|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అప్పట్లో తెలుగులో ఓ మూవీ.. ఇప్పుడు రీఎంట్రీ ఇస్తానంటున్న బ్యూటీ యామిని మల్హోత్రా

Published: 19-06-2025, 8:50 AM
అప్పట్లో తెలుగులో ఓ మూవీ.. ఇప్పుడు రీఎంట్రీ ఇస్తానంటున్న బ్యూటీ యామిని మల్హోత్రా

ఒకప్పుడు తెలుగు సినిమాలో నటించిన యామిని మల్హోత్రా, తాజాగా దక్షిణాది సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకుంది. ‘చుట్టాలబ్బాయి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ, తన అనుభవాలను పంచుకుంది.

Key Points

1

యామిని మల్హోత్రా తెలుగు సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వబోతున్నారు.

2

ఆమె 'చుట్టాలబ్బాయి' సినిమాలో నటించారు.

4

తెలుగులో బలమైన పాత్రలు చేయాలనే ఆమె కోరిక.

యామిని మల్హోత్రా తెలుగులో రీఎంట్రీ

ఒకప్పుడు సౌత్‌ సినిమాలంటే చిన్నచూపు ఉండేది కానీ ఇప్పుడు దక్షిణాది చిత్రాలు దేశాన్నే ఏలుతున్నాయి. ఖండాలు దాటి ప్రపంచ సినిమాను తమవైపు తిప్పుకునేలా చేస్తున్నాయి. అందుకే సౌత్‌ సినిమాలు చేయడానికి హీరోయిన్లు కూడా నూతన ఉత్సాహం చూపిస్తున్నారు. హిందీ బిగ్‌బాస్‌ 18 ఫేమ్‌, హీరోయిన్‌ యామిని మల్హోత్రా ( Yamini Malhotra ) కూడా దక్షిణాదిన రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది.

అన్నీ ప్రత్యేకమే దంత వైద్యురాలు అయిన యామిని తెలుగులో చుట్టాలబ్బాయి సినిమాలో ఓ కీలక పాత్ర చేసింది. తాజాగా బాలీవుడ్‌ బబుల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యామిని మాట్లాడుతూ.. నేడు సౌత్‌లో చెప్తున్న కథలు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అక్కడి కథలు, స్క్రీన్‌ప్లే, విజన్‌ కూడా అన్నీ కూడా ప్రత్యేకంగా ఉంటాయి. బలమైన పాత్రలే ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి సౌత్‌లోకి మరోసారి ప్రవేశించడానికి ఇదే సరైన సమయం అని నాకనిపిస్తోంది.

దక్షిణాది సినిమాలపై ఆమె అభిప్రాయం

ఎగ్జయిట్‌ అయ్యా.. కానీ! తెలుగులో, పంజాబీలో చేసిన సినిమాలు రెండూ ఒకేరోజు విడుదలైనప్పుడు చాలా ఎగ్జయిట్‌ అయ్యాను. అయితే అప్పుడు పంజాబీ సినిమాపైనే ఎక్కువ మొగ్గు చూపాను. ఎందుకంటే ఆ భాష నాకు కంఫర్టబుల్‌గా అనిపించేది. తెలిసినవాళ్లు కూడా ఉండటంతో ఇక్కడ ఎదగడం ఈజీ అనుకున్నాను. భాష అడ్డంకి అనుకున్నాను. కానీ అది నిజం కాదని అనుభవంతో తెలుసుకున్నాను అని యామిని చెప్పుకొచ్చింది. ఈ బ్యూటీ ‘చిల్‌ మార్‌ నా బ్రో’ మూవీతో ఇటీవలే బాలీవుడ్‌లో అడుగుపెట్టింది.

‘చుట్టాలబ్బాయి’ తర్వాత ఆమె ప్రయాణం

దక్షిణాది సినిమాలలోని కథలు, పాత్రల ప్రాధాన్యతను గుర్తించిన యామిని మల్హోత్రా, తన రీఎంట్రీతో తెలుగు ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధంగా ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.