
📌 Key Points
- తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం బీభత్సం సృష్టించింది.
- కామారెడ్డి, సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్ ప్రాంతాల్లో భారీ వాన.
- రానున్న గంటలో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉందని HMD హెచ్చరిక.
- హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం.
తెలంగాణ రాష్ట్రంలో శనివారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరిన్ని హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలంగాణలో కుండపోత వర్షం
తెలంగాణలోని పలు జిల్లాలో శనివారం అర్థరాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. కామారెడ్డి, సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్ వంటి ప్రాంతాల్లో భారీ వాన కురిసింది. నార్త్ హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో కూడా అక్కడక్కడా జల్లులు కురిసినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. కాగా రానున్న మరో గంటలో మేడ్చల్, ఘట్‌కేసర్, యాదాద్రి, సిద్దిపేట, జనగాం, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల, హన్మకొండ ప్రాంతాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురవడానికి అవకాశం ఉందని HMD పేర్కొంది. పలు జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసారు. అలాగే హైదరాబాద్ లోని ఉప్పల్, లింగంపల్లి, కాప్రా, నాగోల్, వనస్థలిపురం, హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
హైదరాబాద్‌లో వాతావరణ హెచ్చరికలు
ప్రజలకు అధికారులు హెచ్చరిక
రానున్న గంటల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కోరుతున్నారు.


