|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తెలంగాణలో సంచలనం: రైతుల కోసం 30 వేల మంది వాలంటీర్లు! అసలు ఈ వ్యవస్థ ఏం చేస్తుంది?

Published: 08-04-2026, 3:05 AM
తెలంగాణలో సంచలనం: రైతుల కోసం 30 వేల మంది వాలంటీర్లు! అసలు ఈ వ్యవస్థ ఏం చేస్తుంది?
  • తెలంగాణ ప్రభుత్వం రైతులకు మద్దతుగా 30 వేల మంది వాలంటీర్లతో సరికొత్త వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది.
  • ఈ వాలంటీర్లు భూసార పరీక్షలు, ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పిస్తారు.
  • ప్రతి గ్రామానికి ముగ్గురు వాలంటీర్లను నియమిస్తారు, వీరికి ఇక్రిశాట్ శిక్షణ ఇస్తుంది.
  • కొడంగల్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్ కింద 120 మంది వాలంటీర్లకు శిక్షణ ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో రైతులకు సహాయం చేయడానికి ఒక కొత్త ప్రయత్నం చేస్తోంది. 30 వేల మంది వాలంటీర్లతో ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి, భూసారం మరియు ఎరువుల వినియోగం గురించి రైతులకు అవగాహన కల్పించనున్నారు.

రైతులకు అండగా తెలంగాణ సర్కార్ సరికొత్త యోచన

వ్యవసాయంలో రైతులకు మద్దతుగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం సరికొత్త వ్యవస్థను తీసుకురానుంది. ప్రధానంగా భూసార పరీక్షలు, ఎరువుల వినియోగంపై అవగాహన కల్పించటమే లక్ష్యంగా వాలంటీర్ల వ్యవస్థను తీసుకురానుంది. ఇందుకోసం 30 వేల మందిని ఎంపిక చేసి శిక్షణ ఇస్తుంది.

రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం….. రైతులకు ఉపయోగపడేలా సాయిల్ హెల్త్ వాలంటీర్లను తీసుకురానున్నారు. ప్రతి గ్రామానికి ముగ్గురిని నియమిస్తారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 30 వేల మంది సేవలు అందిస్తారు. విడతల వారీగా వీరిని ఎంపిక చేసి శిక్షణ ఇస్తారు.

భూసార పరీక్షలపై అవగాహన కల్పించనున్న వాలంటీర్లు

తాజాగా ఇక్రిశాట్ లో తొలి విడతగా వాలంటీర్లకు శిక్షణ(సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్) ఇచ్చే కార్యక్రమాన్ని తుమ్మల ప్రారంభించారు. ఇక్రిశాట్, తెలంగాణ వ్యవసాయ శాఖ ఈ వాలంటీర్లను నియమించనుంది. పైలెట్ ప్రాజెక్ట్ కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎంపికైన 120 మంది వాలంటీర్లకు శిక్షణ అందించారు. భూసారం ఎలా కాపాడాలి….? పంటకు అనుకూలంగా భూమిని ఎలా మార్చుకోవాలి..? సేంద్రియ వ్యవసాయాన్ని పెంపొదించేందుకు ఎలాంటి పద్ధతులను పాటించాలి..? వంటి అంశాలపై సలహాలు, సూచనలు ఇచ్చారు.

గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో రసాయన ఎరువుల కొరత ఉంటోంది. ముఖ్యంగా యూరియా కోసం బారులు తీరుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం యూరియా వాడకాన్ని తగ్గించాలని సూచిస్తున్నాయి. రసాయన ఎరువులను తగ్గించి… సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలని ప్రకటనలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది.

ఇక్రిశాట్ ఆధ్వర్యంలో వాలంటీర్లకు శిక్షణ ప్రారంభం

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More

తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం తీసుకువచ్చిన ఈ వినూత్న వాలంటీర్ల వ్యవస్థ ద్వారా వ్యవసాయ రంగంలో సమూల మార్పులు వస్తాయని ఆశిస్తున్నారు. ఇది రైతులకు ఎంతవరకు ఉపయోగపడుతుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.