|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బ్రేకింగ్: తెలంగాణ టెట్ 2026కు గ్రీన్ సిగ్నల్! నోటిఫికేషన్ ఎప్పుడంటే?

Published: 10-04-2026, 8:30 PM
బ్రేకింగ్: తెలంగాణ టెట్ 2026కు గ్రీన్ సిగ్నల్! నోటిఫికేషన్ ఎప్పుడంటే?
  • 2026 టెట్ నోటిఫికేషన్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, రెండు మూడు రోజుల్లో విడుదల కానుంది.
  • జూన్ రెండో వారంలో టెట్ పరీక్ష నిర్వహణకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
  • గత టెట్ పరీక్షకు 1.95 లక్షల మంది హాజరు కాగా, ఈసారి మరింత పోటీ ఉండనుంది.
  • టెట్ అర్హత సాధిస్తే డీఎస్సీ పరీక్షకు అర్హత పొందుతారు; స్కోర్ ఆధారంగా ర్యాంక్ నిర్ణయిస్తారు.

తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2026 సంవత్సరానికి సంబంధించిన టెట్ నోటిఫికేషన్‌ను విడుదల చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కానుంది.

టెట్ నోటిఫికేషన్‌కు ప్రభుత్వ అనుమతి!

తెలంగాణలో 2026 సంవత్సరానికి మెుదటి విడత ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏడాది రెండుసార్లు టెట్ జరపాల్సి ఉంది. ఇటీవల పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన విషయం తెలిసిందే. ఇందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

దీంతో రెండు మూడు రోజుల్లో టెట్ నోటిఫికేషన్ వెలువడనుంది. జూన్ రెండో వారంలో పరీక్ష నిర్వహించనున్నట్టుగా సమాచారం. జనవరిలో టెట్ 2026 నిర్వహించారు. ఈ రెండో విడత పరీక్షకు 1.95 లక్షల మంది హాజరుకాగా.. టెట్ తప్పనిసరి నుంచి మినహాయింపు ఇస్తారని భావించి చాలా మంది దరఖాస్తు చేయలేదు.

ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి ఏడాది రెండు సార్లు టెట్ ఎగ్జామ్ ను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాదిలో మొదటి టెట్ నోటిఫికేషన్ విషయంపై విద్యాశాఖ… ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.

ఈ క్రమంలో తొలి టెట్‌కు ఈ ఏప్రిల్ నెలలోనే నోటిఫికేషన్‌ ఇచ్చి.. జూన్‌లో పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రభుత్వం అనుమతి ఇస్తే దాదాపుగా ఈనెలలోనే నోటిఫికేషన్‌ విడుదలవుతుంది.

జూన్‌లో టెట్ పరీక్ష నిర్వహణకు సన్నాహాలు

ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్న టీచర్లకు కూడా టెట్‌ తప్పనిసరి కావడంతో వేసవి సెలవుల్లోనే పరీక్ష నిర్వహిస్తే బాగుంటుందని కొందరు సూచిస్తున్నారు. గతడాది చివర్లో విడుదలైన నోటిఫికేషన్ కు కూడా చాలా మంది ఇన్ సర్వీస్ టీచర్లు హాజరయ్యారు.

టెట్ పరీక్షలో ఒక్కసారి అర్హత సాధిస్తే ఏ డీఎస్సీ పరీక్షనైనా రాసుకోవచ్చు. అర్హత సాధించిన అభ్యర్థులు ఎన్నిసార్లు అయినా టెట్ రాయవచ్చు. ఎక్కువ స్కోర్ ఉన్న టెట్ పరీక్షనే పరిగణనలోకి తీసుకుంటారు. మొత్తం 150 మార్కులకు ఈ ఎగ్డామ్ నిర్వహిస్తారు.

టెట్ పరీక్షలో అర్హత సాధిస్తేనే డీఎస్సీ రాయటానికి వీలవుతుంది. ఇక ఈ పరీక్షలో ఓసీ అభ్యర్థులు 60 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇక బీసీ అభ్యర్థులు 50 శాతం, ఎస్టీ, ఎస్సీ, పీహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్ 40 శాతం అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది.

టెట్ అర్హత మార్కులతో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల్లో ఆందోళన ఉన్నారు. అధికారిక ఫలితాల ప్రకారం, 1,00,270 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. మొత్తం ఉత్తీర్ణత శాతం 51.37 శాతం. ఇన్ సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులలో 37,893 మంది అర్హత సాధించారు.

టెట్ అర్హత మార్కులు, పరీక్షా విధానం

గతంతో పోల్చితే టీజీ టెట్ 2026కు భారీగా దరఖాస్తులు వచ్చాయి. పేపర్‌1, 2 కలిపి మొత్తం 2,37,754 దరఖాస్తులు అందాయి. ఇందులో 71,670 మంది ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులున్నారు. టెట్ పరీక్షకు మెుత్తంగా 1,95,181 మంది హాజరు అవ్వగా.. ఇందులో 65,605 మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు ఉన్నారు.

కొత్త నోటిఫికేషన్ అప్డేట్స్ కోసం https://schooledu.telangana.gov.in/SCHOOLEDUCATION/ వెబ్ సైట్ ను చూడొచ్చు.

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.

హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More

టెట్ పరీక్ష రాసేందుకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఇది ఒక ముఖ్యమైన అవకాశం. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే దరఖాస్తు చేసుకొని పరీక్షకు సన్నద్ధం కండి. ఆల్ ది బెస్ట్!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.