|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కార్తీక దీపం 2: పారిజాతం పతనం! దీపకు రాజయోగం! జ్యోత్స్న పగతో రగిలిపోతుందా?

Published: 08-07-2026, 7:58 AM
కార్తీక దీపం 2: పారిజాతం పతనం! దీపకు రాజయోగం! జ్యోత్స్న పగతో రగిలిపోతుందా?

కార్తీక దీపం 2 సీరియల్ నుండి ఊహించని ట్విస్ట్‌తో కూడిన బ్రేకింగ్ న్యూస్! ఈరోజు ఎపిసోడ్ అభిమానులను ఉర్రూతలూగించనుంది. పారిజాతం పతనం, దీపకు రాజయోగం.. అసలు ఏం జరుగుతోంది? పూర్తి వివరాలు ఇక్కడ చూడండి!

Key Points

1

శివ నారాయణ ఆదేశాలతో పారిజాతం పేదరాణిగా మార్పు, గదికి సీల్.

2

కార్తీక్ పర్యవేక్షణలో పారిజాతం శిక్ష అమలు, ఆమె శపథం వైరల్.

4

జ్యోత్స్నపై సుమిత్ర అనుమానం, దీపకు కుట్రలు తప్పవా అని ఉత్కంఠ.

పారిజాతానికి శివ నారాయణ షాక్! గదికి సీల్!

Karthika Deepam 2 Serial June 27th Episode: కార్తీక దీపం 2 సీరియల్ జూన్ 27వ ఎపిసోడ్‌లో శివ నారాయణ శిక్ష విధించడంతో పారిజాతం పనిమనిషిలా మారిపోతుంది. జ్యోత్స్న ఏదైనా తప్పు చేస్తే అస్సలు క్షమించకండని, కన్నతండ్రిని వద్దనుకున్నదాన్ని కూతురుని వదులుకోలేనా అని సుమిత్ర అంటుంది. ఆ మాటలు జ్యో వింటుంది.

Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో పారుకు నెలరోజుల పాటు దీక్ష శిక్ష వేస్తాడు శివ నారాయణ . ఆ బాధ్యతలు కార్తీక్‌కు అప్పగించి ఈ క్షణమే అమలు జరుగుతుందంటాడు. కట్ చేస్తే పారిజాతం పని మనిషిలా వస్తుంది.

పారు మీద నాకు నమ్మకం లేదు. సీక్రెట్‌గా ఏసీలా పడుకుని చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకుని తింటుందేమో అని కార్తీక్ అంటాడు. దాంతో పారిజాతం గదికి శివ నారాయణ సీల్ వేస్తాడు. ఇంట్లో ఎక్కడైనా పడుకోవచ్చని చెబుతాడు. మీరు దేవుడు సర్ అని కార్తీక్ అంటాడు. ఈ పారిజాతం శపథం విను. మళ్లీ మీ తాత చేతులతో ఆ గది సీల్ తీసేవరకు నేను ఈ కురులు ముడివేయను అని పారిజాతం శపథం చేస్తుంది.

నిన్ను ఈ గెటప్‌లో చూడాలా. జుట్టు విరబూసుకుని తిరిగితే నీకేదో గాలి సోకిందని బూత వైద్యుడిని పిలిపిస్తారని పారిజాతం అంటుంది. అయితే, ఈ శిక్ష మాకు అని కార్తీక్ అంటాడు. మరోవైపు నువ్వు ఎప్పుడైతే దీప మెడలో తాళి కట్టావో అప్పటి నుంచి దీపపై పగ పెంచుకుంది జ్యోత్స్న. ఆ పగతో దీప ఎన్నో కుట్రలు చేసింది. అలాంటిది ఇప్పుడు దీపను సీఈఓగా ఉండనిస్తుందా అని కాంచన అంటుంది.

దీపకు రాజయోగం – CEOగా ఎంట్రీ!

జ్యోత్స్న రెస్టారెంట్‌కు అందరు మనింటి నుంచే సీఈఓలు అవుతున్నారు. ముందు నువ్వు తర్వాత మీ నాన్న, ఇప్పుడు నీ భార్య అని కాంచన అంటుంటే.. తర్వాత నేను అని శౌర్య అంటుంది. పెద్దయ్యాక అవుతాను అంటుంది. అమ్మ ఇప్పుడు సీఈఓగా చీర కట్టుకుని వెళ్తుందా.. సూట్ వేసుకుంటుందా అని శౌర్య అంటే.. చీర అని దీప చెబుతుంది.

