|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మూడో రోజు తగ్గిన తేజ సజ్జా ‘మిరాయ్’ కలెక్షన్స్ – హిట్ కొట్టడానికి ఎన్ని కోట్లు రావాలంటే?

Published: 16-09-2025, 10:59 AM
మూడో రోజు తగ్గిన తేజ సజ్జా 'మిరాయ్' కలెక్షన్స్ - హిట్ కొట్టడానికి ఎన్ని కోట్లు రావాలంటే?

తేజ సజ్జా నటించిన ‘మిరాయ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. మూడు రోజుల కలెక్షన్స్ వివరాలు, హిట్ అవడానికి అవసరమైన మొత్తం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

Key Points

1

మిరాయ్ మూడో రోజు కలెక్షన్స్ 8.33% తగ్గాయి.

2

మూడు రోజుల్లో ఇండియా వైడ్ రూ. 57.50 కోట్ల నెట్ కలెక్షన్స్.

4

బ్రేక్ ఈవెన్ టార్గెట్ చేరుకోవడానికి ఇంకా రూ. 6-7 కోట్లు రావాలి.

మిరాయ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ విశ్లేషణ

మిరాయ్ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్: తేజ సజ్జా సినిమా మరోసారి బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోంది. హనుమాన్ విజయం తరువాత ఈ యంగ్ హీరో నటించిన మరో సూపర్ హీరో మూవీ మిరాయ్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.

మిరాయ్ సినిమా ఇండియాలో మూడో రోజు రూ. 16.25 నెట్ కలెక్షన్స్ రాబట్టినట్లు సక్నిల్క్ సంస్థ తెలిపింది. ఈ నెట్ కలెక్షన్లలో హిందీ బెల్ట్ నుంచి రూ. 3.4 కోట్లు, తెలుగు ద్వారా రూ. 12.5 కోట్లు, తమిళనాడులో రూ. 2 లక్షలు, కన్నడలో లక్ష రూపాయలు, మలయాళంలో ఐదు లక్షల వసూల్లు వచ్చినట్లు సమాచారం.

అయితే, రెండో రోజుతో పోలిస్తే మూడో రోజు మిరాయ్ కలెక్షన్స్ 8.33 శాతం తగ్గాయి. ఇక మూడు రోజుల్లో ఇండియా వైడ్‌గా మిరాయ్ సినిమాకు రూ. 57.50 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు అయినట్లు హిందూస్థాన్ టైమ్స్ ఇంగ్లీష్ పేర్కొంది. ఇదిలా ఉంటే, వరల్డ్ వైడ్‌గా కూడా మిరాయ్ అదరగొడుతోంది.

మూడో రోజు కలెక్షన్లలో తగ్గుదల

రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా మిరాయ్ సినిమాకు రూ. 26.72 కోట్ల షేర్ కలెక్షన్స్ రాగా రూ. 49 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. అంటే, ఈ లెక్కన మూడు రోజుల్లో రూ 50 నుంచి 60 కోట్ల గ్రాస్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇకపోతే మిరాయ్ సినిమాకు ఓవరాల్‌గా రూ. 36 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ఫిక్స్ అయింది.

దాంతో మిరాయ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 37 కోట్లు అయింది. అంటే, రూ. 37 కోట్లు వస్తే మిరాయ్ సినిమా హిట్‌గా పరిగణించవచ్చు. అలాగే, అంతకంటే ఎక్కువ వస్తే మిరాయ్‌ సినిమా లాభాల్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఈ బ్రేక్ ఈవెన్ టార్గెట్ చేరుకోవాలంటే మిరాయ్ సినిమాకు ఇంకా రూ. 6 నుంచి 7 కోట్ల షేర్ కలెక్షన్స్ రావాలని సమాచారం.

హిట్ అవడానికి ఎంత మొత్తం అవసరం?

మిరాయ్ సినిమాకు మొదటి రెండు రోజుల్లో ఉత్తర అమెరికాలో 1.6 మిలియన్ డాలర్లు (15 కోట్లు) రాబట్టింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సోషల్ మీడియాలో పంచుకుంది. ఇలా కలెక్షన్లతో సత్తా చాటుతున్న మిరాయ్ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు.

ఇక మిరాయ్ సినిమాలో తేజ సజ్జా హీరోగా చేస్తే మంచు మనోజ్ విలన్‌గా ఆకట్టుకున్నాడు. రితికా నాయక్ హీరోయిన్‌గా చేసింది. బ్యూటిఫుల్ శ్రియా సరన్ కీలక పాత్ర పోషించింది. సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదలైన మిరాయ్ మంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది.

మొత్తంమీద, మిరాయ్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ప్రతిస్పందనను పొందుతోంది. ఇంకా కొన్ని కోట్లు రావడం ద్వారా సినిమా హిట్‌గా నిలిచే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.