|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Janhvi Kapoor : ‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ కి డూప్.. ఈ అందాల భామ ఎవరో తెలుసా?

Published: 18-11-2025, 6:41 AM
Janhvi Kapoor : ‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ కి డూప్.. ఈ అందాల భామ ఎవరో తెలుసా?

జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో రానున్న ‘పెద్ది’ సినిమాలో ఆమెకు డూప్‌గా నటిస్తున్న బాంధవి శ్రీధర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ‘మసూద’ ఫేమ్ బాంధవి, తన అందంతో, సోషల్ మీడియా పోస్టులతో అభిమానులను ఆకట్టుకుంటూ, ఈ సినిమాలో జాన్వీకి డూప్‌గా ఎలా ఎంపికైందో తెలుసుకోవడం ఆసక్తిగా మారింది.

Key Points

1

‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ డూప్‌గా నటిస్తున్న నటి బాంధవి శ్రీధర్.

2

‘మసూద’ సినిమాలో దయ్యం పట్టిన పాత్రలో నటించి అందర్నీ మెప్పించింది.

4

‘పెద్ది’లో కీలక పాత్రతో పాటు భవిష్యత్తులో హీరోయిన్‌గా అవకాశాలు.

‘పెద్ది’లో జాన్వీ కపూర్ డూప్ ఎవరు?

Janhvi Kapoor : పెద్ద సినిమాల్లో స్టార్స్ కి యాక్షన్స్ లో లేక వాళ్ళు అందుబాటులో లేనపుడు కొన్ని సజెషన్ షాట్ సీన్స్ లోనో డూప్స్ ని వాడుతూ ఉంటారు. తాజాగా పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ కి డూప్ గా ఓ అమ్మాయి చేస్తుందని తెలియడంతో ఆ భామ వైరల్ గా మారింది. బాలీవుడ్ భామ, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ దేవర తో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వగా ఇప్పుడు చరణ్ తో పెద్ది సినిమాలో కనిపించబోతుంది.(Janhvi Kapoor)

ఇటీవలే పెద్ది సినిమా నుంచి జాన్వీ కపూర్ పోస్టర్స్, చికిరి చికిరి అనే సాంగ్ కూడా రిలీజ్ చేసారు. అయితే పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ కి డూప్ గా నటి బాంధవి శ్రీధర్ నటిస్తుందట. మసూద సినిమాలో సంగీత కూతురిగా దయ్యం పట్టిన పాత్రలో అందర్నీ మెప్పించింది బాంధవి శ్రీధర్. ఆ తర్వాత సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోజులతో ఫొటోలు పోస్ట్ చేస్తూ వైరల్ అవుతుంది.

బాంధవి శ్రీధర్ గత సినిమాలు, సోషల్ మీడియా క్రేజ్

బాంధవి శ్రీధర్ ఇపుడు పెద్ది సినిమాలో జాన్వీకి డూప్ గా నటిస్తుందట. జాన్వీ ఫిజిక్ కి దగ్గరగా ఉండటంతో మేకర్స్ బాంధవిని తీసుకున్నారట. ఇప్పటికే ఆమెపై కొన్ని సీన్స్ కూడా చిత్రీకరించారని సమాచారం. అలాగే బాంధవి శ్రీధర్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కూడా నటిస్తుందట. హీరోయిన్ లెవల్లో ఉండే ఈ భామ తన సోషల్ మీడియా ఫొటోలతోనే వైరల్ అవుతుంది. మరి పెద్దిలో కీలక పాత్ర, జాన్వీ కపూర్ కి డూప్ గా చేసే ఈ భామ భవిష్యత్తులో హీరోయిన్ గా సినిమాలు చేస్తుందేమో చూడాలి.

కీలక పాత్రతో పాటు హీరోయిన్ గా అవకాశం?

ఇక బాంధవి శ్రీధర్ చికిరి చికిరి సాంగ్ డ్యాన్స్ మాస్టర్ జానీతో కలిసి ఆ పాటకు స్టెప్పులేసి క్యూట్ వీడియో కూడా తన సోషల్ మీడియాలో ఇటీవలే షేర్ చేసింది.

బాంధవి శ్రీధర్ ‘పెద్ది’ సినిమాలో జాన్వీకి డూప్‌గా, ఒక కీలక పాత్రలో కనిపించబోతోంది. ఆమె సోషల్ మీడియాలో ఇప్పటికే స్టార్‌గా గుర్తింపు పొందింది. ఈ సినిమాతో ఆమె భవిష్యత్తులో హీరోయిన్‌గా అవకాశాలు అందుకుంటుందేమో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.