
📌 Key Points
- రాష్ట్రవ్యాప్తంగా 15,982 అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధం.
- అంగన్‌వాడీ టీచర్, సహాయకులకు ఇంటర్మీడియట్ అర్హత తప్పనిసరి.
- ఎంపిక ప్రక్రియలో కొత్తగా ఇంటర్వ్యూ విధానాన్ని ప్రవేశపెట్టారు.
- మహబూబ్‌నగర్, పెద్దపల్లి జిల్లాల్లో ఇప్పటికే నోటిఫికేషన్లు విడుదల.
తెలంగాణలో అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. మొత్తం 15,982 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈసారి నియామక ప్రక్రియలో ఇంటర్మీడియట్ అర్హత, ఇంటర్వ్యూ విధానం తప్పనిసరి చేయడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. జిల్లాల వారీగా నోటిఫికేషన్లు త్వరలో రానున్నాయి.
అంగన్‌వాడీల్లో 15,982 పోస్టుల భర్తీకి సన్నాహాలు
Telangana Anganwadi Recruitment 2026 : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. మొత్తం 15,982 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రంలోని 33 జిల్లాల పరిధిలోని ఐసీడీఎస్ (ICDS) ప్రాజెక్టుల్లో ఉన్న ఖాళీలను మహిళా శిశు సంక్షేమ శాఖ ఇప్పటికే గుర్తించింది. ఈ మేరకు జిల్లాల వారీగా విడివిడిగా నోటిఫికేషన్లు జారీ చేసేందుకు స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది.
మొత్తం 15,982 ఖాళీల్లో 3,100 అంగన్‌వాడీ టీచర్ పోస్టులు ఉన్నాయి. మిగిలిన 12,882 పోస్టులు అంగన్‌వాడీ సహాయకురాలు (హెల్పర్స్) విభాగానికి చెందినవి. ఇప్పటికే పెద్దపల్లి జిల్లాలో టీచర్ పోస్టులకు, మహబూబ్‌నగర్ జిల్లాలోని 4 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో టీచర్లు, సహాయకులు కలిపి మొత్తం 177 పోస్టుల భర్తీకి ఆయా జిల్లాల కలెక్టర్లు ఉద్యోగ ప్రకటనలు కూడా విడుదల చేశారు.
రానున్న రోజుల్లో అన్ని జిల్లాల్లోనూ విడివిడిగా నోటిఫికేషన్లు వెలువడనున్నాయి.ఖాళీల వివరాలను ఆయా నోటిఫికేషన్లలో పేర్కొంటారు. షెడ్యూల్ కు అనుగుణంగా… అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారు.
నియామక ప్రక్రియలో కీలక మార్పులు: ఇంటర్వ్యూ తప్పనిసరి
రాష్ట్ర ప్రభుత్వం ఈసారి అంగన్వాడీల నియామక ప్రక్రియలో కీలక మార్పులు చేసింది. అంగన్‌వాడీ టీచర్ , సహాయకుల పోస్టులకు పోటీ పడే అభ్యర్థులకు ఇంటర్మీడియట్ విద్యార్హతను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. అంతేకాకుండా….. ఈసారి ఎంపిక ప్రక్రియలో కొత్తగా ఇంటర్వ్యూ విధానాన్ని కూడా తీసుకువచ్చారు. ఇందుకు సంబంధించిన జీవోలు కూడా జారీ అయ్యాయి.
రాష్ట్రంలోని రెండు మల్టీజోన్ల పరిధిలో ఖాళీలను అధికారులు ఈ కింది విధంగా వర్గీకరించారు…
జిల్లాల వారీగా ఖాళీలు, స్థానికతకు ప్రాధాన్యత
అంగన్‌వాడీ ఉద్యోగాల నియామాకాల్లో స్థానికత అత్యంత కీలకంగా ఉంటుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత గ్రామం లేదా వార్డులో స్థానికులై ఉండాలి. గిరిజన, ఆదివాసీ తండాలు, గూడెలలోని పోస్టులకు స్థానికంగా ఉండే ఎస్సీ, ఎస్టీ మహిళలు మాత్రమే అర్హులవుతారు. తాజా నిబంధనల ప్రకారం…. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి.జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలను పూర్తి చేస్తారు.
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
మొత్తంగా, తెలంగాణ అంగన్‌వాడీ నియామకాలు కొత్త నిబంధనలు, ఇంటర్వ్యూ విధానంతో పారదర్శకంగా జరగనున్నాయి. స్థానికతకు ప్రాధాన్యత ఇవ్వడం, అర్హత ప్రమాణాలను పెంచడం ద్వారా ఈ పోస్టులకు మరింత ప్రాధాన్యత లభించనుంది. అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలి.