జ్యోత్స్న గురించి తెలిస్తే మా వదిన అస్సలు ఊరుకోదు అని కాంచన అంటుంది. మరోవైపు శివ నారాయణ, దశరథతో సుమిత్ర మాట్లాడుతుంది. నా కూతురు ఏమైనా చేసిందా. గెలిచినందుకు దీప సంతోషంగా ఉంది. కానీ, జ్యోత్స్న మాత్రం దీప గెలిచినందుకే ఎక్కువ బాధగా ఉందనిపించింది. అలాగే, మీరు అత్తయ్య విషయంలో కోపంగా ఉన్నారు. శిక్ష విధించారు. అందులో నా కూతురు కూడా ఉందా. ఉంటే అస్సలు క్షమించకండి మావయ్య గారు అని సుమిత్ర అంటుంది.

ఏం చేస్తావని దశరథ్ అడిగితే.. నన్ను కన్నవాళ్లనే వద్దనుకున్నాదాన్ని కన్నదాన్ని వద్దనుకోలేనా అని సుమిత్ర షాక్ ఇస్తుంది. అంటే నేను తప్పు చేశానని తెలిస్తే వీళ్లు నన్ను ఇంట్లో ఉండనివ్వరు అని జ్యోత్స్న వెళ్లిపోతుంది. జ్యోత్స్న నీ కూతురు కాదని నేనే చెబుతాను అని దశరథ్ మనసులో అనుకుంటాడు. మరోవైపు తన గదికి వెళ్లిన జ్యోత్స్నకు జుట్టు విరబోసుకుని చీకట్లో దెయ్యంలా కనిపిస్తుంది పారిజాతం.

జ్యోత్స్న పగతో రగిలిపోతుందా? తదుపరి కుట్ర ఏంటి?

అది చూసి షాక్ అవుతుంది జ్యో. లైట్ వేసి చూసి భయం ఆపుకుని నా రూమ్‌లోకి వచ్చావేంటని అడుగుతుంది జ్యోత్స్న. ఈ శిక్షకు పూర్తిగా అర్హురాలివి అని జ్యోత్స్న అంటుంది. నువ్వు నాకు మనవరాలిగా పుట్టకుండా ఉండాల్సిందే. నేను నిన్న మహారాణి చేద్దామని చూస్తే నువ్వు నన్ను ఇదిగో పేదరాణివి చేశావు అని పారు అంటుంది.

నాకు వచ్చిన పరిస్థితే ఆ సూరజ్ గాడికి వచ్చేలా చేస్తా. ఏ క్యారెక్టర్ చూసి మీ తాత గొప్పగా ఫీల్ అవుతున్నాడో ఆ క్యారెక్టర్‌నే లేకుండా చేస్తాను అని పారు అంటే.. ఏం చేసిన నన్ను ఇరికించకు అని దండం పెడుతుంది జ్యో. ఈ పారు జుట్టు ముడేసిందంటే ఎవరికో మూడినట్లే. కాసేపట్లో అందరిని అరిపిస్తా. సూరజ్ గాడిని తరిమేయడానికి నా దగ్గర ఒక బ్రహ్మాస్త్రం ఉందని జుట్టు ముడేసి శపథం చేస్తుంది.

నువ్వు ఇక్కడే ఉండు. కాసేపట్లో ఇంటి వాకిట్లో సూరజ్ గాడి పరువు తీసి శివ నారాయణ చేత గేట్ బయటకు గెంటించే బాధ్యత నాది అని వెళ్తుంది పారిజాతం. సూరజ్‌ను తరిమేయడానికి గ్రానీ ఏం చేయబోతుందని జ్యోత్స్న అనుకుంటుంది. మరోవైపు దీప ఉదయమే వెళ్లాలని రాత్రే స్వీట్స్ చేస్తుంది. అత్తకు ఇస్తుంది. బాగుందని కాంచన అంటుంది.

కార్తీక దీపం 2లో రాబోయే మలుపులు మరింత ఉత్కంఠగా మారనున్నాయి. దీప భవిష్యత్తు, జ్యోత్స్న కుట్రలు ఎలా ఉంటాయో చూడాలి. మరిన్ని సంచలన అప్‌డేట్‌ల కోసం చూస్తూనే ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.