
జూన్ లో విడుదలైన ‘8 వసంతాలు’ చిత్రం థియేటర్లలో మిశ్రమ స్పందన పొందింది. కానీ, ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన తర్వాత ఈ చిత్రం అనూహ్య విజయం సాధించింది. ట్రెండింగ్‌లోనూ దూసుకుపోతోంది.
Key Points
8 వసంతాలు చిత్రం ఓటీటీలో విడుదలై ట్రెండింగ్‌లోకి ఎంట్రీ.
నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన తర్వాత సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్.
అనంతిక నటన, సినిమాటోగ్రఫీ ప్రేక్షకులను మెప్పించాయి.
తక్కువ బడ్జెట్ సినిమా ట్రెండింగ్‌లో టాప్ 5లో స్థానం.
ఓటీటీ విడుదల తర్వాత ‘8 వసంతాలు’ సక్సెస్
మ్యాడ్ మూవీ ఫేమ్, యంగ్ హీరోయిన్ అనంతిక సనిల్‍కుమార్ ప్రధాన పాత్ర పోషించిన 8 వసంతాలు చిత్రం జూన్ 20వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఫణీంద్ర నర్శెట్టి ఈ మూవీకి దర్శకత్వం వహించారు. కవితాత్మకంగా ఈ రొమాంటిక్ డ్రామా చిత్రాన్ని తెరకెక్కించారు. థియేట్రికల్ రన్‍లో ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. కాగా, ఇటీవలే ఓటీటీలో 8 వసంతాలు చిత్రం స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. అప్పుడే ట్రెండింగ్‍లోకి కూడా వచ్చేసింది.
8 వసంతాలు చిత్రం జూలై 11న నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళంలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. స్ట్రీమింగ్ తర్వాత ఈ చిత్రానికి ఎక్కువగా పాజిటివ్ రెస్పాన్స్ దక్కుతోంది.
థియేట్రికల్ రన్‍లో 8 వసంతాలు మూవీకి అనుకున్న రేంజ్‍లో పాజిటివ్ స్పందన రాలేదు. స్లో నరేషన్‍తో పాటు కొన్ని సీన్ల విషయంలో నెగెటివ్ టాక్ వచ్చింది. రిలీజ్‍కు ముందు ఈ చిత్రానికి బజ్ వచ్చినా.. అనుకున్న రేంజ్‍లో కలెక్షన్లు దక్కలేదు. అయితే, నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చాక ఎక్కువగా పాజిటివ్ స్పందన దక్కుతోంది. ఈ మూవీని ఓటీటీలో చూసిన కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. మనసుకు హత్తుకునేలా కవితాత్మకంగా ఉందని కొందరు రాసుకొస్తున్నారు. కాస్త ఓపిక చేసుకొని చూస్తే మంచి ఫీల్ ఇచ్చేలా చిత్రం ఉందంటూ అంటున్నారు.
పాజిటివ్ రెస్పాన్స్‌తో ట్రెండింగ్‌లో అగ్రస్థానం
8 వసంతాలు చిత్రానికి నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో మంచి వ్యూస్ దక్కుతున్నాయి. దీంతో ఈ లోబడ్జెట్ చిత్రం ట్రెండింగ్‍లోకి దూసుకొచ్చింది. ప్రస్తుతం (జూలై 13) ఇండియా వైడ్ ట్రెండింగ్‍లో ఐదో స్థానానికి వచ్చేసింది. స్ట్రీమింగ్‍కు వచ్చిన మూడు రోజుల్లో ట్రెండింగ్ టాప్-5లోకి ఎంట్రీ ఇచ్చింది.
8 వసంతాలు చిత్రంలో లీడ్ రోల్ చేసిన అనంతిక పై ప్రశంసలు ఎక్కువగా వస్తున్నాయి. ఆమె నటన మెప్పించేలా ఉందంటూ నెటిజన్లు రాసుకొస్తున్నారు. ఎమోషనల్ సీన్లలో బాగా చేశారని అంటున్నారు. ఇక ఈ మూవీ సినిమాటోగ్రఫీ కూడా నెటిజన్లకు బాగా నచ్చేస్తోంది. విశ్వనాథ్ రెడ్డి.. కెమెరా పనితనం అదిరిపోయిందని అంటున్నారు. విజువల్స్ చాలా బాగున్నాయని, సినిమాకు పెద్ద ప్లస్ అని అభిప్రాయపడుతున్నారు.
అనంతిక నటన, సినిమాటోగ్రఫీ ప్రశంసలు
జీవితంలో ఎదురుదెబ్బలు ఎదుర్కొన్న అమ్మాయి జర్నీ కథాంశంగా 8 వసంతాలు చిత్రాన్ని దర్శకుడు ఫణీంద్ర తెరకెక్కించారు. లవ్ స్టోరీతో పొయెటిక్‍గా ఈ చిత్రాన్ని రూపొందించారు. రిలీజ్‍కు ముందు ఫణీంద్ర చేసిన కొన్ని కామెంట్లు కూడా వైరల్ అయ్యాయి. దీంతో ఈ చిత్రానికి మరింత బజ్ వచ్చింది. ప్రమోషన్లను కూడా మూవీ టీమ్ బాగానే చేసింది. కానీ వసూళ్లు మాత్రం పెద్దగా రాలేదు.
ఈ చిత్రంలో అనంతికతో పాటు రవి దుగ్గిరాల, హనురెడ్డి లీడ్ రోల్స్ చేశారు. ఈ చిత్రానికి హేషబ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేనీ, రవిశంకర్ ఈ మూవీని నిర్మించారు.
‘8 వసంతాలు’ చిత్రం ఓటీటీ విడుదలతో అనూహ్యమైన విజయాన్ని సాధించింది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, ప్రేక్షకుల మన్ననలు అందుకుంటూ ట్రెండింగ్‌లో నిలిచింది.


