
మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మూసీ రివర్‌బెడ్‌లో నివసించే వారికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. ఇది పేదల గృహ నిర్మాణ ఆశలకు కొత్త ఊపిరి పోసింది.
Key Points
మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు మొదటి దశపై సీఎం సమీక్ష.
రివర్‌బెడ్‌లో ఉన్న వారికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయించాలని ఆదేశం.
భూసేకరణకు టీడీఆర్ లేదా పరిహారం చెల్లించాలని సీఎం సూచన.
నెక్లెస్‌రోడ్డులో మూసీ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ఏర్పాటుకు ఆదేశం.
మూసీ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు మొదటి దశ ప్రాజెక్టు పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. మూసీ రివర్‌బెడ్‌లో ఉన్న వారికి డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు కేటాయించాలని సమావేశంలో ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించారు.
ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో జరిగిన ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో మూసీ మొదటి దశ ప్రాజెక్ట్ పైన అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రాజెక్టులో భాగంగా అవసరమైన చోట భూ సేకరణ కోసం ఆసక్తి ఉన్న వాళ్లకు టీడీఆర్ ఇవ్వాలి లేదా పరిహారం చెల్లించాలని చెప్పారు.
రివర్‌బెడ్‌లో నివాసితులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు
గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం తీసుకుంటున్న రక్షణ శాఖ భూముల్లో ఉన్న నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వమే తరలించాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే నెక్లెస్ రోడ్డులో ప్రజల సందర్శనార్థం మూసీ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. మూసీ ప్రాజెక్టులో భాగంగా చేపట్టబోయే పనులను ఆ ఎక్స్‌పీరిన్స్ సెంటర్‌లో ప్రతిబింబించాలని చెప్పారు. ప్రాజెక్టుపైన ఈ సందర్భంగా ప్రజల అభిప్రాయాలను కూడా సేకరించాలని సూచించారు.
‘ మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు లక్ష్యాలు, చేపట్టబోయే అభివృద్ధి పనులు, భవిష్యత్‌లో రూపురేఖలను ప్రజలకు వివరించేలా నెక్లెస్‌రోడ్డులో మూసీ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేయాలి. అక్కడ మూసీ ప్రాజెక్టుపై ప్రజల అభిప్రాయాల్ని తీసుకోవాలి.’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ప్రజల అభిప్రాయాల కోసం మూసీ ఎక్స్‌పీరియన్స్ సెంటర్
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.
మూసీ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ రూపురేఖలు మారనున్నాయి. ప్రజల భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును విజయవంతం చేయాలని సీఎం ఆకాంక్షించారు. ఇది నగర అభివృద్ధికి, పేదల సంక్షేమానికి ప్రభుత్వ నిబద్ధతను చాటుతుంది.


