
📌 Key Points
- రేపటి నుంచి తెలంగాణ పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి.
- పరీక్షా కేంద్రానికి 30 నిమిషాల ముందు చేరుకోవాలని విద్యార్థులకు సూచన.
- ఓఎంఆర్ షీట్ విధానం ద్వారా పరీక్షలు నిర్వహించనున్నారు.
- నమూనా ఓఎంఆర్ షీట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. విద్యార్థులకు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోవడం, ఓఎంఆర్ షీట్ విధానంపై అవగాహన కలిగి ఉండటం వంటి ముఖ్య సూచనలు చేశారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
పరీక్షలకు సిద్ధమైన తెలంగాణ విద్యార్థులు
రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. రేపట్నంచే పరీక్షలు ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 16వ తేదీతో అన్ని సబ్జెక్టులు పూర్తవుతాయి. పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులకు అధికారులు పలు కీలక సూచనలు చేశారు.
పరీక్షల వేళ అధికారులు పలు ముఖ్యమైన సూచనలు చేశారు. పరీక్షా కేంద్రాలకు 30 నిమిషాల ముందే చేరుకోవాలని చెబుతున్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా తగిన జాగ్రతలు తీసుకోవాలని సూచిస్తున్నారు. సకాలంలో రాకుండా చివరి నిమిషంలో వస్తే…. విద్యార్థులు చాలా ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
విద్యార్థులకు అధికారుల ముఖ్య సూచనలు
పరీక్షా కేంద్రాన్ని కూడా ముందుగానే చూసుకోవాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లోని సెంటర్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా చూసుకోవాలని అలర్ట్ చేస్తున్నారు.
ఓఎంఆర్ షీట్ విధానంపై అవగాహన
గతేడాది మాదిరిగానే ఈసారి పరీక్షల్లో కూడా ఓఎంఆర్ షీట్ విధానం ఉండనుంది. ఈసారి కూడా ఆన్సర్ షీట్ కు ఓఎంఆర్ షీట్ ఉండనుంది. విద్యార్థులు…. ఆన్సర్ బుక్‌లెట్‌కు జతచేయబడిన OMR షీట్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ విషయంపై అవగాహన కలిగి ఉండాలని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలతో పాటు నమూనా మోడల్ ను కూడా అధికారిక వెబ్ సైట్ లో ఉంచినట్లు తెలుపుతున్నారు.
పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలకు హాజరు కావాలని, అధికారులు సూచనలను తప్పకుండా పాటించాలని కోరుతున్నాము. అందరికీ ఆల్ ది బెస్ట్!

