|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సైలెంట్‌గా ఓటీటీలోకి తెలుగు క్రైమ్ కామెడీ మూవీ -ఐదు భాష‌ల్లో స్ట్రీమింగ్ -సినిమా డైరెక్ట‌ర్ బ్యాంకు రాబ‌రీ చేస్తే!

Published: 27-05-2025, 5:16 AM
సైలెంట్‌గా ఓటీటీలోకి తెలుగు క్రైమ్ కామెడీ మూవీ -ఐదు భాష‌ల్లో స్ట్రీమింగ్ -సినిమా డైరెక్ట‌ర్ బ్యాంకు రాబ‌రీ చేస్తే!

తెలుగు క్రైమ్ కామెడీ చిత్రం ‘చౌర్యపాఠం’ ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. ఐదు భాషల్లో ప్రసారం అవుతున్న ఈ సినిమాలో ఇంద్రారామ్, పాయల్ రాధాకృష్ణ ముఖ్య పాత్రలు పోషించారు. సినిమా డైరెక్టర్ బ్యాంకు దోపిడీ చేయడం కథాంశం.

Key Points

1

చౌర్యపాఠం ఓటీటీలో విడుదలైంది.

2

ఐదు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

4

సినిమా డైరెక్టర్ బ్యాంకు దోపిడీ కథాంశం.

చౌర్యపాఠం ఓటీటీ ప్రయాణం

లేటెస్ట్ తెలుగు క్రైమ్ కామెడీ మూవీ చౌర్య‌పాఠం సెలైంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చింది. మంగ‌ళ‌వారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ రిలీజైంది. ఐదు భాష‌ల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు తో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో అందుబాటులోకి వ‌చ్చింది. ఓవ‌ర్‌సీస్‌లో ఇర‌వై రోజుల్లోనే ఓటీటీలో రిలీజైన ఈ మూవీ ఇండియాలో మాత్రం నెల రోజుల త‌ర్వాత ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

చౌర్య పాఠం మూవీలో ఇంద్ర‌రామ్‌, పాయ‌ల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లుగా న‌టించారు. మ‌స్త్ అలీ, రాజీవ్ క‌న‌కాల‌, సుప్రియ ఐసోల కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈగ‌ల్ డైరెక్ట‌ర్ కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని క‌థ‌ను అందించిన ఈ మూవీని టాలీవుడ్ డైరెక్ట‌ర్ త్రినాథ‌రావు న‌క్కిన నిర్మించారు. నిఖిల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

కథానాయికలు మరియు నటులు

చౌర్య పాఠం మూవీ కాన్సెప్ట్ డిఫ‌రెంట్‌గా ఉన్న క‌మ‌ర్షియ‌ల్‌గా మాత్రం ఈ క్రైమ్ కామెడీ మూవీ ఆశించిన విజ‌యాన్ని అందుకోలేక‌పోయింది. ఏప్రిల్ నెలాఖ‌రున ఈ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది. సినిమా డైరెక్ట‌ర్ కావాల‌ని క‌ల‌లు కంటాడు వేదాంత్ రామ్‌. కానీ అత‌డితో సినిమా చేయ‌డానికి ప్రొడ్యూస‌ర్లు ముందుకు రారు. ధ‌న‌పాలి అనే ఊరిలోని గ్రామీణ బ్యాంకును త‌న స్నేహితుల‌తో క‌లిసి దోచుకొని ఆ డ‌బ్బుల‌తో సినిమా తీయాల‌ని ప్లాన్ చేస్తాడు.

ఓ స్కూల్ బిల్డింగ్ నుంచి బ్యాంకు లోప‌లి వ‌ర‌కు ఓ సొరంగం త‌వ్వి డ‌బ్బు దోచుకోవాల‌ని అనుకుంటారు. ఊరి స‌ర్పంచ్ వ‌సుధ కార‌ణంగా వారి జీవితం చిక్కుల్లో ప‌డుతుంది. వ‌సుధ గురించి వేదాంత్ రామ్ అండ్ గ్యాంగ్‌కు ఎలాంటి నిజం తెలిసింది? వేదాంత్ రామ్ ప్రేమించిన అంజ‌లి (పాయ‌ల్ రాధాకృష్ణ‌) ఎవ‌రు? వేదాంత్ బ్యాంకును దోచుకున్నాడా? సినిమా తీశాడా? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

కథాంశం మరియు విశేషాలు

క‌న్న‌డ హీరోయిన్ అయినా పాయ‌ల్ రాధాకృష్ణ తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది. చౌర్య‌పాఠంతో కంటే ముందు అలా నిన్ను చేరి, ప్ర‌స‌న్న‌వ‌ద‌నం, నీలిమేఘ శ్యామ సినిమాలు చేసింది. కాజ‌ల్ స‌త్య‌భామ‌లో ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించింది. త‌ర‌గ‌ది గ‌ది దాటి అనే వెబ్‌సిరీస్‌లో లీడ్ రోల్ చేసింది.

చివరగా, చౌర్యపాఠం సినిమా ఓటీటీలో విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథాంశం, నటన, మరియు వినోదం పరంగా చూసినప్పుడు సినిమా ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో తెలియాలంటే చూడటం తప్పదు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.