
తెలుగు సినిమా నటుడు తేజ సజ్జా తన తాజా చిత్రం ‘మిరాయ్’ ప్రమోషన్లలో భాగంగా ఒక రిపోర్టర్ ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. పదేపదే ధర్మం గురించి సినిమాలు చేస్తున్నారని ప్రశ్నించగా ఆయన ఇచ్చిన సమాధానం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Key Points
తేజ సజ్జా 'మిరాయ్' సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు.
రిపోర్టర్ ప్రశ్నకు తేజ సజ్జా సమాధానం అందరినీ మెప్పించింది.
'మిరాయ్' సినిమా సెప్టెంబర్ 12న విడుదల కానుంది.
హనుమాన్ తర్వాత మరో సూపర్ హీరో సినిమాతో తేజ సజ్జా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
మిరాయ్ ప్రమోషన్స్ లో తేజ సజ్జా కామెంట్స్
మిరాయ్ (Mirai) మూవీతో తేజ సజ్జా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సెప్టెంబర్ 12న థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీ ప్రమోషన్లలో అతనికి ఒకే ప్రశ్న పదేపదే ఎదురవుతోంది. తమిళ ప్రమోషన్లలోలాగే దీనిపై తాజాగా జరిగిన మరో ప్రెస్ మీట్ లోనూ ఓ రిపోర్టర్ పదే పదే రిలీజియస్ మూవీస్ ఎందుకు అని అడగ్గా.. దానికి తేజ ఇచ్చిన సమాధానం అందరినీ మెప్పిస్తోంది.
మిరాయ్ మూవీ ప్రమోషన్లలో భాగంగా తేజ సజ్జా తోపాటు మూవీ టీమ్ దేశమంతా తిరుగుతోంది. ఈ మధ్యే తమిళ ప్రమోషన్ల కోసం చెన్నై వెళ్లారు. ఇప్పుడు హిందీ ప్రమోషన్లు చేస్తున్నారు. అక్కడికి వెళ్లిన తేజకు ఓ రిపోర్టర్ ప్రతి సినిమాలో ధర్మం గురించి ఎందుకు చెబుతున్నారని ప్రశ్నించారు. గతంలో హనమాన్ మూవీలోనూ అతడు నటించిన విషయం తెలిసిందే.
రిపోర్టర్ ప్రశ్నకు తేజ సజ్జా సమాధానం
దీనికి తేజ కూల్ గా సమాధానం ఇచ్చాడు. “ఇదే ప్రశ్న ఎందుకు అడుగుతున్నారో అర్థం కావడం లేదు. పదే పదే లవ్ స్టోరీలు చేస్తే ఎవరూ ఎందుకు అడగారు. మేము మన ధర్మం గురించి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అందుకు గర్వించాలి. ఇది మన భూమి, ఇవి మన మోరల్స్. మీరు ఈ 3 నిమిషాల 10 సెకన్ల ట్రైలర్ చూశారు. అందులో కొన్ని సెకన్ల పాటు రాముడిని చూసి ఇది మతం అది అంటూ అడుగుతున్నారు.
ఈ సినిమాలో ఫ్యాంటసీ ఉంది. యాక్షన్ ఉంది. అడ్వెంచర్ ఉంది. హనుమాన్ కూడా అంతే. అందులో ఓ వేరే ఎమోషన్ ఉంటుంది. ఇతిహాసంలోని నీతిని మేము ఏదో ఒక విధంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ జనరేషన్ కు మన చరిత్రను కూల్ గా చెప్పే ప్రయత్నం ఇది. దీనిని చూసి మీరు సంతోషించాలి” అని తేజ సజ్జా అనడంతో అందరూ చప్పట్లతో స్వాగతించారు.
మిరాయ్ సినిమా విడుదల తేదీ
హనుమాన్ మూవీ తర్వాత తేజ సజ్జా మరోసారి సూపర్ హీరో మూవీ మిరాయ్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాను కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా సెప్టెంబర్ 12న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా 2 గంటల 49 నిమిషాల సుదీర్ఘ నిడివితో రాబోతోంది.
దీనికి సెన్సార్ వాళ్లు యూ/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ మూవీలో మంచు మనోజ్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. వీళ్లే కాకుండా శ్రియ శరణ్, జగపతి బాబు, రితికా నాయక్ లాంటి వాళ్లు కూడా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో మూవీ రానుండగా గౌర హరి మ్యూజిక్ అందించాడు.
తేజ సజ్జా సమాధానం సినిమాపై ఆసక్తిని పెంచింది. ధర్మం, నీతి విలువలను ప్రేక్షకులకు చూపించే ప్రయత్నంగా ఈ సినిమాను చూడాలని ఆయన అభిప్రాయపడ్డారు. ‘మిరాయ్’ సినిమా విజయవంతం కావాలని కోరుకుందాం.


