|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ: తెలంగాణ సర్కార్ నిర్ణయం! ప్రతిపక్షాల ఆగ్రహానికి కారణమిదేనా?

Published: 02-04-2026, 9:35 AM
హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ: తెలంగాణ సర్కార్ నిర్ణయం! ప్రతిపక్షాల ఆగ్రహానికి కారణమిదేనా?
  • విద్వేష ప్రసంగాల నియంత్రణ బిల్లును తెలంగాణ ప్రభుత్వం సెలెక్ట్ కమిటీకి పంపింది.
  • ప్రతిపక్షాలు బిల్లులోని నిర్వచనాలపై అభ్యంతరం వ్యక్తం చేశాయి.
  • బీజేపీ ఈ బిల్లు భావప్రకటన స్వేచ్ఛను హరిస్తుందని ఆరోపించింది.
  • ఎంఐఎం మత ప్రచారాన్ని విద్వేషపూరిత ప్రసంగంగా పరిగణించవద్దని సూచించింది.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన విద్వేష ప్రసంగాల నియంత్రణ బిల్లు ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి సిఫారసు చేశారు. దీనికి గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.

విద్వేష ప్రసంగాల బిల్లు: అసెంబ్లీలో దుమారం

విద్వేష ప్రసంగాలకు చెక్ పెట్టే దిశగా తెలంగాణ ప్రభుత్వం.. విద్వేష ప్రసంగాలు- విద్వేష నేరాల నియంత్రణ చట్టం – 2026 పేరుతో బిల్లును ప్రతిపాదించింది. ఈ బిల్లును ఇటీవలే జరిగిన అసెంబ్లీలో సమావేశంలో ప్రవేశపెట్టగా… పలు పార్టీలు అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. ఈ బిల్లుపై అనేక అభ్యంతరాలున్నాయని… తక్షణమే ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని పలువురు ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.

ఈ సరికొత్త బిల్లుపై సభ్యుల నుంచి అభ్యంతరాలు వచ్చిన నేపథ్యంలో…. శాసనసభ కీలక నిర్ణయం తీసుకుంది. సెలెక్ట్‌ కమిటీకి సిఫార్సు చేసింది.కేవలం అధికార కాంగ్రెస్ పార్టీ సభ్యులు మాత్రమే ఈ బిల్లుకు మద్దతు పలకగా.. బీజేపీ వ్యతిరేకించింది. సీపీఐ, ఎంఐఎం సభ్యులు కూడా వ్యతిరేకిస్తూనే…. పలు సవరణలు సూచించారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులను సభ నుంచి బహిష్కరించడంతో వారి తరఫున ఎవరూ మాట్లాడలేదు. కానీ కేటీఆర్ ఈ బిల్లుపై స్పందిస్తూ… తీవ్రంగా ఖండించారు. భావ ప్రకటన స్వేచ్ఛను హారించేలా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకువచ్చిందని ఆరోపించారు. అయితే ఈ బిల్లుపై ఎందుకు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి..? అసలు ఇందులో ఏముందనే వివరాలను ఇక్కడ తెలుసుకోండి….

తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ బిల్లుపై తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సభలో జరిగిన చర్చలో పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి… ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు, ప్రభుత్వంపై విమర్శలను అణచివేయడానికి ఒక సాధనంగా మారుతుందన్నారు. ఈ బిల్లులో “విద్వేషపూరిత ప్రసంగం” మరియు “విద్వేషపూరిత నేరాలు” రెండింటికీ స్పష్టమైన నిర్వచనాలు లేవని చెప్పారు. “ఇది పౌర స్వేచ్ఛకు తీవ్రమైన ముప్పును కలిగిస్తుంది. వాక్ స్వాతంత్ర్యానికి డెత్ వారెంట్ తో సమానం” అని అభిప్రాయపడ్డారు. సవరణలు, విస్తృత పరిశీలన కోసం బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రతిపక్షాల అభ్యంతరాలు: బిల్లులోని లోపాలెన్నో?

ఎంఐఎం సభ్యులు మాట్లాడుతూ… విస్తృత లక్ష్యాల దృష్ట్యా మద్దతు తెలిపుతున్నామని చెప్పారు. అయితే ఈ బిల్లులను కొన్ని అంశాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని అన్నారు. మత ప్రచారాన్ని విద్వేషపూరిత ప్రసంగంగా లేదా నేరంగా పరిగణించకూడదన్నారు. అవాంఛనీయ పరిణామాలు ఎదురుకాకుండా నివారించడానికి జాగ్రత్తగా ముసాయిదా రూపొందించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని సూచించారు.

సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ… ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఒక వ్యక్తి చర్యలు, ప్రకటనలకు మొత్తం రాజకీయ పార్టీ, సంస్థ లేదా సంస్థను బాధ్యులుగా చేసే నిబంధనపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపాదిత బిల్లును పునఃపరిశీలించాలని కోరారు.

సెలెక్ట్ కమిటీకి బిల్లు: ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టేనా?

తెలంగాణ విద్వేష ప్రసంగాలు- విద్వేష నేరాల నియంత్రణ – 2026 బిల్లుపై సెలక్ట్ కమిటీ సమీక్షించనుంది. సభ్యుల అభిప్రాయలను స్వీకరించనుంది. ఆపై ఓ నివేదికను సిద్ధం చేసి… ప్రభుత్వానికి అందజేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ప్రభుత్వం ఏమైనా సవరణలు చేస్తుందా..? లేక యథావిధిగా ముందుకెళ్తుందా అనేది చూడాలి…!

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More

ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపడంతో మరిన్ని చర్చలు జరిగే అవకాశం ఉంది. దీనిపై మరింత స్పష్టత వస్తే మంచిదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తుది నిర్ణయం ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.