|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తల్లిదండ్రులను వదిలిస్తే ఇక జీతం కట్! తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం!

Published: 29-03-2026, 8:30 AM
తల్లిదండ్రులను వదిలిస్తే ఇక జీతం కట్! తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం!
  • తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగుల జీతంలో 15% కోత విధించే బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం.
  • కోత విధించిన సొమ్ము నేరుగా తల్లిదండ్రుల ఖాతాలో జమ చేస్తారు.
  • సహాయం కోసం తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ప్రత్యేక అధికారి 60 రోజుల్లో సమస్యను పరిష్కరించాలి; లేదంటే హైకోర్టు న్యాయమూర్తికి అప్పీల్ చేసుకోవచ్చు.

తెలంగాణ అసెంబ్లీ సంచలన నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రులను సరిగా చూసుకోని ఉద్యోగుల జీతాల్లో కోత విధించే బిల్లును ఆమోదించింది. ఈ బిల్లు ద్వారా వృద్ధుల సంక్షేమాన్ని పరిరక్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

బిల్లులోని ముఖ్యాంశాలు

తల్లిదండ్రుల సంరక్షణ ఉద్యోగుల బాధ్యత బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. వృద్ధులైన తల్లిదండ్రుల సంక్షేమాన్ని పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ‘తెలంగాణ ఉద్యోగుల జవాబుదారీతనం మరియు పర్యవేక్షణ బిల్లు-2026’ను ప్రవేశపెట్టింది. ఈ బిల్లుకు ఆమోదం లభించింది.

ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగాలలో ఉన్న పిల్లలు.. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యతను తీసుకునేలా చూడటమే ఈ బిల్లు లక్ష్యం. ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, రాష్ట్ర ఖజానా నుండి జీతాలు పొందుతున్న ఇతర సంస్థల ఉద్యోగులు తమ తల్లిదండ్రులను చూసుకోవడంలో విఫలమైతే, వారి జీతంలో 15 శాతం కోత విధిస్తారు. ఈ కోతను నేరుగా వారి తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలలో జమ చేస్తారు.

సహాయం కోరుకునే తల్లిదండ్రులు ఒక ప్రత్యేక అధికారికి, సాధారణంగా జిల్లా కలెక్టర్‌కు, అధికారిక దరఖాస్తును సమర్పించవచ్చు. కేసును సమీక్షించి, తగిన ఆర్థిక భత్యాన్ని నిర్ణయిస్తారు. ఈ కోత ఉద్యోగి జీతంలో 15 శాతం లేదా నెలకు రూ. 10,000, ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉంటుంది. దరఖాస్తు లను తల్లి, తండ్రి విడివిడిగా లేదా ఉమ్మడిగా సమర్పించవచ్చు. అధికారి 60 రోజులలోపు ఈ విషయాన్ని పరిష్కరించాల్సి ఉంటుంది.

జీతం కోత మరియు దరఖాస్తు ప్రక్రియ

ప్రత్యేక అధికారి చర్యలు తీసుకోవడంలో విఫలమైన సందర్భాలలో తల్లిదండ్రులు పదవీ విరమణ చేసిన హైకోర్టు న్యాయమూర్తికి అప్పీల్ చేసుకోవచ్చు. జవాబుదారీతనం, నిబంధనల పాటించడాన్ని నిర్ధారించడానికి ఆ న్యాయమూర్తి రాష్ట్రస్థాయిలో కమిషనర్‌గా వ్యవహరిస్తారు. ఈ చట్టం పరిధిలోకి ఉద్యోగులు, ప్రజాప్రతినిధులను తీసుకొనివస్తూ.. ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేశారు.

ఈ బిల్లు పై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. పిల్లల కోసం తల్లిదండ్రులు తమ శక్తిని మెుత్తం.. ధారపోస్తారని అన్నారు. పిల్లలు మాత్రం రెక్కలు వచ్చిన తర్వాత.. తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదని చెప్పారు. వృద్ధ తల్లిదండ్రులకు అండగా నిలవడానికి ఈ చట్టం తెచ్చామని చెప్పారు.

రేవంత్ రెడ్డి ప్రకటన

వృద్ధుల కోసం కేంద్రం 2007లో ఒక చట్టం తెచ్చిందని రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర చట్టం ప్రకారం.. తల్లిదండ్రులకు రూ.10 వేలకు మించి ఇచ్చే అవకాశం లేదన్నారు. సమాజం తలదించుకునేలా.. కొందరు పిల్లలు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు సీఎం. ఆత్మీయతకు సంబంధించి.. అంశం మీద చట్టం తేవడం చాలా బాధకరమని చెప్పారు. తల్లిదండ్రుల యోగక్షేమాలు చూడని వ్యక్తులను సామాజికంగా బహిష్కరించాలన్నారు. తల్లిదండ్రులను చూసుకోలేనివాడు.. సమాజంలో బతికేందుకు వీల్లేదని పేర్కొన్నారు. తాము తెచ్చిన చట్టం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే కాదని, ప్రజా ప్రతినిధులకూ సైతం వర్తిస్తుందని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.

హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More

తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వృద్ధుల సంక్షేమానికి ఒక ముందడుగు. తల్లిదండ్రులను ఆదుకోవడంలో పిల్లల బాధ్యతను గుర్తుచేస్తూ, సమాజంలో మార్పు తీసుకురావడానికి ఈ చట్టం తోడ్పడుతుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.