
📌 Key Points
- తేజస్వి మడివాడ బాల్యం షాకింగ్ నిజాలు, తల్లి మరణం, తండ్రి తాగుడుపై సంచలన వ్యాఖ్యలు.
- 11 ఏళ్లకే కుటుంబ భారం, ఇంటి పనులు, స్వతంత్రంగా జీవించడం నేర్చుకున్నానని వెల్లడి.
- 18 ఏళ్లకే ఇల్లు వదిలి, ఇండస్ట్రీలో అవకాశాల కోసం పడిన కష్టాలు, స్నేహితుల అండ.
- బిగ్ బాస్, బాలీవుడ్ షోలతో ఫేమ్, గతం తలుచుకొని భావోద్వేగానికి లోనైన తేజస్వి.
టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తేజస్వి మడివాడ, తాజాగా తన వ్యక్తిగత జీవితంలోని అత్యంత బాధాకరమైన విషయాలను బయటపెట్టి అందరినీ షాక్ కు గురి చేసింది. ఆమె గుండెకోత కథ ఇప్పుడు వైరల్ గా మారింది.
అమ్మ మరణం.. నాన్న తాగుడు: గుండెలు పిండే నిజాలు!
Tejaswi Madivada : సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న తేజస్వి మడివాడ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా అనేక సినిమాల్లో నటించింది. ఇప్పుడు కూడా పలు సినిమాలు, టీవీ షోలు, వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీగా ఉంది తేజస్వి. బిగ్ బాస్ సీజన్ 2లో కూడా పాల్గొని మరింత ఫేమ్ తెచ్చుకుంది. ఇప్పుడు బాలీవుడ్ షోలలో కూడా పాల్గొంటూ మరింత వైరల్ అవుతుంది.
ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ ఉంటుంది తేజస్వి మడివాడ. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గతం గురించి చెప్తూ ఎమోషనల్ అయింది.
11 ఏళ్లకే జీవితం సీరియస్: తేజస్వి పోరాటం!
తేజస్వి మడివాడ మాట్లాడుతూ.. మా నాన్న సింగరేణిలో పనిచేసేవాళ్ళు. నాకు నాలుగేళ్లు ఉన్నప్పుడే మా నాన్నకు హైదరాబాద్ కి ట్రాన్స్ఫర్ అవ్వడంతో ఇక్కడికి వచ్చేసాం. నాకు ఏడేళ్ల వయసులో మా అమ్మకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. నాకు 11 ఏళ్ళు ఉన్నప్పుడు అమ్మ చనిపోయింది. అప్పటికే అమ్మ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటుంటే నేను ఇంట్లో పనులన్నీ చేసేదాన్ని. అమ్మ చనిపోయాక 11 ఏళ్లకే లైఫ్ సీరియస్ అయిపొయింది. అప్పట్నుంచే ఇండిపెండెంట్ గా ఉండటం నేర్చుకున్నా.
మా అమ్మ చనిపోయాక నాన్న ముందుకు అలవాటు పడ్డారు. బాగా తాగేవాళ్ళు. అప్పుడు మా నాన్నను చూడాలంటే కూడా భయమేసేది. 13 ఏళ్ళ అప్పుడు 18 ఏళ్ళు రాగానే ఇంట్లోంచి పారిపోవాలని డిసైడ్ అయ్యాను. నాన్న తాగి నేనే ఫుడ్ పెడుతున్న, నేనే చూసుకుంటున్న నిన్ను అని తిట్టేవాళ్ళు. వెయిట్ చేసి 18 ఏళ్ళు రాగానే నేను ఇంట్లోంచి వెళ్ళిపోయాను. నేనే సోలోగా బతుకుతున్నాను అని చెప్తూ ఎమోషనల్ అయింది. ఎప్పుడూ గలగలా మాట్లాడి అందర్నీ నవ్వించే తేజస్వి మనసులో ఇంత బాధ ఉందా అని ఆశ్చర్యపోతున్నారు.
బిగ్ బాస్ బ్యూటీ దాచిన కన్నీటి గాథ!
గతంలో కూడా ఓ టీవీ షోలో తన గతం చెప్పి ఇంట్లోంచి బయటకు వచ్చాక ఓ ఫ్రెండ్ ఫ్యామిలీ సపోర్ట్ తో జీవిస్తూ ఇండస్ట్రీలో ఛాన్సుల కోసం ప్రయత్నించిందని తెలిపింది.
తేజస్వి మడివాడ ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఈ సంఘటనలు మరింత పెంచాయని చెప్పాలి. ఆమె భవిష్యత్తు ప్రయాణం ఎలా ఉంటుందో వేచి చూద్దాం. మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం మా ఛానెల్ ను చూస్తూ ఉండండి!


