐటీ దిగ్గజం టీసీఎస్ (TCS) నాసిక్ బ్రాంచ్‌లో వెలుగు చూసిన లైంగిక వేధింపులు, మతమార్పిడి ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ వ్యవహారంలో రోజుకో కొత్త కోణం బయటకు వస్తోంది. ముఠాగా ఏర్పడిన ఓ వర్గం ఉద్యోగులు హిందూ అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుని లవ్ జిహాద్ కు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ తాజాగా అదే బ్రాంచ్‍కు చెందిన ఓ ఉద్యోగి చేసిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. సదరు ఉద్యోగి ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ తాను కూడా ఆ ముఠా బాధితుడినేనని, తన పట్ల వారు మతపరమైన వేధింపులకు పాల్పడటంతో పాట పెళ్లై సంతానం లేని తన వ్యక్తిగ జీవింతంపై అత్యంత నీచమైన కామెంట్స్ చేశారని ఆరోపించారు.
లవ్ జిహాద్ ఆరోపణలు, బాధితుల ఆవేదన
2023 ఈద్ సందర్భంగా తౌసిఫ్ అనే నిందితుడు తన ఇంటికి తీసుకెళ్లి బలవంతంగా టోపీ పెట్టించి నమాజ్ చేయించాడని.. ఆ ఫోటోలను కంపెనీ అఫీషియల్ గ్రూపుల్లో షేర్ చేసి అవమానించారని బాధితుడు పేర్కొన్నారు. నా మతాన్ని కించపరచడమే కాకుండా శాకాహారిని అయిన తనను బయటకు తీసుకువెళ్లి బలవంతంగా మాంసం తినమేనేవారని ఆరోపించాడు. వీరి ఆరోపణలు కేవలం మతం వరకే పరిమితం కాలేదని వ్యక్తిగత జీవితాలపై కూడా అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడేవారని ఆవేదన వ్యక్తం చేశాడు. పెళ్లై ఏళ్లు గడుస్తున్నా తనకు పిల్లలు లేకపోవడాన్ని నిందితులు హేళన చేసేవారని, “వైద్యం చేయించుకున్నా నీకు పిల్లలు కలగడం లేదు కదా.. నీకు సంతానం కావాలంటే నీ భార్యను మా దగ్గరకు పంపు” అంటూ అత్యంత అసభ్యకరంగా, నీచంగా మాట్లాడేవారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేసినట్లు జాతీయ మీడియా పేర్కొంది.
టీసీఎస్ చర్యలు, కార్యకలాపాల నిలిపివేత
తాజా పరిణామాల నేపథ్యంలో ఈ ఘటనను టీసీఎస్ తీవ్రంగా పరిగణించింది. నాసిక్ బీపీవో సంస్థ (TCS Nashik BPO)లో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఇంటినుంచే పని చేయాలని గురువారం ఉద్యోగులకు సూచించింది.
టీసీఎస్ ఈ ఘటనను తీవ్రంగా పరిగణించింది. నాసిక్ బ్రాంచ్ కార్యకలాపాలను నిలిపివేసింది. ఉద్యోగులను ఇంటి నుండి పని చేయాలని ఆదేశించింది. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేసే అవకాశం ఉంది.


