|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

తెలుగు టీవీ సీరియల్స్ 36వ వారం టీఆర్పీ రేటింగ్స్.. బిగ్ బాస్ దెబ్బకు టాప్ 10 నుంచి వెళ్లిపోయిన స్టార్ మా సీరియల్

Published: 18-09-2025, 10:35 AM
తెలుగు టీవీ సీరియల్స్ 36వ వారం టీఆర్పీ రేటింగ్స్.. బిగ్ బాస్ దెబ్బకు టాప్ 10 నుంచి వెళ్లిపోయిన స్టార్ మా సీరియల్

తెలుగు టీవీ సీరియల్స్ 36వ వారం టీఆర్పీ రేటింగ్స్ విడుదలయ్యాయి. ఈ వారం కార్తీకదీపం 2 మళ్ళీ టాప్‌లో నిలిచింది. కానీ బిగ్ బాస్ 9 ప్రారంభం వల్ల కొన్ని సీరియల్స్‌కు తీవ్ర ప్రభావం పడింది.

Key Points

1

కార్తీకదీపం 2 టాప్‌లో కొనసాగుతోంది.

2

బిగ్ బాస్ 9 ప్రభావంతో నువ్వుంటే నా జతగా టాప్ 10 నుంచి బయటకు.

4

జీ తెలుగు ఛానెల్ నుండి 4 సీరియల్స్ టాప్ 10లో చోటు దక్కించుకున్నాయి.

36వ వారం టీఆర్పీ రేటింగ్స్

తెలుగు టీవీ సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ రిలీజ్ అయ్యాయి. వీటిలో ఎప్పటిలాగే కార్తీకదీపం 2 టాప్ లో కొనసాగుతుండగా.. ఈ నెలలో ప్రారంభమైన బిగ్ బాస్ 9 తెలుగు వల్ల తన స్లాట్ కోల్పోయిన స్టార్ మా సీరియల్ నువ్వుంటే నా జతగా టాప్ 10లో నుంచి వెళ్లిపోయింది.

స్టార్ మా ఛానెల్ కు చెందిన సీరియల్స్ టాప్ 10లో ఆరు ఉన్నాయి. నువ్వుంటే నా జతగా సీరియల్ టాప్ 10లో చోటు కోల్పోయింది. తొలి స్థానంలో కార్తీకదీపం 2 నిలిచింది. 36వ వారం ఈ సీరియల్ కు 13.85 రేటింగ్ నమోదైంది. ఇక రెండో స్థానంలో ఇల్లు ఇల్లాలు పిల్లలు కొనసాగుతోంది. ఈ సీరియల్ కు 13.04 రేటింగ్ వచ్చింది. మూడో స్థానంలో గుండె నిండా గుడి గంటలు సీరియల్ నిలిచింది. ఈ సీరియల్ కు అర్బన్, రూరల్ కలిపి 12.35గా ఉంది. అయితే కేవలం అర్బన్ రేటింగ్ చూస్తే మాత్రం ఈ సీరియలే నంబర్ 1 కావడం విశేషం. ఈ సీరియల్ కు అర్బన్ లో 11.18 రేటింగ్ నమోదైంది.

టాప్ 10లో స్టార్ మా సీరియల్స్ ఆధిపత్యం

ఇక మరో స్టార్ మా సీరియల్ ఇంటింటి రామాయణం నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఈ సీరియల్ కు 11.62 రేటింగ్ వచ్చింది. ఐదో స్థానంలో ఉన్న చిన్ని సీరియల్ కు ఈవారం 10.60 రేటింగ్ నమోదైంది. ఒకప్పుడు టాప్ లో నిలిచిన బ్రహ్మముడి సీరియల్ ఈ వారం 10వ స్థానంలో ఉంది. ఈ సీరియల్ కు 7.14 రేటింగ్ నమోదు కావడం విశేషం.

ఇక జీ తెలుగు సీరియల్స్ విషయానికి వస్తే టాప్ 10లో మొత్తం నాలుగు సీరియల్స్ చోటు సంపాదించాయి. అవి ఆరు నుంచి 9 స్థానాల మధ్య ఉన్నాయి. ఈ ఛానెల్లో అన్నింటి కంటే ఎక్కువగా మేఘ సందేశం సీరియల్ కు 8.11 రేటింగ్ నమోదైంది. ఈ ఛానెల్లో నంబర్ వన్ కాగా.. ఓవరాల్ గా ఆరో స్థానంలో ఉంది.

బిగ్ బాస్ ప్రభావం

ఇక ఆ తర్వాతి స్థానాల్లో జగద్ధాత్రి (7.45), చామంతి (7.24), లక్ష్మీ నివాసం (7.18) ఉన్నాయి. స్టార్ మా సీరియల్ నువ్వుంటే నా జతగా టాప్ 10లో నుంచి వెళ్లిపోవడంతో చాలా రోజుల తర్వాత ఆరో స్థానానికి జీ తెలుగు సీరియల్ వచ్చి చేరింది. ఈవారం రేటింగ్స్ లో ప్రధానమైన మార్పు ఇదే అని చెప్పొచ్చు.

చివరగా, ఈ వారం టీఆర్పీ రేటింగ్స్‌లో బిగ్ బాస్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. కొన్ని సీరియల్స్‌కు మంచి, మరికొన్నింటికి చెడు ఫలితాలు వచ్చాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.