|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

టీసీఎస్ లో లైంగిక వేధింపుల కలకలం! డెలాయిట్ రంగంలోకి దిగడంతో సంచలన నిజాలు వెలుగులోకి!

Published: 18-04-2026, 5:35 AM
టీసీఎస్ లో లైంగిక వేధింపుల కలకలం! డెలాయిట్ రంగంలోకి దిగడంతో సంచలన నిజాలు వెలుగులోకి!
  • నాసిక్ టీసీఎస్ బిపిఓ యూనిట్‌లో లైంగిక వేధింపుల ఉదంతం సంచలనం.
  • విచారణ కోసం స్వతంత్ర పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసిన టీసీఎస్ యాజమాన్యం.
  • కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులను సస్పెండ్ చేసిన సంస్థ.
  • నిదా ఖాన్ హెచ్ఆర్ మేనేజర్ కాదని, ప్రాసెస్ అసోసియేట్ మాత్రమేనని టీసీఎస్ ప్రకటన.

నాసిక్ టీసీఎస్ బిపిఓ యూనిట్‌లో జరిగిన లైంగిక వేధింపుల ఉదంతం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో టీసీఎస్ యాజమాన్యం కఠిన చర్యలు తీసుకుంది. డెలాయిట్‌తో స్వతంత్ర విచారణకు ఆదేశించింది.

టీసీఎస్ లో లైంగిక వేధింపుల కేసు సంచలనం

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నాసిక్ టీసీఎస్ (TCS) బిపిఓ యూనిట్‌లో వెలుగులోకి వచ్చిన లైంగిక వేధింపుల ఉదంతం సంచలనం సృష్టిస్తోంది. ఈ వ్యవహారం కారణంగా టీసీఎస్ కు భారీ ఎఫెక్ట్ పడింది. టీసీఎస్ నింధితులను కాపాడే ప్రయత్నం చేస్తుందని ఆరోపిస్తూ.. దేశంలోని అన్ని టీసీఎస్ ఆఫీసుల ముందు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసుపై టీసీఎస్ యాజమాన్యం (TCS Management) కీలక నిర్ణయాలు తీసుకుంది. నాసిక్ టీసీఎస్ యూనిట్‌లో జరిగిన లైంగిక వేధింపులు (Sexual harassment), మతపరమైన ఒత్తిళ్ల ఆరోపణలపై టీసీఎస్ యాజమాన్యం శనివారం (ఏప్రిల్ 18, 2026) కీలక ప్రకటన చేసింది.

స్వతంత్ర విచారణ కమిటీ ఏర్పాటు

ఈ వ్యవహారంపై లోతైన విచారణ జరిపేందుకు సంస్థ ఒక స్వతంత్ర పర్యవేక్షణ కమిటీని (Oversight Committee) ఏర్పాటు చేసింది. దీనికి స్వతంత్ర డైరెక్టర్ కేకి మిస్త్రీ నేతృత్వం వహిస్తుండగా, అంతర్గత దర్యాప్తుకు సహాయపడేందుకు అంతర్జాతీయ ఆడిటింగ్ సంస్థ డెలాయిట్ (Deloitte), లా సంస్థ ట్రైలీగల్ (Trilegal) ప్రతినిధులను స్వతంత్ర సలహాదారులుగా నియమించింది. ఇప్పటికే ఈ కేసులో బాధితుల ఫిర్యాదుల మేరకు 9 ఎఫ్ఐఆర్ (FIR) లు నమోదు కాగా, దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులను సంస్థ సస్పెండ్ చేసింది.

నిందితులపై టీసీఎస్ చర్యలు

ఈ కేసులో ప్రధాన నిందితురాలు అయిన నిదాఖాన్ (Nidakhan) పాత్రపై టీసీఎస్ యాజమాన్యం స్పష్టత ఇచ్చింది. ఆమె హెచ్ఆర్ (HR) మేనేజర్ కాదని, కేవలం ప్రాసెస్ అసోసియేట్ (Process Associate) గా మాత్రమే పనిచేస్తోందని సంస్థ వెల్లడించింది. ఆమెకు రిక్రూట్‌మెంట్, నాయకత్వ బాధ్యతలు ఏవీ లేవని తెలిపింది. మరోవైపు, పరారీలో ఉన్న నిదా ఖాన్ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తుండగా, ఆమె ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అలాగే నాసిక్ యూనిట్ మూసివేస్తున్నారన్న వార్తలను టీసీఎస్ ఖండించింది. ఆపరేషన్లు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేస్తూనే, మహిళా ఉద్యోగుల భద్రతకు తాము కట్టుబడి ఉన్నామని భరోసా ఇచ్చింది.

టీసీఎస్ ఈ ఘటనపై సీరియస్ గా దృష్టి సారించింది. విచారణాధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించి బాధితులకు న్యాయం చేస్తారని ఆశిద్దాం. మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.