|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Tejaswini : మా పెళ్ళికి ఇంట్లో అస్సలు ఒప్పుకోలేదు.. ఆయనే ఒప్పించారు.. దిల్ రాజుతో పెళ్లి పై తేజస్విని..

Published: 28-06-2025, 6:16 AM
Tejaswini : మా పెళ్ళికి ఇంట్లో అస్సలు ఒప్పుకోలేదు.. ఆయనే ఒప్పించారు.. దిల్ రాజుతో పెళ్లి పై తేజస్విని..

దిల్ రాజు భార్య తేజస్విని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమ వివాహం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. వారి ప్రేమకథ, కుటుంబ సభ్యుల వ్యతిరేకత మరియు దిల్ రాజు చేసిన ప్రయత్నాల గురించి ఆమె వివరించారు.

Key Points

1

దిల్ రాజుతో తేజస్విని వివాహం గురించి ఆమె తన అనుభవాలను పంచుకుంది.

2

తమ పెళ్లికి ఇంట్లో ఎవరూ ఒప్పుకోలేదని, దిల్ రాజు వారిని ఒప్పించారని తెలిపారు.

4

తేజస్విని సినిమా పరిశ్రమకు అంత దగ్గరగా లేరని, దిల్ రాజును మొదట డైరెక్టర్ అనుకున్నారని చెప్పారు.

ఇంట్లో వ్యతిరేకత ఎదుర్కొన్న తేజస్విని

Tejaswini : దిల్ రాజు కొన్నేళ్ల క్రితం రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ కి చెందిన తేజస్విని వ్యాఘాని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. దిల్ రాజు భార్య తేజస్విని రెగ్యులర్ గా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. దిల్ రాజుతో పెళ్లి తర్వాత మొదటిసారి తేజస్విని ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది.

ఈ ఇంటర్వ్యూలో తమ పెళ్లి గురించి తెలిపింది. దిల్ రాజు – తేజస్విని ఒక ఫ్లైట్ లో కలిసి అనంతరం ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

ఫ్లైట్ లో ప్రేమకథ ప్రారంభం

తాజాగా తేజస్విని మాట్లాడుతూ.. అసలు మా ఫ్యామిలీకి సినిమాలకు కనెక్షన్ చాలా తక్కువ. సంవత్సరానికి ఒక సినిమాకి వెళ్ళేవాళ్ళం అంతే. దిల్ రాజు గారిని మొదట డైరెక్టర్ అనుకున్నాను. తర్వాత నిర్మాత అని తెలిసింది. ఫ్లైట్ లో పరిచయం, ప్రేమ తర్వాత దిల్ రాజు గారే మా ఇంట్లో ఎవర్ని అడగాలో చెప్పు అడిగి ఒప్పిస్తా అన్నారు. మా ఇంట్లో చాలా స్ట్రిక్ట్. మా పెద్దమామ, పిన్ని, చిన్నమామ చాలా స్ట్రిక్ట్. మా పిన్ని, మామ ఎవరూ ఒప్పుకోలేదు పెళ్ళికి. అసలు వద్దన్నారు. అందులోను రెండో పెళ్లి అనేసరికి అస్సలు వద్దన్నారు. కానీ అందర్నీ ఒప్పించి చేసుకున్నాం అని తెలిపారు.

దిల్ రాజు ఒప్పించిన విధానం

తమ కుటుంబాలను ఒప్పించి వివాహం చేసుకున్న తేజస్విని, దిల్ రాజుల ప్రేమకథ ఒక ఆసక్తికరమైన అనుభవం. వారి జీవితంలోని ఈ కొత్త అధ్యాయానికి శుభాకాంక్షలు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.