|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఢిల్లీలో రేవంత్ రెడ్డితో టీడీపీ మహిళా నేతల సంచలన భేటీ! రాజకీయం మారుతుందా?

Published: 16-04-2026, 3:05 PM
ఢిల్లీలో రేవంత్ రెడ్డితో టీడీపీ మహిళా నేతల సంచలన భేటీ! రాజకీయం మారుతుందా?
  • తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఢిల్లీలో కలిసిన ఏపీ టీడీపీ మహిళా నేతలు.
  • చంద్రబాబు ఆదేశాల మేరకు మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ కోసం ఢిల్లీకి టీడీపీ మహిళలు.
  • గతంలో టీడీపీలో రేవంత్ రెడ్డి పని చేయడంతో ఏపీ నేతలకు ఆయనతో సాఫ్ట్ కార్నర్ ఉంది.
  • ఏపీ మాజీ మంత్రి పరిటాల సునీత ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏపీ టీడీపీ మహిళా నేతలు ఢిల్లీలో భేటీ అయ్యారు. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ కోసం వీరు ఢిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో టీడీపీ మహిళా నేతల సమావేశం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏపీ టీడీపీ మహిళా నేతలు కలిశారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్న సంగతి తెలిసిందే. అటు ఢిల్లీలోనే ఉన్న‌ ఏపీ టీడీపీ మహిళా నేతలు, ఈ విషయం తెలుసుకొని సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక ఈ ఫోటోలను ఏపీ మాజీ మంత్రి పరిటాల సునీత తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇందులో తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు.

రేవంత్ రెడ్డితో టీడీపీ నేతల సాన్నిహిత్యం వెనుక అసలు కారణం

అయితే, సీఎం రేవంత్ రెడ్డిని టీడీపీ మ‌హిళా నేత‌లు క‌ల‌వ‌డం హాట్ టాపిక్ అయింది. గ‌తంలో టీడీపీ పార్టీలో రేవంత్ రెడ్డి ప‌ని చేశారు. చంద్ర‌బాబు నాయుడుకు న‌మ్మిన బంటుగా ఉండేవారు. అటు ఏపీలోని టీడీపీ నేత‌ల‌తో కూడా సీఎం రేవంత్ కు ప‌రిచ‌యాలు ఉన్నాయి. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ ఉన్న‌ప్ప‌టికీ, సీఎం రేవంత్ రెడ్డితో సాఫ్ట్ కార్న‌ర్‌ కొన‌సాగిస్తున్నారు ఏపీ నేత‌లు. కాగా పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ల బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు ఢిల్లీకి ఏపీ టీడీపీ మహిళలు వెళ్లారు.

మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చకు ఢిల్లీకి టీడీపీ మహిళా నేతలు

ఈరోజు ఢిల్లీలో నా సహచర ఎమ్మెల్యేలు, టిడిపి ఎంపీలతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారిని ఢిల్లీ లో మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా… pic.twitter.com/pSPZPenZ6v

మొత్తానికి ఏపీ టీడీపీ మహిళా నేతలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ భేటీ వెనుక ఆంతర్యం ఏమిటో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.