
📌 Key Points
- తెలంగాణ ప్రభుత్వం పన్ను ఎగవేతలను అరికట్టేందుకు కొత్త పోర్టల్ అభివృద్ధి చేస్తుంది.
- రెవెన్యూశాఖ విభాగాల కార్యదర్శులతో అధ్యయన కమిటీని నియమించింది.
- ఆదాయం తెచ్చే శాఖల డేటా మార్పిడి, పర్యవేక్షణ కోసం రేవన్ పోర్టల్ రూపుదిద్దుకుంటోంది.
- స్థానిక సంస్థల వినోదపు పన్ను వసూలుపై నిఘా పెట్టేందుకు కొత్త చట్టం రానుంది.
తెలంగాణ ప్రభుత్వం పన్ను ఎగవేతదారులపై కొరడా ఝుళిపించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా రేవన్ అనే కొత్త పోర్టల్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ పోర్టల్ ద్వారా శాఖల మధ్య డేటా మార్పిడిని పర్యవేక్షించనున్నారు. దీనికి సంబంధించిన అధ్యయన కమిటీని కూడా నియమించింది.
రేవన్ పోర్టల్ ఆవశ్యకత ఏమిటి?
పన్ను ఎగవేతదారులపై తెలంగాణ సర్కార్ దృష్టిపెట్టింది. ఇకపై పన్ను ఎగవేతదారులను ఉపక్షించేది లేదని చెబుతోంది. ఇందులో భాగంగా కొత్త పోర్టల్‌ను అభివృద్ధి చేయడానికి సిద్ధమవుతోంది. సీఎస్ నేతృత్వంలోని రెవెన్యూశాఖ విభాగాల కార్యదర్శులతో అధ్యయన కమిటీని నియమించింది.
అధ్యయన కమిటీ విధివిధానాలు
ఆదాయం తెచ్చే శాఖలు అన్నింటినీ కలిపి.. రేవన్(RevOne) పోర్టల్‌ను అభివృద్ధి చేయడానికి సిద్ధం అవుతోంది. శాఖల మధ్య డేటా మార్పిడి, పర్యవేక్షణకు పోర్టల్‌ను రూపొందిస్తారు. స్థానిక సంస్థల వినోదపు పన్ను వసూలు, యూపీఐ, పీవోఎస్ లావాదేవీలపై నిఘా పెట్టేలా కొత్త చట్టం ఏర్పాటులాంటి అంశాలపై ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. ఈ కమిటీ అధ్యయనం చేసి రిపోర్టును సమగ్రంగా పొందుపరచనుంది. 30 రోజుల్లో ప్రాథమిక, 60 రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.
పన్ను ఎగవేతపై తెలంగాణ సర్కార్ సీరియస్
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.
హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More
రేవన్ పోర్టల్ ద్వారా పన్ను వసూళ్లలో మరింత పారదర్శకత వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. పన్ను ఎగవేతదారులకు ఇది ఒక హెచ్చరికలాంటిదేనని చెప్పవచ్చు.


