|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఉస్తాద్ భగత్ సింగ్: ప్రీమియర్ షోల రచ్చ! నైజాంలో పవన్ కళ్యాణ్ సినిమాకు షాక్ తప్పదా?

Published: 09-03-2026, 2:35 AM
ఉస్తాద్ భగత్ సింగ్: ప్రీమియర్ షోల రచ్చ! నైజాంలో పవన్ కళ్యాణ్ సినిమాకు షాక్ తప్పదా?
  • పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ ప్రీమియర్ షోలపై అభిమానుల్లో నెలకొన్న సందిగ్ధత.
  • నైజాంలో టికెట్ ధరల పెంపుకు ప్రభుత్వానికి ఆర్థిక వివరాలు సమర్పించాల్సి ఉండటం.
  • ఏపీలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో సినిమాకు ఇబ్బంది ఉండకపోవచ్చు.
  • తెలంగాణలో సినిమా రేట్ల పెంపుపై హైకోర్టు సీరియస్ అవ్వడం, నిర్మాతల తప్పుడు లెక్కలు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ప్రీమియర్ షోల గురించి అభిమానుల్లో అయోమయం నెలకొంది. నైజాంలో ఈ సినిమా విడుదల పరిస్థితి ఏమిటనే దానిపై అనేక సందేహాలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం కీలకం కానుంది.

ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీమియర్ షోల గందరగోళం

Ustaad Bhagath Singh : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ.. గతంలో ఆయన నటించిన ఓజీ సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకుంది ప్రస్తుతం ఈ మూవీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉంది.. మరో పది రోజుల్లో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి భారీ స్థాయిలో నిర్మించారు.. పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ అభిమానుల్లో ఉత్కంఠ పెరుగుతోంది.. ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ జనాల్లో మంచి ఉత్కంఠను తీసుకొచ్చింది.. ఇక సినిమాపై ట్రైలర్ అంచనాలని పెంచేసిందని చెప్పాలి.. అయితే ఈ సినిమా ప్రీమియర్ షోస్ పై ఒక కన్ఫ్యూషన్ జనాల్లో మొదలైంది.. మరి ఆ కన్ఫ్యూజన్ ఏంటి? నైజాంలో ఈ సినిమా పరిస్థితి ఎలా ఉండబోతుంది అన్నది ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

ఈ మూవీ రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో సినిమాపై అంచనాలు పెరగడంతో పాటుగా కొన్ని టెన్షన్లు కూడా పెరుగుతున్నాయి.. ఫాన్సు సినిమా టికెట్లు రేట్లు ఎలా ఉంటాయి? అలాగే ప్రీమియర్ షోలో పరిస్థితి ఏంటి అని సోషల్ మీడియాలో డైరెక్టర్ హరీష్ శంకర్ ని ట్యాగ్ చేస్తూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.. సాధారణంగా పెద్ద స్టార్ సినిమాలకు విడుదలకు ముందు ప్రత్యేక ప్రీమియర్ షోలు వేయడం, టికెట్ ధరలు పెంచుకోవడం ఇటీవలి కాలంలో ట్రెండ్‌గా మారింది.. ఏపీలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉండడంతో అతని సినిమాపై ఎటువంటి డోకా లేదు అని తెలుస్తుంది. కానీ తెలంగాణలో పరిస్థితి భిన్నంగా ఉండబోతుందని ఇటీవల జరుగుతున్న వాటివల్ల అర్థం అవుతుంది.

నైజాంలో టికెట్ ధరల పెంపు సవాళ్లు

తెలంగాణలో సినిమా రేట్లు పెంచడానికి అనుమతి కోరాలంటే ఖచ్చితంగా సినిమా యొక్క ఆర్థిక వివరాలను చిత్ర యూనిట్ ప్రభుత్వానికి చూపించాలి.. సరైన వివరాలను సమర్పించకుండా కొందరు నిర్మాతలు తప్పుడు లెక్కలు చూపించారని ఇటీవల తెలంగాణ హైకోర్టు సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితి నుంచి బయట పడాలంటే పవన్ కళ్యాణ్ సినిమా యూనిట్ సభ్యులు తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి..

తెలంగాణ ప్రభుత్వానికి ఆర్థిక వివరాలు సమర్పణ

పవన్ కళ్యాణ్ సినిమాలంటే జనాలు కాస్త అంచనాలు ఎక్కువగానే ఉంటాయి. గతంలో వచ్చిన ఓజి మూవీ జనాలను ఎంత బాగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇప్పుడు రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలకు ముందు ప్రీమియర్ షోలు, టికెట్ ధరల అంశం చర్చనీయాంశంగా మారింది.. ఈ మూవీ ప్రీమియర్ షోలపై హైకోర్టు కొత్త నిబంధనలు తీసుకురావడంతో ప్రస్తుతం ప్రీమియర్ షోలపై కొంత అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక సినిమా విడుదలకు ముందే 90 రోజులు ముందు ఆర్థిక వివరాలను సమర్పించి అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ నైజంలో ప్రీమియర్ షోలు పడతాయా లేదా అన్న సందేహం కూడా మొదలైంది. తెలంగాణలో ప్రీమియర్ షోల పరిస్థితి ఎలా ఉందో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే..

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విడుదల దగ్గర పడుతున్న కొద్దీ ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల విషయంలో ఎలా స్పందిస్తుందో చూడాలి. అభిమానుల ఆశలు నెరవేరుతాయో లేదో వేచి చూడాల్సిందే.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.