|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తెలుగు మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. ఐదు నెలల తర్వాత ఓటీటీలోకి.. ఈవారంలోనే స్ట్రీమింగ్.. ఐఎండీబీలో 8.4 రేటింగ్

Published: 23-06-2025, 1:16 PM
తెలుగు మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. ఐదు నెలల తర్వాత ఓటీటీలోకి.. ఈవారంలోనే స్ట్రీమింగ్.. ఐఎండీబీలో 8.4 రేటింగ్

ఐఎండీబీలో 8.4 రేటింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘ఒక పథకం ప్రకారం’ అనే తెలుగు మిస్టరీ థ్రిల్లర్ సినిమా, ఐదు నెలల తర్వాత ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సాయిరాం శంకర్, ఆషిమా నర్వాల్ నటించిన ఈ సినిమా ఈ వారంలోనే స్ట్రీమింగ్ కానుంది.

Key Points

1

ఐఎండీబీలో 8.4 రేటింగ్ సాధించిన 'ఒక పథకం ప్రకారం' సినిమా

2

ఐదు నెలల తర్వాత ఓటీటీ రిలీజ్

4

జూన్ 27న సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్

‘ఒక పథకం ప్రకారం’ సినిమా ఓటీటీలోకి

మిస్టరీ థ్రిల్లర్ సినిమా అభిమానులకు గుడ్ న్యూస్. ఈ వారం ఓటీటీలోకి ఈ జానర్లో ఓ తెలుగు మూవీ రాబోతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 7న రిలీజైన ఈ సినిమా సుమారు ఐదు నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కానుండటం విశేషం. మలయాళ డైరెక్టర్ వినోద్ విజయన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ రాకపోయినా.. ఐఎండీబీలో మాత్రం 8.4 రేటింగ్ సాధించింది.

ఓటీటీ లోకి రాబోతున్న తెలుగు మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఒక పథకం ప్రకారం. సాయిరాం శంకర్ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమా శుక్రవారం (జూన్ 27) నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని గతంలోనూ వెల్లడించిన ఆ ఓటీటీ తాజాగా సోమవారం (జూన్ 23) కూడా ఓ వీడియో ద్వారా మరోసారి తెలిపింది.

ఐదు నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్

“ఇరికించారు, మోసం చేశారు. అయినా వెనక్కి తగ్గలేదు. అబద్ధాలు, జరిగిన నష్టాలు, నిజం కోసం సాగే పోరాటం చుట్టూ సాగే కథ. ఒక పథకం ప్రకారం.. జూన్ 27న సన్ నెక్ట్స్ లో రిలీజ్ కానుంది” అనే క్యాప్షన్ తో ఆ ఓటీటీ ఈ విషయం వెల్లడించింది.

ఒక పథకం ప్రకారం సినిమాను మలయాళం డైరెక్టర్ వినోద్ విజయన్ డైరెక్ట్ చేశాడు. ఇందులో సాయిరాం శంకర్ తోపాటు ఆషిమా న‌ర్వాల్‌, శృతి సోథి, స‌ముద్ర‌ఖ‌ని కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు. ఈ సినిమాలో లాయర్ సిద్ధార్థ్ నీలకంఠ పాత్రలో సాయిరాం శంకర్ నటించాడు. అతని భార్య సీతగా ఆషిమా నర్వాల్ కనిపించింది. ప్రతి కేసులో విజయం సాధించే అతని జీవితం భార్య మిస్సింగ్ కేసుతో తలకిందులవుతుంది.

సాయిరాం శంకర్ నటన, థ్రిల్లింగ్ కథాంశం

ఆ తర్వాత దివ్య అనే అమ్మాయి హత్య కేసులో అతడే ప్రధాన నిందితుడు అవుతాడు. ఆ తర్వాత కూడా మరో హత్య జరగడం, అందులోనూ సిద్ధార్థ్ పైనే అనుమానాలు వ్యక్తం కావడంతో అతడు చిక్కుల్లో పడతాడు. అసలు ఆ హత్యలు చేస్తున్నది ఎవరు? ఎందుకు అన్నదే ఈ సినిమాలో అసలు మిస్టరీ.

ఒక ప‌థ‌కం ప్ర‌కారం కాన్సెప్ట్‌, క్యారెక్ట‌రైజేష‌న్స్ బాగున్నాయి. ఓ సీరియ‌ల్ కిల్ల‌ర్‌.. అనుమానితుడిగా మారిన హీరో.. అత‌డి వెంట ప‌డుతోన్న పోలీసులు.. ఈ అంశాల చుట్టే చివ‌రి వ‌ర‌కు థ్రిల్లింగ్‌గా మూవీ సాగుతుంది. అస‌లు విల‌న్ ఎవ‌రై ఉంటారు? ఎందుకు హ‌త్య చేస్తున్నారు అనే టెన్ష‌న్‌ను బిల్డ్ చేశారు. ఆడియెన్స్ ఏ మాత్రం గెస్ చేయ‌కుండా కొన్ని ట్విస్ట్‌లు ఉంటే.. మ‌రికొన్ని మాత్రం ఈజీగా తెలిసిపోతుంటాయి. మరి ఈ సినిమాకు సన్ నెక్ట్స్ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

సుమారు ఐదు నెలల తర్వాత ‘ఒక పథకం ప్రకారం’ సినిమా ఓటీటీలోకి రావడం విశేషం. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.